
కరోనాలో మానిషే భగవంతుడు
గాలి కనిపించదు….. కాని అనుభూతి ద్వారా తెలుస్తుంది.
ఆకలి కూడ కనిపించదు….. కానీ భావన ద్వారా మనసుకు తెలుస్తుంది.
నమ్మకం కూడా కనిపించదు ….. కాని మనిషిని నిలపెడుతుంది.
భగవంతుడు అనే ఒక అనిర్వచీయమైన శక్తి కూడా ఇలాంటిదే…
కాని సైన్స్ దైవం ఉనికిని ప్రశ్నిస్తుంది…నిరుపించమని అడుగుతుంది…
ఎక్కడైతే సైన్స్ కి కూడ అందని అద్భుతం జరుగుతుందో ఇతరులు దానిని దైవం, దైవత్వం అంటారు…
అందుకే సైన్స్ అంతమైన చోటనే ఆధ్యాత్మికత ప్రారంభం. అవుతుంది అనుకుంటున్నాను.
భక్తుడు దైవానికి మొక్కులు, దైవం పేరుమీదే విరాళాలు సమర్పించి కనిపించని దైవం సహాయాన్ని ఆశిస్తాడు…
కానీ వ్యక్తిలోని భగవంతుడిని చూడదు.
మందిరాలు, మసీదులు, చర్చిల నిర్మాణాల ద్వారా భగవంతుడు తనకు సహాయం చేస్తాడు అని అనుకుంటారు…
కానీ వ్యక్తియొక్క శరీరాలను పవిత్ర మందిరాలుగా చూడరు.
కానీ అదేవ్యక్తి ఎవరైనా ప్రాణాలు కాపాడినప్పుడు మాత్రం ఆ వ్యక్తిని దైవంలా కాపాడినావు నువ్వే నా దేవుడిని అంటాడు…
అందుకే నేమో యుద్ధంలో రాజు శత్రువులను చంపితే వీరుడంటారు …
అదే రాజు తనవారి ఒక్కరి ప్రాణం కాపాడిన దేవుడు అంటారు..
కావున నేను దైవం మనిషిద్వార ప్రకృతిని, ప్రజలను కాపాడుతున్నారు అనుకుంటున్నాను
మనిషికి సహాయం చేయడం ద్వారా ఆ మనిషిలోని దైవాన్ని చేరుతున్నాడు అంటాను
కావున ఎవరైతే మనిషిలో దైవాన్ని మానవ సేవలో దైవత్వాన్ని అనుభూతి చెబుతున్నాడో.
అతడెక్కడున్న స్వర్గాన్ని అనుభూతి చెందుతున్నాడు అని నేను అంటాను…
అందుకనే మానవ సేవే మాధవ సేవ అన్నారు.
కరోనా కాలంలో ఈ మానవ సేవ వలన మాధవ సేవ పొందుతున్నటువంటి ఈ కష్ట కాలంలో మనిషే భగవంతుడు మనిషిలోనే భగవంతుడు..
మనిషికి సహాయం చేసినవాడే భగవంతుడు అందుకే డాక్టర్లే భగవంతుడని అంటున్నాను.
– హర్ష
కరోనాలో మానిషే భగవంతుడు
It’s true harsha…..
S.. Avsrannki minchina sampada ninnu rajuni chesthndi kani akali ni teerche sampada ninnu devudni chestundi…