మరణానంతర జీవితం

మరణానంతర జీవితం Star Voice

మరణానంతరం మరొక జీవితం ఉన్నదా? లేదా? ఉంటే ఏ రూపంలోఉంది? ఈ ప్రశ్న యదార్థంగా మన బుద్ధికందని విషయం. ఎందుకంటే మృత్యువు సరిహద్దుకు ఆవల ఏమయినా ఉందో లేదో చూడటానికి కావలసిన కళ్ళు మనకులేవు. అక్కడి ధ్వనిని వినగలగటానికి అవసరమయిన చెవులు కూడ మనకు లేవు. అటు ఏముందో పరిశోధించి తెలుసుకోవడానికి ఎట్టి పరికరాలు కూడా మన వద్ద లేవు. అంటే మరణానికి తదుపరి మరో జీవితం ఉందా లేదా అనే ప్రశ్న వైజ్ఞానిక శాస్త్ర పరిధిలోనికి రాదు. కాబట్టి ఎవరయినా వైజ్ఞానిక శాస్త్రం పేరుతో మరణానంతరం మరొక జీవితం లేదని వాదిస్తే అతడు చెప్పేది పూర్తిగా శాస్త్ర విరుద్ధమయిన (Unscientific) విషయం. కేవలం విజ్ఞాన శాస్త్రం పై ఆధారపడి మరణానంతరం జీవితం ఒకటి ఉందని కూడా చెప్పలేము. దాన్ని కాదనలేము కూడా. ఈ విషయంలో విశ్వసనీయమయిన పరిపూర్ణ జ్ఞానం మనకు లభించనంతవరకు మరణానంతర జీవితాన్ని ఇటు త్రోసిపుచ్చక, అటు స్వీకరించక ఉండటమే సరయిన శాస్త్రబద్ధమయిన మార్గం. కాని మనం క్రియాత్మక జీవితంలో ఈ శాస్త్రీయ వైఖరిని అవలంబించగలమా? ఇది ముమ్మాటికీ అసంభవం. ఒక విషయాన్ని గురించి తెలుసుకోడానికి

మన వద్ద ఏ సాధనం కూడా లేనప్పుడు దాని గురించి అవునో కాదో తేల్చక తటస్థంగా ఉండటం హేతుబద్ధమయిన విషయమే; కాని ఆ విషయమే మన అనుదిన జీవితంతో ముడిపడి ఉంటే దాని అంగీకారం పైగానీ, తిరస్కారం పైగాని మన వైఖరి ఆధారపడవలసి ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తిని గురించి మీకు తెలియదు. అతనితో మీకు ఎలాంటి పని పడనంతవరకు అతడు విశ్వసనీయుడనిగాని, విశ్వాసఘాతకుడనిగాని అభిప్రాయపడకుండా ఉండగలరు. కాని అతనితో ఒక వ్యవహారంలో సంబంధం ఏర్పడినప్పుడు అతడు

                  విశ్వసనీయుడో కాదో నిర్ణయించడం తప్పదు.విశ్వాసఘాతుకమో రుజువుకానంతవరకు సందిగ్ధ పరిస్థితిలో అతనితో  వ్యవహరిద్దామని మీర   ఊహించుకోగలరే కాని, అలా ఆచరణాత్మకంగా వ్యవహరించలేరు. ఎటొచ్చీ అతని విశ్వసనీయతను శంకిస్తూ మీరు అవలంబించే విధానం, మీరు అతని విశ్వసనీయతను నిరాకరించి అవలంబించే విధానంకంటే భిన్నమయింది కాజాలదు. కాబట్టి అంగీకారం, తిరస్కారాల మధ్య తటస్థస్థితి కేవలం నిరాధారమైన భావం మాత్రమే. క్రియాత్మక వైఖరి ఎప్పటికీ అనుమానం పై స్థిరపడజాలదు. దీనికి అంగీకారమో, తిరస్కారమో ఏదో ఒకటిజరగడం అనివార్యం.మానవుడు జీవరాశికి చెందినవాడు, స్వేచ్చగా సంచరించి తన జీవనోపాధిని స్వయం కృషి వల్ల పొందే జీవి, తన్నుతానే రక్షించుకునే శక్తి కలవాడు. తన సంతతి మనుగడకు తగిన ఏర్పాటు చేసుకోగల యుక్తిపరుడు.. వీటన్నిటినీ మించి మానవుని అస్తిత్వానికి మరొక రూపం కూడా ఉంది.దాన్నే మనం నైతిక రూపం అంటాము. మనిషిలో మంచి చెడుల చైతన్యంఉంది. వాటి విచక్షణా జ్ఞానముంది. మంచి చెడులు చేయగల శక్తి వుంది.సత్కార్యానికి సత్ఫలితం, దుష్కార్యానికి దుష్పరిణామం రూపొందాలని మనిషి

