మన జీవిత లక్ష్యం ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా!

మన జీవిత లక్ష్యం ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా!

ప్రియ నేస్తమా !

ఇన్నాళ్లు మన ఈ జీవితం రేపు మరణాంతరం మిమ్మల్ని , మమ్మల్ని నరకాగ్నికి ఆహుతి చేయకూడదని ఆసలు
మానవ జీవిత లక్ష్యాన్ని మీ ముందు ఉంచుతున్నాము. మేము ఈ విషయాలను ప్రాపంచిక లాభం కోసం, స్వార్థం కోసమో
మీ ముందుకు తీసుకు రావడంలేదు. సృష్టిలోనే అత్యుత్తమ జన్మఅయిన మానవజన్మను పొంది దాని లక్ష్యాన్ని తెలుసుకోకుండా
జీవించి మీ జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదని
మేము చెప్పబోయేవి ఏవో కొత్త విషయాలు ఎంతమాత్రము కావు అందరికి తెలిసిన నగ్నసత్యాలే.

మనము అందరమూ ఈ ప్రపంచములోకి వట్టిచేతులతో, ఒంటరిగానే వచ్చాము. తిరిగి వట్టిచేతులతో ఒంటరిగానే
వెళ్లిపోతాము. క్షణభంగురమైన ఈ జీవితము ఎప్పుడు అంతమైపోతుందో తెలియని మనం ఈ జీవితము కోసం ఎందుకు అరాచకాలు, దౌర్జన్యాలు, దుష్టకార్యాలు చేస్తున్నాము? అసలు మనం ఎందుకు పుట్టించబడ్డాం? ఎందుకు చనిపోతున్నాం
? చనిపోయిన తరువాత ఎక్కడికి పోతామూ? అనే విషయాలను ఎప్పుడైనా ఆలోచించామా ?

తల్లి కడుపులో మాంసపు ముద్దగా మార్చి తొమ్మిది నెలలు ఎలాంటి పరికరాలు లేకుండా అద్భుతంగా ఆడ, మగ అనే రెండు రకాల ప్రాణులను కాళ్లు, చేతులు, తల ముక్కు, నోరు, చెవులు అన్ని అవయవాలతో పుట్టించినవాడు, కుళ్ళిపోయిన
ఎరువులతో భూమిని చీల్చి రకరకాల పంటలను మనకు అందించిన వాడు, ఈ భూమి, ఆకాశాలను, పగలు రేయిని నియమిత మార్గాలలో నడిచే సూర్య చంద్ర నక్షత్రకోటిని సృష్టించిన వాడు… అదే దేవుడు, ప్రభువు, అల్లాహ్ అతడు ఒక్కడే
“మీలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించి చూద్దామని ఆయన చాపు బ్రతుకులను సృష్టించాడు’ (దివ్యఖుర్ ఆన్ (67: 2)

ఈ జీవితము ఒక పరీక్ష, ఇక్కడ మనకు ఇష్టమొచ్చినట్లు జీవించే స్వేచ్ఛను ఇచ్చి అదైవము మనల్ని పరీక్షిస్తున్నాడు.
దానిలో భాగంగా కొంతమందికి ఆస్తి, అందం,అధికారాలు ఇచ్చాడు. కొంతమందికి పేదరికాన్ని ఇచ్చాడు. మనకు ఇన్ని
సౌకర్యాలను ప్రసాదించిన వాడిని మరిచి ఐశ్వర్యాలతో తులతూగుతున్నాము. మంచి పనులు చేస్తూ, చెడు పనుల నుండి దూరంగా ఉంటూ మనకు దేవుడు ప్రసాదించిన వాటిని దైవ మార్గంలో ఉపయోగించి మరణానంతరం శాశ్వతమైన స్వర్గాన్ని పొందుతాగో లేక దైవమిచ్చిన స్వేచ్ఛను ఉపయోగించుకొని ఇదే జీవితము శాశ్వతమైనదని భోగభాగ్యాలను అనుభవించడానికే
ఈ జీవితమని భావించి మరణానంతరం నరకానికి ఆహుతు అవుతారో చూద్దామని ఆ దేవుడు మనకు ఈ (పరీక్షను)
జీవితాన్ని ప్రసాదించాడు.

మరి మీరు ఎప్పుడైనా దీని గురించి ఆలోచించారా? గడిచిన జీవితాన్ని మీరు ఎలా గడిపారు? రేపు మరణించిన తరువాత ఆదైవానికి ఏమని సమాధానం చెప్పగలరు.

అయ్యో ! నా జీవితము కొరకు నేను ముందుగానే కొంత సామాగ్రిని (మంచిపనులు) ఏర్పాటు చేసుకొని ఉండి ఉంటే ఎంత బాగుండేది అని అనే రోజు గురించి భయపడండి (దివ్యఖురాన్)

ప్రియ నేస్తామా ! గడిచే ప్రతి నిమిషం మన జీవితంలో నుండి కరిగిపోతుంది. మనకు తెలియకుండానే మృత్యువు వైపు నడిచి పోతున్నాం.

ప్రశాంతంగా ఒకసారి ఆలోచించండి ! ఈ అమూల్యమైన జీవితాన్ని ప్రసాదించిన నిజమైన ఆ ఏకైక దైవాన్ని గురించి, ఆ ఏకైక దైవాదేశాల గురించి మరియు మీ జీవిత లక్ష్యాన్ని గురించి తెలుసుకోండి. మంచినే చేయండి, చెడును
వారించండి, మనం, మనతోపాటు సమాజం శాంతి సామరస్యాలతో సుఖ సంతోషాలతో జీవించేందుకు కృషి చేయండి.

– ఖాజామియా

9848356956

1 thought on “మన జీవిత లక్ష్యం ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా!”

  1. MashaAllah…..
    Hamare ulama b yahi chahte hai…
    Deen ko logon thak pahunchane har koi koshish karein

Comments are closed.