ఓ చిట్టి చిలకమ్మా……

అందమైన కానలోనా…… గున్న మామిడి కొమ్మ మీద…..

ఓ చిట్టి చిలకమ్మా….!

బంగారు కలలు కంటూ….. కొండ కోన తిరగసాగె……

తను వలచే గోరువంక….. తన దరికి చేరునంటూ……

తీయని కలలెన్నో…… హాయిగా కనసాగె…….!!

మది దోచిన చెలికాడు…..
ఏ దారంట వచ్చునోయాని…..

చిలకమ్మా….. ఆశగా… చూడసాగె….!!

అది కానని గోరువంక….. మరు గూటికి తరలిపోయే….

మరో చిలకమ్మకు చేరువాయే…..!!

చిలకమ్మ కలలు కల్లలాయె….!

తన కంట కన్నీరు… చలమ లాయె…..!

ఒంటరై….. జీవచ్ఛవమై…..

అలసి….సొలసి….చిలకమ్మ….దివికెగసిపోయె….!

కథ….. ముగిసిపోయె….!
వ్యధ….. మిగిలిపోయె….!!
కన్నీటి…. గాధగా…. ఇల… నిలిచిపోయె…..!!!

  • శకుంతల

3 thoughts on “ఓ చిట్టి చిలకమ్మా……”

  1. HARSHAVARDHANA RAJU

    . …..సూపర్….
    ఓర్చుకో… చిలకమ్మా….
    నేర్చుకో …..జీవితమింతేనమ్మా..
    తెలుసుకో…. మంచిరోజులు వస్తాయమ్మా.

Comments are closed.