నైజం వాంఛిస్తుంది. న్యాయాన్యాయాలు, సత్యాసత్యాలు, ధర్మాధర్మాలు,దయానిర్దయలు, కృతజ్ఞతా కృతఘ్నతలు, విశ్వసనీయతా ద్రోహాలు, దాతృత్వమూలోభాలు తదితర అనేక గుణాలలో విచక్షణ చేయగలడు మనిషి. ఈ గుణాలుకేవలం ఊహాజనితమైన భావాలు కావు. ఇవి క్రియాత్మకంగా మానవునిజీవితంలో కానవస్తాయి. వీటి ప్రగాఢమయిన ప్రభావాలు మానవ సంస్కృతిపైపడతాయి. కాబట్టి మానవుని చర్యల భౌతిక ప్రభావాలు ఏ విధంగా వ్యక్తమవుతాయో                        అదేవిధంగా నైతిక చర్యల ఫలితాలు సహితం వెలువడాలని మానవ జన్మకు ఆధారభూతమయిన మానవ ప్రకృతి బలవత్తరంగా కోరుతుంది.కాని, విశ్వ వ్యవస్థను పరిశీలనగా చూడండి. ఈ వ్యవస్థలో మానవునిక్రియల నైతిక పరిణామాలు పూర్తిగా వ్యక్తమవగలవా? ఈ విశ్వంలో దీనికిఅవకాశం లేదని గట్టిగా నమ్మకంతో చెప్పగలను. ఎందుకంటే కనీసం మనకు

తెలిసినంతవరకు, నైతిక చైతన్యంగల మరొక సృష్టి ఈ విశ్వంలో లేదు. విశ్వ

వ్యవస్థ పూర్తిగా ప్రకృతి సిద్ధాంతాల పై ఆధారపడి నడుస్తోంది. నైతిక సిద్ధాంతాలు

ఆచరణలో ఉన్నట్లు ఎక్కడా కానరాదు, ఇక్కడ డబ్బుకు భారమూ, విలవలు

ఉన్నాయి. కాని సత్యానికి ఈ రెండూ లేవు.

కాని, నైతిక శక్తులు పనిచేయడం వల్ల నిత్యం నిర్ణీత పరిణామాలు

కలగడానికి ఇక్కడ ఎలాంటి నియమాలు లేవు. ప్రకృతి సిద్ధాంతాలే సర్వత్రా

అమలులో ఉండటం మూలాన నైతిక పరిణామాలు అసలు బయల్పడటమే

అసాధ్యం. ఒకవేళ బయల్పడినా ప్రకృతి సిద్ధాంతాలు అనుమతించినంతవరకే

పరిమితమై ఉంటాయి. నైతికత ఒక క్రియ యొక్క ప్రత్యేక ఫలితాన్ని

కోరుతుంది.

కాని తరచుగా ప్రకృతి సిద్ధాంతాల జోక్యం వల్ల దానికి పూర్తిగా

భిన్నమయిన ఫలితాలు వెలువడతాయి. మనిషి చేసే క్రియల నైతిక ఫలితాలు

ఒక నియమానుసారంగా వ్యక్తమవడానికి గాను తన సాంస్కృతిక, రాజకీయవ్యవస్థల ద్వారా మనిషి స్వయంగా కొంతవరకు పాటుపడ్డాడు .                                                                                                                                 

                    కాని ఈ ప్రయత్నాలు పరిమిత పరిమాణంలో ఎంతో లోపభూయిష్టంగా జరిగాయి .

ఒకవైపు ప్రకృతి సిద్ధాంతాలు వాటిని అణచివేస్తున్నాయి , మరొకవైపు మనిషిలోని

ఎన్నో బలహీనతలు మానవుని సాంఘిక వ్యవస్థల్లోని లోపాలను మరింత

వృద్ధి చేస్తున్నాయి .

నేను చెప్పదలచుకున్నది . కొన్ని ఉదాహరణల ద్వారా వివరిస్తాను ,

వీటిని శ్రద్ధగా గమనించండి . ఒక వ్యక్తి తన విరోధి ఇంటికి చిచ్చు పెడతాడు .

