కామయ్యతోపు – మామిడి తోట

గిరీషుడు కంబోళ రాజ్యానికి రాజు. ఆయన కోట వెనుక ఒక పెద్ద మామిడి తోట ఉండేది.ఆ తోటలోని మామిడి పండ్లు ప్రత్యేకమైనవి. గుమ్మడి కాయ సైజులో ఉండే ఆ మామిడి పండ్లు కేవలం రాజు గారి కి మాత్రమే. మరెవరు తినడానికి గానీ చూడటానికి గానీ వీలు లేదు. కారణం రాజుగారి పూర్వీకుల నుండి రాజులు మాత్రమే తినవలసిన ప్రత్యేక ఔషధగుణాలున్న అత్యంత తీపి కలిగిన మామిడి పళ్ళు. ఇవి చెట్టుకు కొన్ని మాత్రమే కాసేవి. అందుకే దీనికి ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లు ఉండేవి . కామయ్యతోపు అనేవ్యక్తి ఈ తోటకి కాపలాదారు. అతను 60 ఏళ్ల ముసలివాడు. నల్లగా చాలా గట్టిగా ఉండేవాడు. కానీ అతనికి ముక్కు లేదు. అందవిహీనంగా ఉండటం వలన అతనికి వివాహం జరగలేదు. తోటలోకి చీమను కూడా దూర నివ్వడు. అంతే కాదు ఇతని నోటికి అందరూ భయపడేవారు. రెండు రోజులుగా రోజుకు ఒకటి చొప్పున మామిడి పండ్లు మాయమవుతుండటం కామయ్యతాత గమనించాడు. పగలైతే ఎవరూ రారు. బహుశా ఇది రాత్రే జరుగుతుందనీ మరింత పటిష్టంగా కావలి కాయ సాగాడు.తోట చుట్టూ బందోబస్తును ఏర్పాటు చేశాడు . అయినప్పటికీ ఆ రోజు రాత్రి మరొక పండు మాయమైంది. ఎవరు తెంపుతున్నారో అతనికి అర్థం కావడంలేదు. అయినప్పటికీ బాగా పండిన మామిడి పండే దొంగతనానికి గురవుతుందని గమనించాడు. ఈ విషయం రాజుగారికి తెలిస్తే తన తల తెగుతుందని భయపడి ఎలాగైనా ఆ దొంగను పట్టుకోవాలనుకున్నాడు. ఒక ఉపాయం ఆలోచించి ఈసారి చెట్టు మీద బాగా పండిన మామిడి పండు పక్కనే గొంగడి కప్పుకొని కొమ్మల చాటున మాటు వేశాడు. మధ్యరాత్రి ఒంటిగంటకు చెట్ల ఆకుల చప్పుడు అవుతున్నది. కామయ్య తాత మెల్లగా గొంగడి లోనుంచి తొంగి చూశాడు. దాదాపు తాటి చెట్టు అంత ఎత్తు అంటే మామూలు గా మన కరెంటు స్తంభం అంత ఎత్తు లో పొడవుగా ఆకుపచ్చ రంగులో మొహం గుర్రపు తల ఆకారంలో ఉన్నాడు. అతను బాగా పండిన మామిడి పండు కోసం వెతుకుతున్నాడు. వెతుకుతూ కామయ్య తాత దగ్గరికి చేరాడు పండుని కోయ బోతున్న సమయంలో ఒక్కసారిగా కామయ్య తాత ఎగిరి అతనిని వాటేసుకొని గట్టిగా పట్టుకున్నాడు. కామయ్య తాత కళ్ళు తెరిచేసరికి దాదాపు 100 అడుగుల గల ఒక పెద్ద రాతి గుహలో ఉన్నాడు. ఆ గుహ లోపల నాలుగు పక్కల గుర్రపు తల ఆకారాలతో కరెంటు స్తంభం అంత పొడుగ్గా వ్యక్తులు కాపలాదారులుగా కాగడాలతో కాపలా కాస్తున్నారు. వారి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. గుహ మధ్యలో పలక గా ఉన్న పెద్ద రాతి బండమీద అదే గుర్రం తల రూపంలో (కానీ రంగు మాత్రం తెల్లగా ఉంది’) బోర్లా పడుకొని పచ్చని గుడ్డతో కప్పి ఉంది.ఆమె మహారాణి లాంటి స్త్రీ లాగా కనపబడుతంది. ఆమెకు కు వైద్యం చేస్తూ ఒక వైద్యుడు ఉన్నాడు. ఆమె మెడ కింద వీపులో ఒక రొట్టె సైజులో రాచపుండు అయింది.దాని నిండా క్రీములు పురుగులు ఉన్నాయి . ఆ పుండు మురుగు వాసన వస్తుంది.ఆ వైద్యుడు ఈ మామిడి పండ్ల ముక్కలను రసాన్ని ఆ పురుగులకు ఆహారంగా ఇస్తున్నాడు. దీనివలన ఆ క్రిములు మహారాణి శరీరాన్ని తినకుండా మామిడి రసాన్ని పీల్చుకుంటున్నాయి. అంతలో అదే రంగు రూపం కలిగి ఎత్తుగా ఉండి మహారాజు ను పొలే వ్యక్తి అక్కడికి వచ్చాడు.