జుట్టే బంగారమాయెనే banka shastri

జుట్టే బంగారమాయెనే

 

ఓ కొండమీద ఒక పురాతన శివాలయం ఉండేది. ఆ గుడి కి పూజారి “బంక శాస్త్రి”.ఇతనికి చిన్న వయస్సు లోనే బట్టతల వచ్చింది. ఈయన నెత్తిపై ఎప్పుడూ ఆముదం కానీ, కొబ్బరి నూనె గానీ బంకగా కారుతూ, నుదిటిపై జిడ్డు గా ఉండేది. అందుకే ఇతనికి అసలు పేరు వేరే ఉన్నా, అందరూ ఇతన్ని “banka shastri” అనే పిలిచేవారు.

Banka shastri :-

banka shasri
banka shastri

చాలా సౌమ్యుడు. చీమకు కూడా హాని తలపెట్టడు. ఈయనకు వివాహం చేసుకోవాలనే కోరిక బలంగా ఉండేది. కానీ ఏవేవో కారణాల వలన అతనికి వచ్చిన ఏ సంభంధమూ కుదిరేది కాదు. కాని బంక శాస్త్రి, అసలు కారణం వదిలేసి, రోజులు మారాయనీ!! తన తలపై జుట్టు లేని కారణంగానే తనకు వివాహం కుదరడం లేదని భావించి, తనలో తానే బాధపడేవాడు. జుట్టు పెరగడానికి ఎవరు ఏ చిట్కా చెప్పిన క్రమం తప్పకుండా పాటించేవాడు.జుట్టు పెరగకపోవడాన్ని అద్దం లో చూసుకొని లోలోపల కుమిలిపోయేవాడు. ప్రతిరోజూ గుడిలో పూజలన్నీ ముగిసిన తర్వాత ….రహస్యంగా దేవుడి తో… తనకు నల్లని జుట్టు, ఒత్తుగా రావాలని, పెళ్ళి కుదరాలని కోరుకునే వాడు. 

Ganjappa:

అదే గుడిలో పనివాడు గంజప్ప.ఇతనికి ఆశ, ఆకలీ రెండూ ఎక్కువే. గుడిలోని పులిహోర, కొబ్బరిచిప్పలు, ప్రసాదాలకు కక్కుర్తి పడే వాడు. ఎక్కడున్నా ప్రసాదం పెట్టే సమయానికి ఖచ్చితంగా గుడికి వచ్చి ఆ ప్రసాదం పంచిపెట్టే డ్యూటీని తీసుకొని అందరికీ తక్కువగా పంచి తాను ఎక్కువ గా మిగుల్చుకునేవాడు.గుడిని శుభ్రం చేయడం, చెట్లకు నీళ్లు పెట్టడం, రాత్రి కాపలా కాయడం ఇతని పని. కొండకింద ఉన్న శివన్నగూడెంలో నివసిస్తూ… ప్రతీ విషయయం తనకే తెలుసని అన్నింటిలో తలదూర్చుతూ, banka shastriని నెగలనిచ్చేవాడు కాదు. పాపం నోట్లో నాలుక లేని banka shastri మౌనంగా తన పని తాను చేసుకుంటూ వెళ్ళేవాడు.

