అమితాబ్ కు కూడా కరోన

అమితాబ్ కు కూడా కరోన….

అనేక దేశాధ్యక్షులకు…మంత్రులకు…ఎంపీలకు..ఎమ్మెల్యేలకు…ఆటగాళ్లకు..పాటగాళ్లకు కరోన..
పెద్ద ..చిన్న…కులం …మతం …జాతి…ప్రాంతం ..రంగు..రూపు..భాష భేదాల్లేకుండా అందరికి సమ న్యాయం చేస్తుంది కరోన..
**********
ఉదయాన్నే జనం తక్కువ మంది వుంటారు..తాజా కూరగాయలు వుంటాయని మార్కెట్టుకు వెళితే …కరోనా లాంటి వైరస్సులేమీ లేనట్టు…తగులుకుంటూ… తోసుకుంటూ జనం…
ఇదే మాట కూరగాయల షాపు అతనితో అంటే అతను చెప్పిన మాటలు నాకు నిజం తెలిసేలా చేసాయి.”సార్…మొన్నటి వరకు మలేరియా టీకాలు..బీసీజీ టీకాలు మనం చిన్నప్పుడే వేసుకున్నాం…మనకేమీ కాదు.అవి వేసుకోని ఇతర దేశాల్లో వారికే ఈ జబ్బు వస్తుందని చెప్పారు.ఆ ధైర్యంతోనే మన వాళ్ళు ఇంత ఫ్రీగా వున్నారు.కానీ ఆ టీకాలు కూడా పని చేయనట్టుంది సారు పరిస్థితి చూస్తుంటే…”

amithabh
Image Source – Google | Image by – indianexpress

చాలా మందిలో ఒక మంచి పాజిటివ్ దృక్పథం “నాకు మాత్రం రాదు”..ఎందుకు రాదు అనే ప్రశ్నకు జవాబు లేదు.బిచ్చగాడు మొదలుకొని దేశాధ్యక్షుల వరకు ఎవరినీ వదలని కరోన…మనల్ని వదలుతుందనుకోవటం పెద్ద పొరపాటు.

మెయిన్ రోడ్డు నుంచి ఇంటి కొచ్చేలోపు రోడ్డు పక్కనే ఆరేడు టిఫిన్ శాలలున్నాయి.గమనించ వలసిన విషయం ఏమిటంటే అన్నిటి దగ్గర జనం నిండుగా వున్నారు.టిఫిన్లు తింటున్నారు.అడుగు..రెండడుగుల దూరం పాటిస్తూ…
చెప్పేందుకు ఏమి లేదు.

సరకులు కొందామని పచారీ షాపుకు వెళ్లి ..నా వంతు కోసం నించున్నాను.అప్పటికే ఆ దుకాణం ముందు నో ఎంట్రీ రిబ్బను ఒకటి కట్టి ఉంది.దాని చివర ఉన్న నన్ను గభాలున తాకి…”ఇవి నాలుగు వస్తువులే కట్టండి”అని ఓ కాగితం ముక్క షాప్ యజమానికి ఇచ్చాడు అతను.నన్ను పట్టించుకొనే స్థితిలో లేడు. తన మానాన తను వున్నాడు.
అక్కడ ఉన్నదే ఇద్దరు…అతనితో ముగ్గురు…అంతలా తాకుతూ వెళ్లాల్సిన అవసరం ఏమిటో నాకు అర్ధం కాలేదు. అసలే రెండు మీటర్ల దూరం అంటే కనీసం రెండడుగుల దూరం కూడా పాటించటం లేదు.

ఆయుర్వేద మందులు ఏవో తెమ్మంటే వెళ్లి నించున్నానో లేదో అక్కడికి కొద్ధి మంది వచ్చారు.ముఖాలకు మాస్కులైతే ఉన్నాయి కానీ భౌతిక దూరం లేదు.ఆ షాపతను దూరం ..దూరం అని ఎంత వారించినా..అది తమకు సంబంధించిన విషయం కానట్టుగా జనం.

“హలొ..ఎక్కడ ఉన్నావు?”
“టౌన్ లో ..”
“ఒంటి గంట నుంచి షాపులన్నీ మూస్తారు కదా…ఎందుకు వెళ్లినట్టు”
“నీకు తెలియనిది ఏముంది.ఇంట్లో ఉంటే బోర్…అలా టౌన్ లో తిరిగొస్తే…కొద్దిగా రిలీఫ్ దొరుకుతుంది.”
ఇలాంటి మేధావులెందరో..
సిరివెన్నెల గారు ఆక్రోశించినట్టు…
ఎవరు ఏమై పోనీ..
మారదు ఈ లోకం..
నిగ్గదీసి అడిగినా..
నిప్పులేసి కడిగినా…

  • sheru