“భ్రమ”

భ్రమ

నీలి నింగిలో
మేలి ముసుగులా
కదలాడే
మబ్బులోంచి
జారిందొక
నీటి చుక్క
అది
ఏర్పరుచుకొన్నాక
ఆకు మీద పడక
అనుకుంది
ఇదే స్వర్గమనీ
శాశ్వతమనీ
కానీ
దానికి తెలీదు
తాను జారినా
ఆకు కదలినా
తన బ్రతుకు
మట్టి పాలేనని.

@ కరిమ