మీకు తెలుసా… ????

పేపర్ చదువుతుంటేనో…ఎవరైనా మాట్లాడుతూ ఉంటేనో..కొన్ని కొన్ని పదాలు మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి.విషయం అర్ధమైనట్టుగా ఉంటుంది కానీ ఆ కొత్త పదాలు అర్ధం కావు.ఎవరినైన అడుగుదామనుకుంటే…’ఇది కూడా తెలియదా’ అని అనుకుంటారని …తమను తక్కువ చేసి మాట్లాడుతారేమోనని మనసులో శంక.తెలియకపోయినా తెలిసినట్టే నవ్వేసి ఊరుకుంటాం.కానీ మనసులో ఏ మూలనో ఇది తొలిచేస్తూ వుంటుంది.
అలాంటి మూడు ముఖ్యమైన పదబంధాల గురించి తెలుసుకుందాం.

మొదటిది
“ప్రి కాంసీవ్డ్ నోషన్’
(pre conceived notion).
మీరు ఒక ఆఫీసులో పని చేస్తూ ఉంటారు.మీతో పాటు చాలా మంది పని చేస్తున్నారు.అందులో ఒకరు ట్రాన్స్ఫర్ అయి వెళ్లారు.కొత్త ఉద్యోగి వస్తున్నారు.వచ్చేవ్యక్తి పేరు వినగానే అతని మతం ..కులం..జాతి..ఇంకా కొద్దిగా ముందుకు వెళ్లి ప్రాంతం తెలుసుకొని ఒక అభిప్రాయానికి వస్తారు….ఈ లోపు ఆఫీసులో కొద్దిమంది ఆ వచ్చే వ్యక్తి తనకు బాగా తెలుసనీ… అతని గురించి మంచో,చెడో చెప్తారు. ఇక కొత్తగా రాబోయే వ్యక్తి మీద మంచిదో ..చెడుదో ఒక అభిప్రాయానికి వస్తారు…అదే నిజమని నమ్ముతారు….ఆ వ్యక్తితో బాగా పరిచయమయ్యాక కూడా అదే అభిప్రాయంతో ఉంటారు….కొద్దిమంది మాత్రం వాస్తవం గ్రహించి తమ అభిప్రాయం తప్పని ..విన్నది కూడా తప్పేనని గ్రహిస్తారు.
మీ పక్క ఇంట్లొకో….పక్క అపార్ట్మెంట్లోకో కొత్తవారు అద్దెకు వస్తూంటే కూడా ఇలానే ఒక నిశ్చితాభిప్రాయనికి వస్తారు…దీనినే ‘ప్రి కాంసీవ్డ్ నోషన్’ అంటారు. కొద్ధికాలం గడిచేక
“మిమ్మల్ని గురించి తప్పుగా అనుకున్నామండీ…విన్నామండీ” అని ఇతరులు చెప్పటం మనకు తెలిసిందే..
కాబట్టి ఇతరులు కొత్త వారి గురించి చెప్పేది నమ్మడం.. నమ్మక పోవడం మీ ఇష్టం.


ఈ మధ్య సభల్లో కానీ ..సమావేశాల్లో కానీ వక్తలు తరచుగా వాడే పదబంధం..”కంఫర్ట్ జోన్’
చాలా మందిలో కొన్ని కళలు జన్మత వస్తుంటాయి .. పాట పాడటం…డాన్స్ చేయటం…ఉపన్యాసం ఇవ్వటం…నాయకత్వం చేయటం.. రాయటం లాంటివి. కానీ వారు తమ తమ వ్యాపకాల్లో ఉండి తమలోని కళను పట్టించుకోరు ఎందుకంటే తాము ఇప్పుడు జీవిస్తున్న సుఖమయ లేదా అలవాటు పడిన వృత్తుల్లోంచి బయటకు రాలేక…కొత్త వృత్తిలోకో..పనిలోకో వెళితే నలుగురు ఏమనుకుంటారో…కొత్త వృత్తిలో రాణిస్తామో లేదోననే అనుమానంతో ..చేస్తున్న ఉద్యోగాల్లోనో..పనుల్లోనో ఉండి పోతారు..అలా ఉండిపోయే స్ధితినే ‘కంఫర్ట్ జోన్ ‘ అంటారు.
ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ..మీకు ఏ ఏ కళల్లో ఆసక్తి ఉందొ..మీరెందుకు బయటికి రావట్లేదో…
శంకరాభరణం సోమయజులుగారు తనకు యాభై యేండ్లు వచ్చాక సినిమాల్లోకి వచ్చారు.అతను ఎంత గొప్ప నటుడుగా ప్రూవ్ అయ్యాడో మనకు తెలుసు…హిందీలో బోమన్ ఇరానీ..తెలుగులో ఈ మధ్య తండ్రి ..విలన్ పాత్రలు వేస్తున్న ఒక నటుడు కూడా నలభై ఐదేళ్ల తర్వాత తమ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి గొప్పవాళ్లయిన వారే..
కూనీ రాగాలు తీసే వారు..అనర్గళంగా మాట్లాడేవారు..ప్రతి ఆలోచనని కథగా..కవితగా మలిచేవారు చాలామంది వున్నారు.వారు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తే గాయకులుగా..ఉపన్యాసకులుగా..రచయితలుగా..నాయకులుగా మారలేరా…


విక్టోరియన్స్ అనే ఒక దేశం వారు ఏ దేశం మీదకు యుద్దానికి వెళ్లినా గెలుపుతో తిరిగి వచ్చేవారు.ఓటమిని భరించే వారు కాదు.వీరిని “వార్ మాంగర్స్” అంటే యుద్ధ కాముకులు అనేవారు.
వీరు యుద్ధం చేసే తీరు వినూత్నంగా ఉండేది.
ఏదైనా దేశం మీదకు యుద్దానికి వెళ్లాలంటే పడవల్లో వెళ్లేవారు. శతృదేశం హద్దుల్లోకి రాగానే పడవలన్నీ తగలబెట్టే వారు.వెనక్కి వెళ్లలేరు కాబట్టి బ్రతకడం కోసం యుద్ధం చేసేవారు..యుద్ధం గెలిస్తేనే తమ దేశానికి వెళ్ళేది…కాబట్టి సైనికులంతా గెలుపు కోసం పోరాడేవారు. గెలిచేవారు.
వీరిని “విక్టోరియన్ విన్నర్స్”అనేవారు…


  • షేరు(గౌస్)