
అనగనగా ఒక అడవిలో ఎన్నో విశాలమైన చెట్లు……. ఒక చెట్టుపై రెండు ప్రేమ పక్షులు ఆ రెండు
పక్షులు ఎంతో ప్రేమగా సంతోషంగా జీవనం సాగించేవి……..
ఒకరోజు ఆడపక్షి మగపక్షి తో ఇలా అంది “మనం చాలా కాలంగా కలిసి నివసిస్తున్నాము ఏదైనా కారణం వల్ల నువ్వు నన్ను వదిలి వెళితే నేను ఎలా ఉండగలను అనే ఊహే నన్ను కలవర పెడుతుంది నువ్వు లేకుండా నేను ఒక్క క్షణమైనా బ్రతకలేను”.

అప్పుడు మగపక్షి వెంటనే తన రెక్కలను విరుచుకున్నాడు ” ఇప్పుడు నేను వెళ్లాలనుకున్నా నిన్ను విడిచి వెల్లలేను మనం ఎప్పుడూ కలిసి హాయిగా జీవిద్దాం “ అని అంటది మగ పక్షి
కొంతకాలం తర్వాత ఒక రోజు తుఫాను వచ్చే సంకేతాలు కనిపిస్తాయి. అడవిలోని పక్షులన్ని వేరే ప్రదేశానికి వెళ్లిపోతాయి. అప్పుడు ఆడ పక్షి ” ఈ తుఫాను లో మనం ఎలా ఉందాం? అన్ని పక్షులు వెళ్లిపోయాయి నువ్వైతే ఎగర లేవు కానీ నేను వెళ్ళిపోతున్నాను నువ్వు జాగ్రత్త! “ అని చెప్పి ఎగిరిపోయింది. తుఫాన్ తగ్గిన తర్వాత ఆడపక్షి మళ్లీ ఆ చెట్టు దగ్గరికి వస్తుంది. మగ పక్షి చనిపోయి ఇలా రాసి ఉంది, ” నిన్ను వదిలి నేను ఎలా వెళ్ళను అని ఒక్కసారి నువ్వు అని ఉంటే నేను తుఫాన్ కన్నా ముందే చనిపోయే వాడిని కాదు”.
- SUMAYYA
ఇది ప్రేమనా లేక స్వార్థమా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరు.
ఈ కథ మీకు నచ్చితే మీ మిత్రులు, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయగలరు
Heart touching story
Madam me taruvata article eppudu vastadi ……