క్యారెట్ బాబు

మరణానంతర జీవితం Star Voice


అనగా ఒక ఊరిలో ఒక కుటుంబం నివసించేది ఆ కుటుంబంలో లో ఉ ఒక చిన్న బాబు ఎక్కువగా గా రెండు చేతులతో క్యారెట్ పట్టుకొని తినేవాడు ఒకరోజు వాళ్ళ నాన్న ఇంటికి వచ్చే దారిలో ఒక విచిత్రమైన బాక్సు దొరికింది అది చూడడానికి చాలా విచిత్రంగా ఉంది దానిపైన భాషకూడా విచిత్రంగా ఉంది పట్టుకున్నప్పుడు ఆ బాక్స్ ముద్దగా జారుతూ విచిత్ర పదార్థంతో నిర్మితమై ఉంది. ఇంటికి చేరుకున్న వాళ్ల నాన్న తెచ్చిన బాక్సును తెరవడానికి ప్రయత్నించగా కుదరలేదు కత్తితో కోసినా అది లోపలికి వెళుతుంది కానీ తెగటం లేదు దానిని నిప్పుతో అంటించినా అది కాలడం లేదు కొంతసేపటి తర్వాత
క్యారెట్ తినే ఆ బాబు ఒక క్యారెట్ ని అప్రయత్నంగా దాని మీద ఉంచి బయటికి వెళ్లాడు .కొంతసేపటి తర్వాత అక్కడికి వచ్చి చూడగా ఆ బాక్స్ తెరచి ఉండడాన్ని గమనించి వాళ్ళ నాన్నకు చూపించాడు. ఆ బాక్స్ తెరిచి చూడగా అందులో గాజు లాగా వెడల్పుగా వింత పదార్థంతో తయారైన ఒక వస్తువు కనిపించింది . దానికి గోడకు తగిలించే లా వెనక ఒక అమెరిక ఉంది అది పట్టుకుంటే జారుతూ చేతులు లోపలికి వెళుతున్నాయి. గోడకు తగిలించి దాని ఎదురుగా కూర్చున్నారు గోడకు తగిలించిన తరువాత ఆ టీవీ తన సైజును పరిస్థితి బట్టి మార్చుకునేది…. కొంతసేపటికి అది దానంతట అదే ఆన్ అయింది .అది అచ్చం టీవీ లాగే ఉంది దానిలో చుట్టుపక్కల ఉండే టీవీలలో ఏ ప్రోగ్రాం వస్తే ఆ ప్రోగ్రాం ఈటీవీ లో కూడా వస్తుంది . అది చూసిన వారి కుటుంబం ఆశ్చర్యంగా దీనికి కరెంట్ లేదు కేబుల్ కనెక్షన్ లేదు రిమోట్ లేదు ఇది ఎలా వస్తుందో వారికి విచిత్రంగా అనిపించింది. ఆ రోజు రాత్రి అందరూ నిద్రపో గా వాళ్ల నాన్న మాత్రం టీవీ చూస్తూ తను ఏ ఛానల్ పేరు చెప్తే ఆ చానల్ రావడం గమనించాడు. తనకిష్టమైన జబర్దస్త్ కార్యక్రమం రావాలి అన్నాడు వెంటనే వచ్చింది ఆశ్చర్యంగా ఆనందంగా చూడసాగాడు. ఒంటరిగా చూస్తున్న కొద్దిసేపటి తర్వాత ఒక్కసారిగా టీవీ ఆఫ్ అయింది .వెంటనే వాళ్ళ నాన్న మాయం అయ్యాడు. కొంతసేపటి తర్వాత వాళ్ళ నాన్న కోసం వాళ్ళ అమ్మ అక్క వెతక సాగారు .అయినప్పటికీ అతను కనిపించలేదు ఉదయం ఆ ఊరి వాళ్లందరూ వాళ్ళ నాన్న కోసం వెతుకుతుండగా వాళ్ల అక్క టీవీ ముందు కూర్చుని ఉంది. కాసేపటికి అనుకోకుండా టీవీ ఆన్ అయింది .ఆ పాప సంతోషించి కార్టూన్ అని అడిగింది .వెంటనే కార్టూన్ షో రాసాగింది. కొంతసేపటి తరువాత టీవీ ఆఫ్ అయింది వెంటనే ఆ పాప కూడా మాయం అయిపొయింది. వారి కుటుంబం ఊరి ప్రజలు పాప కోసం వాళ్ళ నాన్న కోసం వెతక సాగారు రాత్రి అవ్వగా వాళ్ళ అమ్మ బాబు మాత్రమే ఇంట్లో ఉన్నారు. బాబు మరియు వాళ్ల అమ్మ ఆ టీవీ లో వార్తలు చూద్దామని అనుకున్నారు వెంటనే వార్తలు రాసాగాయి ఆ బాబు క్యారెట్ తింటూ చూడసాగాడు కొంతసేపటి తర్వాత టీవీ ఆఫ్ అయింది వెంటనే వాళ్ళ అమ్మ కూడా మాయం అయింది. ఇది చూసి ఆ బాబు స్పృహ కోల్పోయి నిద్ర పోసాగాడు ఉదయాన్నే ఇరుగుపొరుగు వారికి ఈ విషయం చెప్పి ఏడవసాగాడు ఆ గ్రామ పెద్దలు దానిలోనే ఏదో ఉందని భావించి రచ్చబండ దగ్గరికి దానిని తీసుకురావాలని భావించారు బండమీద ఆ టీవీని ఉంచి, దాని ఎదురుగా కూర్చో సాగారు వెంటనే కొంతసేపటికి ఆ టీవీలో కార్యక్రమాలు రాసాగాయి కొంతసేపు తర్వాత టీవీ ఆఫ్ అయింది వెంటనే టీవీ ముందు కూర్చున్న ఐదుగురు కనిపించకుండా మాయమయ్యారు క్యారెట్ తింటున్న ఆ బాబు మాత్రం అలాగే ఉన్నాడు డు ఆ గ్రామ ప్రజలందరూ భయపడి ఆ టీవీని ఆ బాబుని తన ఇంట్లోనే క్వారంటైన్ చేశారు .