ఒక రోజు ఆ గుడికి ఒక బిచ్చగాడు వచ్చాడు. అతడు కట్టుకున్న కాషాయ వస్త్రాలను, పొడవాటి జుట్టు, పెద్ద గడ్డాన్ని చూస్తే అతను దేశ,దేశాలన్నీ తిరిగి వచ్చిన వాడిలా ఉన్నాడు. సరాసరి లోపలికి వస్తున్న అతన్ని చూసిన ganjappa గుడి లోపలికి రానివ్వలేదు. బయటే ఉండాలనీ, ప్రసాదం తర్వాత పెడతారనీ, చీదరించుకుంటూ వెళ్లగొట్టబోయాడు. అది చూసిన “banka shastri”  ganjappa తో! గుడిలో దేవుడు ఎలా ఉంటాడో! అలాగే శరీరమనే ఈ ఆలయంలో కూడా దేవుడు ఉంటాడు. ప్రతి మనిషిలో ఆ దేవుడినే చూస్తూ.. ప్రతి ఒక్కరిని దైవస్వరూపంగా భావిచడమే అసలైన భక్తి!! ఇలా అందరినీ చూడగలిగేవాడే అసలైన భక్తుడు….అంటూ ఆ బిచ్చగాడికి తన దగ్గర ఉన్న అరటి పళ్ళను ఆహారంగా ఇచ్చి గౌరవించాడు. అవి తీసుకున్న ఆ బిచ్చగాడు బయటికి వెళ్లి ఆకొండమీద ఒక చెట్టు కింద మౌనంగా కూర్చున్నాడు. ఒక వారం రోజులపాటు ఆ బిచ్చగాడు ఆ చెట్టు కిందే అలాగే ఉండసాగాడు.పలకరించినా ఎవ్వరితోనూ మాట్లాడేవాడు కాదు. అతడు ఉన్నన్ని రోజులు “banka shastri” అతనికి రెండు పూటలా ప్రసాదాన్ని, పళ్లను, ఆహారంగా ఇచ్చేవాడు. తనకు మిగలాల్సిన ప్రసాదం, ఆహారం బిచ్చగాడికి వెళుతుంటే గంజప్ప కి కోపం వచ్చేది. దాంతో ఎన్ని రోజులు చెట్టుకింద ఉంటావురా! వెళ్ళిపో ! అని ఆ బిచ్చగాడ్ని నానా కూతలు కూస్తూ నోరు పారేసుకొనేవాడు . ఇవేవీ పట్టించుకోని ఆ బిచ్చగాడు, వాడి లోకం లో వాడుండేవాడు.