అది దహనమయిపోతుంది . ఇది అతని క్రియల భౌతిక పరిణామం . ఇల్లు

కాల్చివేసి ఒక కుటుంబానికి కలిగించిన నష్టానికి సమానంగా అతనికి శిక్ష

లభించడమే దీని నైతిక పర్యవసానం . కాని ఈ పర్యవసానం వ్యక్తమవటం కొన్ని

విషయాలపై ఆధారపడి ఉంది . చిచ్చు పెట్టినవాని ఆచూకి తెలియాలి . అతను

పోలీసులకు పట్టుబడాలి . నేరం అతని పై రుజువు కావాలి . దహనం వల్ల వంశం ,

దాని భావి సంతతికి వాటిల్లిన నష్టమెంతో న్యాయస్థానం ఖచ్చితంగా అంచనా

వేయగలగాలి . అప్పుడు న్యాయరీత్యా ఆ నేరస్థునికి తగిన శిక్ష విధించబడాలి .

ఈ షరతుల్లో ఏ ఒక్కటి పూర్తి కాకపోయినా నైతిక పర్యవసానం బయలు

పడకనే పోవచ్చు . లేదా దాని కొంత భాగం మాత్రం వ్యక్తం కావచ్చు లేదా

నేరస్థుడు ఎదుటి వ్యక్తిని సర్వనాశనం చేసి ప్రపంచంలో నిక్షేపంగా తిరుగుతూ

వృద్ధి వికాసాలు పొంది జీవించడం కూడా సాధ్యమే !

మరో ఉదాహరణ

తీసుకోండి . కొందరు వ్యక్తులు జాతీయ స్థాయిలో

తమ ప్రజల విశ్వాసాభిమానాలు చూరగొంటారు

. ప్రజలంతా వారి మాటను

కాదనక వారిని అనుసరిస్తుంటారు . తమకుగల ,

పలుకుబడిని స్థానాన్ని వారు జనుల్లో సామ్రాజ్యవాద జ్వాలలు రేపుతారు . దేశ విస్తీర్ణ

పురస్కరించుకుని

భావాలు ఉద్భవించేలా ప్రజల్ని ఉద్రిక్తులు చేస్తారు . పొరుగు దేశాలతో పోరుకు

తలపడతారు . లక్షలాది జనుల్ని హతమారుస్తారు . ఎన్నో దేశాల్ని సర్వనాశనం

చేస్తారు . కోటాను కోట్ల మానవుల్ని కడు హీనంగా , నీచంగా బ్రతకవలసిన స్థితికి

త్రోస్తారు . మానవ చరిత్ర పై వీరు చేసిన అఘాయిత్యాల ప్రభావం అనూహ్య

మయింది . ఎన్నో శతాబ్దాల వరకు , తర తరాలుగా వేనవేల మానవులపై

వ్యాపిస్తుంది . కొందరు వ్యక్తులు చేసిన ఈ మహాపరాధానికి ఈ జీవితంలో

న్యాయం రీత్యా తగిన శిక్ష విధించడం సాధ్యమా ? వీరిని నిలువునా ముక్కలు

ముక్కలుగా నరికినా , సజీవంగా దహనం చేసినా , చిత్రహింస చేసినా లేదా

మానవునికి వీలుపడే మరే శిక్ష విధించినా వారు కోటానుకోట్ల వారి భావి

సంతతికి చేసిన ఎనలేని దురాగతాలకు సమానం కాజాలదు ఆ శిక్ష . ప్రస్తుత

విశ్వ వ్యవస్థ ఏ ప్రకృతి సిద్ధాంతాలకు కట్టుబడి వ్యవహరిస్తుందో వాటి రీత్యా

వారు తమ నేరాలకు తగిన శిక్ష పొందడం ఏ విధంగానూ సాధ్యపడదు . చెంగీజు ఖాన్ ను

లేదా హిట్లర్‌ను చిత్రహింస చేసినా, వారు మానవాళికి చేసిన నష్టానికి

ఆ శిక్ష సమానం కాగలదా ?

