పంతంగి toll plaza

పంతంగి toll plaza

 

గత వారం రోజుల నుంచి పంతంగి టోల్ ప్లాజా గేటు దగ్గర వాహనాల రద్దీ చూస్తే సంక్రాంతి పండుగ ముందు హడావిడి గుర్తుకొచ్చింది.లాక్ డౌన్ విధిస్తున్నారన్న వార్త కంటే కూడా బతుకుంటే బలుసాకు తిని తమ గ్రామాల్లో బతకొచ్చు…అనే భావన అందరిలోనూ ఉంది.ఇది దిగువ మధ్య తరగతి ..మధ్య తరగతి వారిలో వుందనుకుంటే పొరపాటు.స్థితి మంతుల్లో కూడా బతుకు భయం పట్టుకుంది.పట్టణాలు ..నగరాలు ఇక ఏమాత్రం సేఫ్ ప్లేసులు కావని..ఈ రోజు కరోన వచ్చింది..ముందు ముందు ఇలాంటి ఏ వైరసో వచ్చి తమ జీవితాలను ఎక్కడ బలి తీసుకుంటోందోననే భయం నగర,పట్టణ వాసుల్లో వెంటాడుతుందనేది వాస్తవం..

 

కరోన నేర్పిన పాఠాల్లో ముఖ్యమైనది అపార్ట్ మెంట్ల మోజు తగ్గించింది.నగరాలు..పట్టణాలు అంటే మనసులో తెలియని ఒక విధమైన భయం కలిగించింది.
చాలా మంది తమ ఊర్లకు తిరిగి వెళుతున్నారు.అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవట్లేదు.
విందులు..వినోదాలు…ఒకనాటి కలలైనాయి.యాత్రలు…వినోద విహారాలు మాట వరుసకు కూడా అనుకోవటం లేదు.ఇంట్లో ఏమి వండిన అది పరమాన్నంలా తినేస్తున్నారు.
బంధువుల ఇళ్లకు రాకపోకలు తగ్గించారు.తాము వీలైనంతగా వెళ్ళటం మానేశారు.
గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకరమయ్యేలా వుంది.
ప్రతి చిన్న పనికి నగరాల మీద ..పట్టణాల మీద ఆధారపడకుండా తమ గ్రామాలోనే ఆ ఏర్పాట్లు చేసుకోవటం ముఖ్యం.
గ్రామాల నుంచి ప్రజలు పట్టణాలకు..నగరాలకు తరలి వెళ్ళటానికి మూడు కారణాలు ముఖ్యంగా కనిపిస్తున్నాయి.ఉపాధి..గ్రామాల్లో సరిపోయినంత పని దొరకక…యువకులు..వృద్దులు..స్త్రీలు అనే తేడా లేకుండా అందరూ నగరాలకు.
పట్టణాలకు వెళుతున్నారు.
రెండో కారణం విద్య…తమ పిల్లలు తమకుంటే విద్యావంతులు కావాలనీ…మంచి కోర్సుల్లో చేర్పించాలని కుటుంబాలతో సహా అక్కడికి వెళ్లి వుంటున్నారు.
మూడవ కారణం వైద్యం..గ్రామాల్లో సరైన వైద్య సదుపాయాలు లేవని పట్టణాలకు వెళుతున్నారు.
ఈ మూడు రంగాలను దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లోనే..మంచి ఉపాధి.. విద్య..వైద్యం ఏర్పాట్లు సమిష్టిగా చేసుకున్నట్లైతే ఈ వలసలను చాలా వరకు అరికట్టొచ్చు.
ఈ కరోన మహమ్మారి భయంతో గ్రామాలకు పూర్వ వైభవం వస్తుందనే ఆశిద్దాం.


Sheru