ఒక రోజు ఉదయాన్నే, సుప్రభాత సేవ జరుగుతున్న సమయంలో హాఠాత్తుగా బిచ్చగాడు గుడి లోపలికి వాడివడిగా వచ్చాడు.ఆ రోజు ganjappa కూడా పూజలో ఉండటంతో వాడిని అడ్డుకోలేక పోయాడు. ఆ బిచ్చగాడు వాడి రెండు చేతులతో రెండు పెద్ద పెద్ద చెంబులను, ఒక చిన్న మందుల సంచి ని తీసుకోచ్చి గర్భగుడి ఆవరణ ముందు పెట్టి వాటి ఎదురుగా కూర్చున్నాడు. అది చూసిన banka shastri, ganjappaఇవి ఏమిటి ? అని ప్రశ్నించారు. “ఒకటి బంగారు చెంబు,మరొకటి రాగి చెంబు, ఈ చిన్న సంచిలోనివి 30 మింగే, మరో 30 తలకు రాసుకునే వనమూలికలని వాడు సమాధానం చెప్పాడు” .ఇవి ఎందుకు తెచ్చావని మళ్ళీ ఆ బిచ్చగాడ్ని అడిగారు ? వాటి గురుంచి చెబుతూ ….. “ఈ సంచిలోని ఒక రకం మూలికను ఈ రెండు చెంబులలో ఏదైనా ఒకదానిలో వేసి నీటిలో రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే తాగి, మరో మూలిక నీళ్ళను తలకు రుద్దుకుంటే, బంగారు చెంబులో నీళ్లు తాగి, తలకు రుద్దుకున్న వారికి బంగారు జుట్టు, రాగి చెంబు లోని నీటిని తాగి, తలకు రుద్దుకున్న వారికి నల్లని జుట్టు వస్తుందని చెప్పాడు . ఈ మూలికల ప్రభావం చేత 30-35 రోజుల్లోనే నెత్తి మీద జుట్టు ఒత్తుగా గా మొలుస్తుందని చెప్పాడు. కావున ఓ ! బంక శాస్త్రి అయ్యగారు!! మీకు ఏ చెంబు కావాలి ? బంగారు దా? రాగి దా? “అని అడిగాడు. ‘నా మనసులోని బాధ ఇతనికి ఎలా తెలిసింది?’ అని బంక శాస్త్రి ఆశ్చర్యపోయాడు!! నా సమస్య ఇతనికి ఎలా అర్థమైందో !! నెవ్వరపోయి ఎంచెప్పలో తెలియక గందరగోళంలో పడ్డాడు.ఇతను ఖచ్చితంగా ఏదో స్వామిజినే అయ్యుంటాడు, లేదంటే ఆ దేవుడే నాకోసం పంపించి ఉంటాడనుకొని అతనికి ఒక్కసారిగా భక్తిభావం పెరిగిపోయింది . వెంటనే గంజప్ప మధ్యలో దూరి… బంగారు చెంబు,30 జతల మూలికలను తనకు ఇవ్వమని, తనకు బంగారు జుట్టు కావాలని బిచ్చగాడిని బ్రతిమలాడ సాగాడు. వాడిని పట్టించుకోని ఆ బిచ్చగాడు తిరిగి “బంక శాస్త్రిని” తనకు ఏ చెంబు కావాలి? బంగారు దా? రాగి దా? అని మళ్ళీ ప్రశ్నించాడు. ఇన్ని రోజులకు తనను శివుడు కరుణించాడని, తనకు బంగారు జుట్టు అవసరం లేదని, నల్లని జుట్టు కొద్దిగున్నా చాలని రాగి చెంబు,30 జతల వనమూలికలను ఇవ్వమని మర్యాదగా వేడుకున్నాడు. వెంటనే ఆ బిచ్చగాడు తథాస్తు!! అని ఆశీర్వదించి!! ఆ రాగి చెంబును 30 జతల వన మూలికలను మూటగట్టి అక్కడ పెట్టి, దీనితో పాటుగా ప్రతీరోజూ ఉదయం 30ని!! ప్రాణాయామం చేయాలని చెబుతూ ,త్వరలో శుభవార్త వింటావని దీవిస్తూ…. గబగబా నడుచుకుంటూ… తిరిగి బైటికి వెళ్ళిపోసాగాడు. దీనికి గంజప్ప సంబరపడిపోయి… . బంకశాస్త్రి తెలివితక్కువ వాడని అనుకొంటూ…..ఆ బిచ్చగాడి వెంటనే పరిగెత్తుతూ… తనకు ఆ బంగారు చెంబు,30జతల వన మూలికలు ఇవ్వమని, తనకు బంగారు జుట్టు కావాలని, మీరేం చెప్పినా చేస్తానని చెప్తూ కాళ్లావేళ్లా పడి బ్రతిమలడాడు . ఇవేవీ పట్టించుకోని ఆ బిచ్చగాడు గబగబా నడుచుకుంటూ ఎటో వెళ్ళిపోయాడు.
మరుసటి రోజు నుండి ఆ బిచ్చగాడు చెప్పినట్టుగానే బంకశాస్త్రి రాగిచెంబులో రోజుకొక వన మూలిక ను వేసి దానిని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తాగడం, కొంచెం నీటిని తలకు రుద్దుకోవడం, ఉదయం 30ని!! ప్రాణాయామం చేయడం ప్రారంభించాడు.మొదటి రెండు రోజులు ఏ ప్రభావము కనిపించలేదు. దాంతో గంజప్ప!! ఎవడు జుట్టు గురించి చెప్పినా…! చివరికి బిచ్చగాడు చెప్పినా! వాడి మాట వింటాడు!! ఈ తెలివి లేని అయ్యగారు! అనుకొని తనలో తానే నవ్వుకున్నాడు. కానీ 3వ ఈ రోజు నుండి ఆశ్చర్యంగా తలపై జుట్టు మొలకలు ప్రారంభమయ్యాయి. క్రమంగా 5వ రోజు కల్లా జుట్టు ఎదుగుదల ప్రారంభమయి, నల్లబడింది. దీంతో గంజప్ప కు ఆశ మొదలైంది. ఎలాగైనా ఆ బిచ్చగాడిని పట్టుకొని ఆ బంగారు చెంబు,30జతల మూలికలను సాధిస్తే తనకు బంగారు జుట్టు వస్తుందని ఆశ పుట్టింది . ఆ బంగారు జుట్టును అమ్ముకొని కోటీశ్వరుడు కావచ్చనుకున్నాడు. వెంటనే బయలుదేరి జిల్లాలోని ముఖ్యమైన దేవాలయాలలో ఆ బిచ్చగాడి కోసం వెతకడం ప్రారంభించాడు. ఎలాగో తన పక్క ఊరి లోని ఒక ముఖ్య గుడిలో చెట్టు కింద ఆ బిచ్చగాడిని కనిపెట్టాడు . వాడు నిద్ర పోయే వరకు ఎదురుచూసి నిదానంగా వాడి సంచి లోని బంగారు చెంబును ,30జతల వన మూలికలను దొంగిలించి, ఏమీ తెలియానట్లుగా వాడు పనిచేసే కొండమీది శివాలయానికే తిరిగి చేరాడు. తనకు ఆ బిచ్చగాడు ఈ బంగారు చెంబు, 30 జతల వనమూలికల ను దయతో ఇచ్చాడని అయ్యగారికి చెప్పి సంతోష పడ్డాడు . banka shastri లాగే వీడూ ఆ నీటిని తాగుతూ… తలకు రాసుకునేవాడు. క్రమంగా గంజప్ప కు 5వ రోజు నుండి వాడి జుట్టు బంగారు జుట్టు గా మారడం మొదలైంది.నెల రోజుల వీరి కోర్సు పూర్తయ్యే సరికి బంక శాస్త్రి కి జుట్టు బాగానే వచ్చింది, దాంతో తన తల, నుదిటి పై జిడ్డు,బంక తగ్గి మొహం కళగా తయారైంది. ఆనోటా ఈనోటా బంక శాస్త్రి కి నల్లని జుట్టు,గంజప్ప కు బంగారు జుట్టు మొలిచిందని, గుడిలో గొప్ప మహత్యం జరిగిందని, దేవుడే దిగివచ్చి మరో రూపంలో దర్శనం ఇచ్చాడని పుకారు లేచింది. ఆ పుకారుతో చుట్టుపక్కల ఊర్ల నుండి వీరిని చూడడానికి జనం కుప్పలు తెప్పలుగా రాసాగారు. ప్రతి ఒక్కరూ బంక శాస్త్రి నల్లని జుట్టు, రాగి చెంబుని – గంజప్ప బంగారు జుట్టు – బంగారు చెంబును దర్శించుకోవడానికి జనాలు బారులు తీరడం మొదలు పెట్టారు. బంక శాస్త్రికి నిండు జుట్టుతో చాలా కళ వచ్చిందనీ, బట్టతల ఉన్న వారందరూ banka shastriని కలిసి ఆ రాగి చెంబు ను దర్శనం చేసుకొనేవారు. ఆ జుట్టు కథను, ఆ రహస్యాన్ని మాకు చెప్పాలని పట్టుబట్టే వారు. ఆ రాగిచెంబులోనే తీర్థం తీసుకొని తలకు రాసుకునే వారు. కొందరైతే రాగిచెంబునే తలకు గట్టిగా రుద్దుకొని, ఆ చెంబుకు బొట్టు పెట్టి దండం పెట్టుకునేవారు. కానీ బంక శాస్త్రి చెంబు కు పూజ అనవసరమనీ వారించేవాడు. దీనిలో అసలైన వన మూలిక లేదని అది ఆ బిచ్చగాడికే తెలుసని చెప్పేవాడు.దానికి ఒప్పుకోని కొందరు ఆ బిచ్చగాడి అడ్రస్ చెప్పమని బ్రతిమలాడేవరు. అది గంజప్పకే తెలుసని చెప్పడంతో ఆ బిచ్చగాడి అడ్రస్ కోసం వారందరూ గంజప్ప వెంటపడేవారు. దీంతో గంజప్ప కు బాగా డిమాండ్ పెరిగింది.వచ్చిన వారంతా గంజప్ప ను ప్రత్యేకంగా చూసేవారు.అతని బంగారుజుట్టు ను కళ్ళకు అద్దుకునేవారు. పండ్లు స్వీట్లు తెచ్చి ఇచ్చేవారు. ఇది బంగారు జుట్టేనా? కాదా? అని ఆశ్చర్యపోతూ జుట్టుకు నమస్కరించుకునేవారు.రకరకాల పూలు చల్లేవారు. మొదట్లో ఇది గంజప్పకు బాగా సరదాగా అనిపించేది. తన జుట్టు గురించిన గొప్ప గొప్ప విషయాలను కళ్లకు కట్టినట్టుగా, కథలు కథలుగా వివరించేవాడు. ఇతర రాష్ట్రాల నుండి కూడా గంజప్ప ని చూడడానికి వచ్చేవారు.తీరిక దొరకనంత జనం చుట్టుముడుతూ చివరికి తన ఇంటికి, తన ఊరికి కూడా వచ్చేవారు. ఇది చూసిన ఆ శివన్నగూడెం లోని చాలామంది ఇతనిది నిజంగానే బంగారు జుట్టేనా? అని పరీక్షించాలనుకునేవారు కానీ, గంజప్ప ఎవరిని తన జుట్టును ముట్టుకొనిచ్చే వాడు కాదు. దీంతో గంజప్పది నిజంగానే బంగారుజుట్టేనని ఆ ఊరివాళ్లు అనుకునేవారు…

