లాక్ డౌన్ గీతలు..

పేదవాడి చూపేప్పుడూ
పైకే
చుక్కల్లో చిక్కిన ధరలు
తన చేతికి
చిక్కేనా అని….
ఒక నవ్వు.…
మనసులో మాలిన్యాన్ని కడిగేస్తూ..
కళ్ళల్లో ప్రేమను ఒలక బోస్తూ..
స్నేహాన్ని కాంక్షిస్తూ..
శత్రుత్వాన్ని దూరం చేస్తూ..
బోసి నవ్వులతో మొదలై…
తొలి యవ్వనపు చిహ్నలై..
సంసారపు సరిగమలై….
సంతానపు ఫలాలై….
నవ్వులు పూయించటమే
జీవితం..

నేటి రోజుల్లో…
రేపటి బ్రతుకే ప్రశ్నయితే…
మిగిలిందేమిటి…
ఒక్క నవ్వే…
సకల జబ్బుల హరణం
కోట్ల డబ్బుల సమానం
తోటి మనిషికి
మనిషి గా మనమిచ్చే బహుకరణం
ఈ చిన్న నవ్వే…
-షేరూ
Excellent