ఆ బాబు వాళ్ల అమ్మ నాన్న అక్క కోసం ఏడవ సాగాడు. తను కూడా వాళ్ల అమ్మా నాన్న దగ్గరికి ర వెళ్లాలని అని భావించాడు టీవీ ముందు కూర్చున్నాడు . కొంతసేపటి తర్వాత టీవీ ఆన్ అయింది అప్పుడు అమ్మ నాన్న అక్క కావాలని ఏడవసాగాడు వెంటనే ఆ టీవీలో వారు కనిపించ సాగారు వెంటనే దగ్గరికెళ్ళి ఆ టీవీని పట్టుకొని లోపలికి తొంగి చూశాడు అది వేరే గ్రహం లాగా ఉంది అక్కడ వాళ్ళ అమ్మ నాన్న అక్క ,ఇతర గ్రామ ప్రజలను విచిత్ర మైన వ్యక్తులు… గ్రహ వాసులు వారిని భాధిస్తున్నారు. కొరడాలతో కొట్టి చిత్రమైన పనులను చేయిస్తున్నారు వాళ్ళ అమ్మను ఆగకుండా బట్టలు ఉతికిస్తూనే ఉన్నారు వాళ్ల నాన్నను కట్టెలు కొట్టిస్తూనే ఉన్నారు. వాళ్ల చేతులు రక్తంతో వాచిపోయి ఉన్నాయి వాళ్ళ అక్క ను చీపురుతో ఉడిపిస్తూనే ఉన్నారు ఆగితే శిక్షిస్తున్నారు ఆ బాబు ఒక్కసారిగా ఆ
టీవీ లో కి దూరి అమ్మ అని అరవసాగాడు వాళ్ళ అమ్మ అక్కడికి రావద్దని ఇంట్లోనే ఉండాలని గట్టిగా అరవ సాగింది కానీ ఆ బాబు పరిగెత్తుకుంటూ రాసాగాడు వెంటనే అక్కడి విచిత్ర వ్యక్తులు అతనిపై రేడియం స్టిక్ తో కొట్ట సాగారు తన చేతిలోని క్యారెట్ ని అతనిపై విసిరాడు వెంటనే ఆ క్యారెట్ తగిలిన విచిత్ర వ్యక్తి భస్మం అయ్యాడు. వాళ్ళ అమ్మ ఆశ్చర్యంగా చూడసాగింది తన అమ్మ దగ్గరికి వెళ్లి ఆ బాబు గట్టిగా పట్టుకున్నాడు చేతిలోని మరో క్యారెట్ తగిలిన అమ్మ మామూలుగా అయింది వెంటనే ఆ బాబు కి ఆ క్యారెట్ లోని శక్తిని అర్థం చేసుకొని వాళ్ళ నాన్నను కాపాడుతూ అడ్డం వచ్చిన విచిత్ర వ్యక్తిని క్యారెట్ తో భస్మం చేసి అక్క ని గ్రామస్తులను కాపాడి, టీవీ లో నుంచి ఇంటిలోకి దూకించి బయటికి తీసుకు వచ్చాడు. గ్రామ ప్రజలు
ఆ బాబు సాహసాన్ని తెలుసు కొన్నారు. బాబు వాళ్ళ నాన్న అమ్మ అక్కా ఎంతో సంతోషించారు. గ్రామ ప్రజలు ఆ బాక్స్ ఎక్కడ దొరికిందో అక్కడే పడేయమన్నారు వెంటనే వాళ్ళ నాన్న ఆ బాక్స్ ని దొరికిన చోట పడెయ్య గానే ఆకాశం నుండి నల్లటి మబ్బులు గాలి విసురుగా వచ్చి ఆ బాక్స్ మాయమైంది. ఇది చూసిన గ్రామ ప్రజలు బాబును క్యారెట్ బాబు గా పిలుస్తూ…… ఇతను గ్రామ ప్రజల ప్రాణాలను ఎప్పటికీ కాపాడతాడని అందరూ బాగా ప్రేమతో అతనిని చూసుకుంటున్నారు. అప్పటినుండి అందరూ ఆరోగ్యం కోసం క్యారెట్ తినాలనీ పిల్లలకు వి
తినిపిస్తున్నారు. చూశారుగా పిల్లలు క్యారెట్ తింటే… ఎంతో మంచిదో.

ఈ కథ ద్వారా మీరు తెలుసుకొని….. క్యారెట్లు వద్దనకుండా తింటారు గా. మరి. బాయ్……

 • HARSHA

13 thoughts on “క్యారెట్ బాబు”

 1. హర్ష సార్
  మొదటి సారి క్యారట్ బాబు కథ చెప్పినప్పుడు చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాడు….
  నిన్న రాత్రి క్యారట్ బాబు కథ చెప్పమని , నాకు కూడా క్యారట్ తీసుకో రావాలని చెబుతుంటే మీ కథ పిల్లలు ఎంత ఇష్టంగా వింటున్నరో అర్థం అయ్యింది…..
  మీరు ఇటువంటివి కథలు ప్రతి రోజూ రాయాలని కోరుకుంటున్నాను.

 2. Pushpa Khammam

  Maa Babu mee
  caroot babu kadha vinnapudu chala Santosha padutunnadu

  Mee kadhanu mati matiki vintunnadu
  Thank you Harsha
  SAR

Comments are closed.