ఒకరోజు గుడిలో పని ముగించుకొని తన ఊరికి వస్తున్న గంజప్ప ను కొంతమంది దొంగలు దారికాశారు. ఒక్కసారిగా వారు అతనిపై దూకి గొంగడి కప్పారు, ఇద్దరేమో రెండు చేతులు రెండు కాళ్ళు గట్టిగా పట్టుకోగా…. మరో ఇద్దరు గంజప్ప బంగారు జుట్టును, గట్టిగా…. గడ్డి పీకి నట్లుగా పీకి, లాక్కొని ఒక కవర్లో వేసుకొన్నారు. దొంగలు ఎంత జుట్టు పీకితే అంత బంగారం వస్తుందనే ఆశతో గంజప్ప తలపై ఒక్క వెంట్రుక కూడా లేకుండా కోడిబూరు పీకినట్టు గా మొత్తం పీకి కవర్లు నింపుకున్నారు. అలా జుట్టు పీకుతూ ఉండగా వచ్చే నొప్పిని తట్టుకోలేక గంజప్ప ఎంతగానో అరవ సాగాడు. కానీ దొంగలు అతని అరుపు బయటకు వినపడకుండా నోటినిండా గుడ్డలు గట్టిగా నొక్కిపెట్టి ఊరిబయటే అతన్ని వదిలేసి వెళ్లారు. దీనివలన అతని తల, మొహం మొత్తం వాపుచేసి, నెత్తురు కమ్మింది. అతని బంగారు జుట్టు చూడటానికి వచ్చే భక్తులే, గంజప్పను ఆ పరిస్థితుల్లో చూసి హాస్పిటల్లో చేర్చారు. తలకు డాక్టర్లు పెద్ద గుడ్డచుట్టి తెల్లగా కట్టు కట్టారు. ఇంట్లో రెస్టు తీసుకుంటున్న గంజప్ప విషయం తెలియని కొందరుజనం బంగారు జుట్టు చూడడానికి ఇంటికే వచ్చేవారు.పరామర్శించిన వారు ఆశర్యపోయి, అయ్యోపాపం ఎలా జరిగిందని? ఎవరు బంగారు జుట్టును పీక్కోని వెళ్లరాని? అడిగేవారు.రకరకాల ప్రశ్నలు వేస్తున్న వారిని చుస్తే అతనికి చిర్రెత్తు కొచ్చేది. రోజురోజుకూ గంజప్ప, వచ్చిన వారికి ఆ బిచ్చగాడు ఎక్కడ ఉంటాడో!! సమాధానం చెప్పలేక, బంగారు చెంబు ను చూపించలేక విసుగెత్తి పోయేవాడు. నెత్తి నొప్పిని తట్టుకోలేని గంజప్ప, ఈ బంగారు జుట్టు తో కోరి కష్టాలు తెచ్చుకొన్నందుకు …..బాగా బుద్ధి వచ్చిందనీ రెండు చెంపలు వాయించుకునేవాడు.