అతనికి తెల్లని పొడవైన గడ్డం ఉంది.ఎర్రని కళ్ళతో వారందరి కన్నా పొడవుగా ఉన్నాడు .అతన్ని చూసిన కామయ్య తాత భయపడ్డాడు. అక్కడే నక్కుకొని దాక్కొన్నాడు. అది చూసిన ఆ రాజు సైగ చేశాడు .వారి లో ఒకడు అతనిని పెద్ద సభలోకి ప్రవేశపెట్టాడు. కామయ్య తాత అసలు మీరంతా ఎవరు? ఇది ఏ ప్రాంతం? ఎందుకు తన అనుమతి లేకుండా పండ్లు దొంగిలించారని ? అది తప్పని మీకు తెలియదా? అని ప్రశ్నించాడు .ఈ విషయం తన మహారాజు కు తెలిస్తే తనకు శిక్ష తప్పదని చెప్పాడు .తనకు న్యాయం చేయాలని గద్దించాడు. ఇతని భాషను ఆ సభలోని పొడవైన గుర్రం ఆకృతి తో ఉన్నవారికి అర్థం కావడం లేదు.ఇతను ఏం చెబుతున్నాడో ఇతను ఎవరో ? ఎందుకు వచ్చాడో? అర్థం కాలేదు. కొంతసేపటి తర్వాత వారందరూ విశ్వంలోని అన్ని భాషలను పరిశీలించుకుని కామయ్యతోపు భాషకు కనెక్ట్ అయినారు .
అప్పుడు వారికి
కామయ్యతోపు వాదన అర్థం అయింది.అక్కడి మహారాజుకు కామయ్యతోపు వాదన సరైనదిగా భావించాడు. దీనికి బదులుగా మీకు ఏం కావాలో అడిగమని తన మంత్రి కి ఆ మహారాజు సైగ చేశాడు. కామయ్యతోపు కు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. దానికి బదులుగా ఆ మంత్రి కామయ్యతోపు కు 3 వరాలు ఇస్తున్నామని దానిలో ఏదైనా ఒకటి కోరుకో వచ్చని చెప్పాడు. 1వది. ఈ రాజ్యం రాజుగారి కూతురుని వివాహం చేసుకొని ఇక్కడే ఉండవచ్చు.2వది. 20 సంవత్సరాల యువకుడిగా మారవచ్చు.3వది. ఇప్పటి వయసు నుండి వంద సంవత్సరాల వరకు ఆరోగ్యంగా బతుకవచ్చు. ఈ మూడు కోరికల లో ఏదైనా కోరుకోమని చెప్పాడు. కామయ్యతోపు తనకు 2వ కోరికైన ఇరవై సంవత్సరాల యువకుడిగా మారాలనుకుంటునానన్నాడు. వారు సరే అన్నారు. కామయ్యతోపు గాడ నిద్ర నుండి మేల్కొన్నాడు చుట్టూ చూస్తే తిరిగి తన తోటలోనే ఉన్నాడు. తన శరీరం 20 సంవత్సరాల యువకుడిగా మారింది. అతను చాలా అందంగా ఉన్నాడు. ఈసారైనా వివాహం చేసుకోవాలనుకున్నాడు. తోట బయట కాపలా వాళ్ళు తోటలో కామయ్యతోపు కనబడటం లేదని ఎవరో ఒక యువకుడు తిరుగుతున్నాడని రాజు గారికి సమాచారం చేరవేశారు. రాజుగారు వెంటనే తోట లోకి వచ్చి, ఎవరు నీవు ? ఈ తోటలో నీకేం పని? కామయ్యతోపు ఎక్కడికి వెళ్ళాడు? అని రాజు గారు యువకుడిని ప్రశ్నించాడు. కామయ్యతోపు ను నేనేనని ఇలా మారానని రాజు గారికి చెప్పాడు. వెంటనే రాజుగారు కత్తి దూసాడు .అలా జరగదని నిజం చెప్పాలని లేదంటే తల నరికేస్తానని చెప్పాడు. యువకుడైన కామయ్యతోపు జరిగిందంతా చెప్పి , లేదంటే రాత్రి తానే స్వయంగా వచ్చి చూడవచ్చని చెప్పాడు. అయితే రాజుగారు తనకు కూడా యువకుడిలా మారాల అనుకుంటున్నానని చెప్పాడు. తను వెళ్ళిన విధంగానే రాజు గారిని కూడా వెళ్ళమని ఉపాయం చెప్పాడు. రాజు గారు కూడా పండిన మామిడి పండు చెట్టు ద్వారా వంద అడుగుల రాతి గుహలోని కి చేరాడు. ఆ గుహ మధ్యలో తాటిచెట్టు అంతా ఎత్తుగా తెల్లగా సన్నగా ఆ లోకం మహారాజు మహారాణి ఉన్నారు. వారు వైద్యుడితో మాట్లాడుతున్నారు.