అదేవిధంగా మానవాళికి సత్యమూ సన్మార్గాల శిక్షణ ఇచ్చి చీకటి

నుండి

వెలుగులోకి దారి చూపిన ప్రవక్తలను , రుషులను , సత్పురుషులను

తీసుకోండి

. వారి పుణ్యమా అంటూ శతాబ్దాల తరబడి మానవ జాతి తరతరాలుగా

చూపిన సన్మార్గం ద్వారా లాభమొందుతూ ఉంది . ఇంకా భవిష్యత్తులో ఎన్ని

శతాబ్దాల కాలాల్లో తమకు వరకు  లాభమొందుతూ  ఉంటారో  మనుషులు చెప్పలేరు .  వారు  ఆ కాలాల్లో తమకు ఎదురయిన ఎనలేని కష్టాల్ని భరించి శ్రమపడి చేసిన ఈసేవకు ఈ ప్రపంచంలోనే పూర్తి ఫలితం లభించడం సాధ్యమా ? తన

మరణానంతరం కూడా వేలాది సంవత్సరాల వరకు అసంఖ్యాక ప్రజలపై

పరివ్యాప్తమయ్యే ప్రభావం గల తన క్రియకు , ప్రస్తుత ప్రకృతి సిద్ధాంతాల

పరిమితిలో ఒక వ్యక్తి సంపూర్ణ ప్రతిఫలాన్ని పొందగలడా ?

ఇంతకుముందు పేర్కొన్నట్లు ప్రస్తుత విశ్వ వ్యవస్థ ఏ సిద్ధాంతాల పై

కొనసాగుతుందో వాటి దృష్ట్యా ప్రపంచంలో మానవ చర్యలకు నైతిక ప్రతిఫలం

సంపూర్ణంగా సమకూరటానికి తగినంత అవకాశం లేదు . మరొక విషయం

ఏమంటే కొన్ని సంవత్సరాల అల్ప జీవితంలో మనిషి చేసే ఒక్కో క్రియ యొక్క

పరిణామాలు , పర్యవసానాలు , ప్రభావాలు బయల్పడటానికి , అవి పూర్తిగా

వ్యక్తమవటానికి వేనవేల సంవత్సరాల కాలం పడుతుంది . అయితే ప్రస్తుత

ప్రకృతి సిద్ధాంతాల ప్రకారం మానవునికి ఇంత దీర్ఘకాల జీవితం దొరకడం

అసంభవం . దీనివల్ల హేతుబద్ధంగా తేలేది ఏమంటే మనిషి భౌతిక , పాశ్విక

అంశాలకు మాత్రం ప్రస్తుత భౌతిక లోకం ( Physical World ) దాని ప్రకృతి

సిద్ధాంతాలు సరిపోతాయి . కాని మనిషి ఉనికి కాంక్షించే నైతిక అవసరాల

కొరకు ఈ ప్రపంచం ఏ విధంగానూ సరిపోదు . వీటి కొరకు మరో విశ్వ వ్యవస్థ

అవసరం . అందులో నైతిక సిద్ధాంతాలే పాలక శాసనాలు ( Governing

Laws ) గా ఉండాలి . ప్రకృతి సిద్ధాంతాలు దీని క్రింద కేవలం ఉపసిద్ధాంతాలుగా

మాత్రమే ఉండాలి . ఆ వ్యవస్థలో జీవితం పరిమితం కాక అనంతమయినదిగా

ఉండాలి . అప్పుడే ఈ లోకంలో బయల్పడలేకపోయినవీ లేక భిన్నంగా

బయల్పడిన నైతిక పరిణామాలన్ని వాటి నిజరూపంలో వ్యక్తం కాగలవు . అక్కడ

వెండి బంగారాలకు కాదు , సత్యమూ సదాచారాలకే విలువ , స్థానం ఉండాలి .

నైతిక సిద్ధాంతాల రీత్యా కాలతగినదాన్నే అగ్ని కాల్చగలగాలి . సదాచారుల

సన్మార్గులకు మాత్రమే అక్కడ సుఖ సంతోషాలు లభించాలి . దుష్టులకు

మాత్రమే కష్టాలు , బాధలు ప్రాప్తం కావాలి . ఇలాంటి ఒక విశ్వవ్యవస్థ స్థాపించ

బడటం అవసరం అని వివేకమూ కోరుతుంది , ప్రకృతి కాంక్షిస్తుంది !

హేతుబద్ధమయిన తర్కం అటువంటి వ్యవస్త ఉండి తీరాలి ” అన్నవరకే మనకు దారి

చూపుతుంది . అయితే వాస్తవానికి ఇలాంటి లోకం కూడా ఒకటి ఉన్నదా అనే

ప్రశ్నను మన బుద్ధి విజ్ఞానాలు రెండూ పరిష్కరించలేవు . ఇక్కడే పవిత్ర

ఖుర్ఆన్ మనకు దోహదకరమవుతుంది . అది చెప్పేదేమంటే – ” మీ వివేకమూ ,

మీ ప్రకృతి కాంక్షించేది వాస్తవానికి ఒక రోజు జరగబోతుంది , భౌతిక సిద్ధాంతాలపై

నిర్మించబడ్డ ఈ విశ్వ వ్యవస్థ ఒక నిర్ణీత సమయాన విచ్ఛిన్నపరచబడుతుంది .