మరోవైపు బంక శాస్త్రి సలహాల కోసం, తలపై వెంట్రుకలు రాలుతున్న వారు, వెంట్రుకలు మొత్తం రాలినవారు, పూర్తిగా బట్టతల వచ్చేసినవారు ఆలయనికి వచ్చి పూజ,భక్తిని వదిలిపెట్టి జుట్టు గురించే మాట్లాడుతూ, చర్చపెట్టే వారు. రాగి చెంబు తీర్థం కోసం, బిచ్చగాడి మూలికా వైద్యం కోసం ఆరాలు తీసేవారు. అసలు పని వదిలిపెట్టి, వీరి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక “బంక శాస్త్రి” విసిగి పోయేవాడు. అనవసరంగా జుట్టు కోసం ఆలోచించకూడదని ఆ జనాలను చూసి తను నేర్చుకొన్నాడు.ఇన్నిరోజులు తాను చేసిన పిచ్చిపనే వీరూ చేస్తున్నారని… చేసిన తప్పును గ్రహించి తనలో తానే సమాధానపడి ఇలా చేయరాదని నిర్ణయించుకున్నాడు. జుట్టు కోసం అనవసరంగా ఆలోచించవద్దని, ఇది నా అనుభవమని ఇతరులకు చెప్పినా సరే!! జనాలు ఊరుకొనే వారుకాదు.నీకు జుట్టు వచ్చింది కాబట్టి అలా మాట్లాడుతున్నారని, రాగిచెంబు తీర్థం కావాలని బతిమాలేవారు…..ఆ తీర్థం తీసుకోకుండా వెళ్ళేవారే కాదు. వీరికి ఎలా చెప్పలో, ఏం చేయలో, బంక శాస్త్రి కి అర్థంకాక తల పట్టుకునేవాడు.