వైద్యుడు మహారాణికి దాదాపుగా రాచ పుండు తగ్గిపోయిందని చెప్తున్నాడు. అది విన్న గిరీశుడు ఆ తోట తనదని తనకు న్యాయం జరగాలని అడిగాడు. దానికి మంత్రి ఎ
ఇప్పుడు మామిడి పండ్లు అవసరం లేదని జరిగిన దానికి కామయ్యతోపు అంగీకారంతో మీరు యువకుడిగా మారవచ్చని చెప్పి చెవిలో ఒక మంత్రాన్ని చెప్పాడు. కామయ్యతోపు తో మాట్లాడుకొని అతని చెవిలో ఆ మంత్రం చెప్పగానే తనకు యవ్వనం వస్తుందని చెప్పాడు. గిరీశుడు గాఢ నిద్రలో నించి లేవగానే చుట్టూ మామిడి తోట, యువకుడైన కామయ్యతోపు కనిపించాడు. రాజుగారు కామయ్య తోపుతో అతని యవ్వనం తనకు ఇవ్వాలని కోరాడు. దీనికి అంగీకరించ వలసిందిగా కామయ్యతోపు ను ఆదేశించాడు. కామయ్యతోపు తనకు ముక్కు, అందం లేని కారణంగా వివాహం జరగలేదని , ఈసారైనా వివాహం చేసుకోవాలని అనుకుంటున్నానని తను తన యవ్వనాన్ని ఇవ్వలేనని చెప్పాడు. దానికి రాజు కోపంతో కత్తితో కామయ్యతోపు గుండెల్లో పొడిచాడు. చెవిలో మంత్రం చెప్పి 20 సంవత్సరాల యువకుడు గా మారాడు. రాజ్యంలో లోనికి కి యువకుడిగా ప్రవేశించగా, మారిన రాజుని ఎవరూ గుర్తించలేదు తనే రాజు అని చెప్పినా పట్టించుకోలేదు. బదులుగా కామయ్యతోపు ని చంపి రాజు ని మాయం చేశాడనే నేరంతో చెరసాలలో బంధించారు. తను చేసిన పనికి రాజు గారు పశ్చాత్తాపం చెందారు. అనవసరంగా కామయ్య తాతను చంపానని దానికి క్షమించాలని తనకు యవ్వనాన్ని ప్రసాదించిన ఇతర లోక వాసులను వేడుకున్నాడు, ఏడ్చాడు బాధపడ్డాడు. పశ్చాత్తాప ఫలితం గా, ఒకరోజు ఆ యువకుడికి కల వచ్చింది.ఆ కలలో కామయ్యతోపు అంగీకారం లేకుండా అతని వయసును దొంగిలించినందుకు ఈ శిక్ష పడిందని, అది తప్పించ లేమని, తిరిగి తనకు 60 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత ఈ శాపం తొలగిపోతుందని తిరిగి మహారాజు అవుతావని ఇక నుంచైనా తన రాజ్యంలోని వారిని సొంత బిడ్డలుగా చూడాలని ఇతర లోకపు మహారాణి తెలియజేసింది. తర్వాతి కాలంలో రాజు గారికి 60 సంవత్సరాలు నిండగానే తిరిగి అదే రాజ్యం సైనికులు తప్పును తెలుసుకొని అతనినే మహారాజుగా చేశారు.

  • HARSHAWARDHAN RAJU