తరువాత మరో ప్రపంచం నిర్మాణమవుతుంది దానిలో . భూమ్యాకాశాలు , ఇతర

పదార్థాలన్నీ కొత్త పంథాలో నిర్మించబడతాయి . ఆదికాలం నుండి ప్రళయ దినం వరకు జన్మించిన మానవులందరిని సృస్టికర్త తిరిగి లేపుతాడు.వారందరి కర్మల పత్రం ఎటువంటి తప్పులు లేకుండా భద్ర పరచపడి ఉంటుంది.

ఈ క్రియల ప్రభావానికి గురి అయిన తరాల ప్రజలందరు సాక్ష్యుల బోనులో .

హాజరు చేయబడతారు . మనిషి చెప్పిన మాటల , చేసిన చేతల ముద్రపడ్డ

ఒక్కొక్క అణువు తన కథనం వినిపిస్తుంది . స్వయంగా మనిషి

కాళ్ళూ

చేతులు నోరూ , కళ్ళూ , చెవులు సకల అవయవాలు వాటిచేత ఆ వ్యక్తి ఎలాంటి

కార్యాలు చేయించాడో సాక్ష్యమిస్తాయి . ఆ వృత్తాంతమంతా ఆలకించి అప్పుడు

ఆ అత్యున్నత విశ్వప్రభువు సృస్టికర్త  , ఎవరూ కాదనలేని ఆ సాక్ష్యాల , ఆ కర్మల

జాబితాల ఆధారంగా వ్యక్తిగతంగా ఎవరు ఎంత పారితోషికానికి యోగ్యులో ,

ఎవరు ఎంత శిక్షకు అర్హులో సంపూర్ణ న్యాయంతో తీర్పునిస్తాడు . ఈ పారితోషికం ,

శిక్షలు ఎంతో గొప్ప పరిమాణంలో ఉంటాయి . ప్రస్తుత విశ్వవ్యవస్థలోని

పరిమితమయిన ప్రమాణాల ద్వారా వాటిని అంచనా వేయలేము .

. భువిలో మనిషి చేసిన ఏ సత్కర్యాల ప్రభావాలు వేనవేల ఏండ్ల వరకు

వ్యాపించాయో వాటి ప్రతిఫలం పూర్తిగా మనిషి అక్కడ పొందగలడు . మృత్యువు ,

వ్యాధి , వృద్ధాప్యాలు అతని సుఖసంతోషాలను ఒక క్షణానికి కూడా భగ్నపరచలేవు .

మనిషి చేసిన ఏ దుష్కర్మల ప్రభావం వేలాది సంవత్సరాల వరకు అసంఖ్యాక

ప్రజలపై వ్యాపించిందో వాటి శిక్ష మనిషి సంపూర్ణంగా అనుభవిస్తాడు . మరణమో ,

స్పృహ కోల్పోవడమో జరిగి అతని కష్టాన్ని దూరం చేసి అతన్ని రక్షించలేవు .

ఇలాంటి జీవితం , ఇలాంటి లోకం ఒకటి అసంభవమని తలచే

సంకుచిత బుద్ధిపై జాలివేస్తుంది . ప్రస్తుత ప్రకృతి సిద్ధాంతాల ఆధారంగా

ప్రస్తుత విశ్వవ్యవస్థ సాధ్యమైనప్పుడు ఇతర ప్రకృతి సిద్ధాంతాల పై మరో

విశ్వవ్యవస్థ రూపొందడం ఎందుకు సాధ్యపడదు ? అయితే వాస్తవానికి ఇలా

తప్పక జరుగుతుంది అనే విషయాన్ని తార్కిక ఆధారాలతోగాని , వైజ్ఞానిక

నిరూపణలతోగాని నిర్ణయించడం అసాధ్యం ; దీనికి అగోచర విషయాల పై

విశ్వాసం ఉండటం ఎంతైనా అవసరం .

కావున మరణానంతర జీవితం ఉందని గ్రహించి మన జీవితాలను సృస్టికర్త ఆదేశాలకు అనుగుణంగా గడిపితే మనం సాఫల్యం పొందే అవకాశం ఉంది…………

  • KHAJA MIYA

2 thoughts on “మరణానంతర జీవితం”

  1. Want to summerise this article in few words

    Jisi karni wisi bherni na mane to kerk dekh
    Jannat bi hy dozak bi hy na mane to merk dekh..

Comments are closed.