బంగారం కోసం ఒక వ్యక్తి పై దాడిచేసి జుట్టుపీకి కవర్లో తీసుకెళ్ళారనే విషయాన్ని న్యూస్ పేపర్ లో తెలుసుకొన్న జనవిజ్ఞాన వేదిక వారు కొండమీద శివాలయం ఉన్న ఊరికి చేరుకున్నారు. గంజప్పది బంగారు జుట్టు కాదని “హైడ్రోజన్ పెరాక్సైడ్” అనే రసాయనాన్ని, మరికొన్ని కెమికల్స్ తో కొద్ది, కొద్ది మొత్తాలలో ఎక్కువరోజులు జుట్టుకు రాసుకోవడం వలన జుట్టు బంగారు వర్ణంలోకి మారిందని చెప్పారు. ఇది ఒక కెమికల్ రియాక్షన్ అని దీనిని జుట్టురంగు కోసం, జుట్టు అందం కోసం సాధారణంగా పెద్ద, పెద్ద నగరాలలో ఉపయోగిస్తారని చెప్పారు. మీలో ఎవరు రాసుకున్నా, వారికీ బంగారు జుట్టు వస్తుందని వారి ముందు చేసి చూపించారు. మీరనుకునే “బంగారుచెంబు” లో బంగారమే లేదని అది ఉట్టి కోటింగ్ మాత్రమే నని వారికి చూపించారు. అయినా బంగారు చెంబులో నీళ్లు తాగితే బంగారు జుట్టు రావడం కేవలం అపోహేనని
తేల్చిచెప్పారు. అలాగే బంకశాస్త్రి కి ఐరన్, జింక్ , మల్టీ విటమిన్ లోపం ఒకవైపు, పెళ్లి కాలేదనే ఒత్తిడి, టెన్షన్ మరొకవైపు, ఈ రెంటివల్లే అతనికి జుట్టు ఊడిపోయి, బట్టతల వచ్చిందనీ చెప్పారు. బిచ్చగాడు ఇచ్చిన వనమూలికలు ఏవో !!కావని అవి మామూలుగా ఆయిర్వేద మెడికల్ షాపు ల్లో అమ్మే మల్టీ విటమిన్ , అశ్వగంధ చూర్ణ గుళికలని, ఇవి వాడటంవల్ల అతని ఆరోగ్యం మెరుగుపడిందని,30 రోజులు ప్రాణాయామం వల్ల స్ట్రెస్ తగ్గి తిరిగి జుట్టు మళ్ళీ వచ్చిందని… ఇదంతా ఒక సైంటిఫిక్ ప్రక్రియని చెప్పారు. వంశపారంపర్యంగా వచ్చే బట్టతల ఎవరికైనా తప్పదని తేల్చి చెప్పారు…….. బట్టతల కలిగించే జన్యువులు కేవలం మగవారికే ఉంటాయనీ, ఆడవారికి ఉండవని, అందుకే మొగవారికే బట్టతల వస్తుందనీ…ఆడవారికి రాదని అవగాహన కలిగించారు. ఆరోగ్యము, పరిశుభ్రతే మనిషికి అందమని…… వ్యక్తిగత సంతోషాన్ని జుట్టు తో ముడి వేయరాదని అక్కడి ప్రజలకు తెలియజేశారు…..ఈ విషయాలను కళ్ళకు కట్టినట్లుగా చూసిన జనం వాస్తవాలను అర్థంచేసుకొని మూడనమ్మకలకు స్వస్తి పలికారు.

ఈ సంఘటన తో బాగా ఫెమస్ అయిన బంక శాస్త్రిని వివాహం చేసుకోవడానికి పెద్ద పెద్ద సంభంధాలే ముందుకి వచ్చాయి. వెంటనే బంకశాస్త్రి ఒక సంభందాన్ని టపీమని కుదిరించుకున్నాడు. తలపై జుట్టునొప్పీ,బాధలు తగ్గిన గంజప్ప, దురాశను వదిలి,ఇతరులను గౌరవించడం నేర్చుకొని….. బంకశాస్త్రి పెళ్ళి పనులు చూసుకోసాగడు….. పెళ్ళి లో బంక శాస్త్రి కాళ్లు కడుగుతున్న, తన పిల్లనిచ్చిన మామను చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు!!! ఆయన ఎవరో కాదు….. వాళ్ల గుడి కి వచ్చి చెట్టు కింద కూర్చున్న ఆ బిచ్చగాడే, కానీ జుట్టు గడ్డం లేకుండా చాలా దర్జా గా ఉన్నాడు.!!! వెంటనే కేకలు పెట్టి గంజప్పను పిలిచాడు. ఆ బిచ్చగాడిని చూసిన వీరిద్దరూ…. ఖంగుతిన్నారు. అప్పుడు ఆ బిచ్చగాడు మాట్లాడుతూ…. నేను కేరళ లో ఒక పెద్ద ఆయుర్వేద డాక్టర్ నని నా ఎస్టేట్స్ ని, ఆస్తి నీ చూసుకోవడానికి, నా ఒక్కగానొక్క కూతురు ని వివాహం చేసుకోవడానికి ఒక మంచి వ్యక్తి కోసం వెతుకుతున్నానని అందుకోసమే మారువేషంలో వచ్చి నిన్ను పరీక్షించానని, మాది కూడా మీ ఊరే నని, మా తాతలు మీ తాతలు వరుసకు బిందువులు అవుతారనీ, చిన్నప్పుడే మా నాన్నగారి వైద్యం కోసం కేరళ వెళ్ళి అక్కడే సెటిల్ అయ్యామని చెప్పాడు. నీవు…బంగారు చెంబు ను కాదని రాగి చెంబు ను కోరుకోవడం వల్లనే నా పరీక్షలో నెగ్గావనీ, లేదంటే నేను వెనుకకు వెళ్ళి పోయే వాడినని చెప్పాడు. నీ గుణసంపదే నిన్ను గెలిపించిందని ఆలింగనం చేసుకున్నాడు. దీంతో  banka shastri కి, పిల్ల తో పాటు కోట్ల ఆస్తి కూడా రావడంతో అతని సంతోషానికి హద్దులు లేవు…. పెళ్లి ఘనంగా జరిగింది. రిసెప్షన్ కేరళలో….. కేరళ వెళ్లడానికి అందరూ రెడీ అవుతున్నారు.
మరి మీరూ కేరళా కి వస్తారా?….

బాయ్……..

ఎన్.హర్షవర్ధన్ రాజు.

1 thought on “జుట్టే బంగారమాయెనే banka shastri”

Comments are closed.