సరిలేరు సచిన్…నీకెవ్వరూ…

16 ఏళ్ళ ప్రాయం మూతిపై మీసాలు కూడా రాలే…అవతల అరవీర భయంకరమైన పేస్ దళం పై దండెత్తేందుకే కాబోలు ఏ దేశం తో క్రికెట్ మ్యాచ్ అంటే భారతీయుల ఉద్విగ్నంగా టీవీలకు అతుక్కుపోతారో అదేదేశంపై అరంగేట్రం చేసాడంటేనే అర్ధం చేసుకోవాలి ఒక్క టెస్టులలోనే కాదు వన్డేలలో కూడా…
అప్పటిదాకా సముద్రాలకే పరిమితమైన సునామి పరుగుల్లో తీసుకు రావడానికి అప్పడే ఒక అడుగు పడింది అతనే సచిన్ రమేశ్ టెండూల్కర్…
అలా దాయాదిపైనే కాదు దిగ్గజ ఆసిస్ స్పిన్నర్ హేన్ వార్న్ కు నిద్రలో కూడా అతని బ్యాటింగే కలలో వచ్చేదంటే క్రికెట్ అతను శాసించిన విధానాన్ని మనం అంచనా వేసుకోవచ్చు…
ఎవరికీ సాధ్యంకాని ప్రేరణ.క్రికెట్ ను మతంగా భావించే భారత్ లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ను దేవుడిలా ఆరాధిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.1989లో అంతర్జాతీయక్రికెట్లో అడుగుపెట్టిన సచిన్ ప్రయాణం సుమారు సుమారి 22ఏళ్ళసుదీర్ఘంగా సాగింది.ఇన్ని సంవత్సరాలు ఓ దేశ జట్టుకు ఇప్పటి వరకూ ఏ క్రికెటర్ ప్రాతినిథ్యం వహించలేదు. ఇకపై ఎవరికీ సాధ్యం కాకపోవచ్చు అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.
దేశమేదైనా కావొచ్చు…బౌలర్ ఎవరైనా కావొచ్చు బ్యాట్స్ మెన్ సచిన్ ఉంటే భారత్ గెలిచినట్టే అనేంత 130కోట్ల భారత్ క్రకెట్ అభిమానుల ఆశల్ని తను బ్యాట్ ను పట్టినన్ని రోజులూ నిలబెట్టిన క్రికెట్ దేవుడు.
సచిన్ 1989 నవంబర్ లో తొలిసారి పాక్ పై టెస్ట్ మ్యాచ్ ఆడాడు.అదే ఏడాది డిశంబర్ లో పాక్ పైనే వన్డేల్లో అరంగేట్రం చేసాడు.2012 సం లో మార్చ్ లో పాక్ పై ఆఖరి వన్డే ఆడిన సచిన్ 2013 నవంబర్ లో ముంబాయి వాంఖడే స్టేడియంలో వెస్టిండిస్ తో టెస్ట్ మ్యాచ్ తర్వాత రిటైర్ మెంట్ ప్రకటించాడు.

సుదీర్ఘ కాలం పాటు టీమిండియాకు తన విలువైన సేవలందించిన సచిన్ తనకే సాధ్యమైన ఎన్నో రికార్డులను నెలకొల్పాడు.టెస్ట్ లు వన్డేలనే తేడాలేకుండా పరుగుల వరద పారించాడు.భారత్ లోనే కాకుండా క్రికెట్ ఆడే దేశాలన్నింటిలోనూ సచిన్ కు ఎంతో మంది అభిమానులున్నారు.అటువంటి దిగ్గజ క్రికెటర్ __ వ పుట్టిన రోజు నేడు.

ఈ శభసందర్భంగా సచిన్ యొక్క గొప్ప రికార్డులను ఒక సారి గుర్తుచేసుకుందాం…

టెస్టుల్లో 15921పరుగులు సచికే సాధ్యమైన రికార్డు.ఏ ఇతర క్రికెటర్ ఇప్పటి వరకూ 13500 లపరుగుల మైలు రాయిని కూడా దాటలేదు.సచిన్ తర్వాత స్థానంలో ఆసిస్ నుండి రికీపాంటింగ్ కూడా 13378 పరుగులే చేసాడు.ప్రస్తితం ఆడుతున్న ఆటగాళ్ళలో యూనిక్ ఖాన్ ఒక్కడే 10వేల మార్కు దాటాడు. కాబట్టి సచిన్ టెస్ట్ పరుగుల రికార్డును ఇప్పట్లో బద్దలు కొట్టే ఆటగాడు లేడు .
వన్డేల్లో 18426 పరుగులు వన్డేల్లోనూ సచిన్ కు సాటి ఎవరూ లేరు.మెత్తం 463 వన్డేలు ఆడిన సచిన్ 18426 పరుగులు సాధించాడు.ఏ ఇతర ప్లేయర్ కనీసం 15 వేల పరుగులను కూడా దాటలేదు.
200ల టెస్ట్ మ్యాచ్ పరుగులే కాదు అత్యధిక టెస్ట్ మ్యాచ్ లు ఆడిన రికార్డు కూడా సచిన్ పేరిటే ఉంది.వెస్టిండిస్ పై ఆడిన టెస్ట్ ద్వారా సచిన్ ఆ ఘనత సాధించాడు.ఆ తరువాత ఎక్కువ టెస్ట్ లు ఆడింది రికీపాంటింగ్,ఆతర్వాత స్టీవ్ వా నిలిచారు.అలిస్టర్ కుక్ 140 టెస్ట్ లకు ప్రాథినిత్యం వహించారు.
వన్డేల్లో ప్రస్తుతం రెండవస్థానంలో ఉన్న శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర14234 పరుగులు చేసాడు.ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్ళలో మహేంద్రసింగ్ ధోనీ 9278 పరుగులే అత్యధికం.

టెస్ట్ లు వన్డేల్లో కలిపి ఏకంగా 100 సెచరీలు సాధించాడు. టెస్టుల్లో 51,వన్డేల్లో 49 సెంచరీలు ఉన్నాయి..90లో దాదాపుగా 28 సార్లు అవుట్ అయ్యాడు.బహుశా మరో రెండు దశాబ్దాలదాకా ఈ రికార్డు ఇలాగే ఉండొచ్చేమో.కోహ్లీ లాంటి యువ ఆటగాళ్ళు కూడా దూకుడుమీద కనిపిస్తున్నా సచిన్ రికార్డ్ ను అందుకోవడం అంత సులువేంకాదు.

అంతర్జాతీయ కెరియర్లో 34357పరుగులు టెండూల్కర్ తన అంతర్జాతీయ కెరియర్ లో అంటే టెస్టులూ,వన్డేల్లో 34357పరుగులు సాధించాడు.ఓ అంతర్జాతీయ క్రికెటర్ కు ఇవే అత్యధిక పరుగులి. సచిన్ దరిదాపుల్లోకి కూడా ఎవ్వరూ లేకపోవడం విశేషం.కోహ్లీకే ఆ అవకాశం ఉండొచ్చు

ఇన్ని ప్రత్యేకతలున్నందుకే సరిలేరు సచిన్ కెవ్వరూ…సాటి రారు నీ ప్రతిభకెవ్వరూ…

– శ్యామ్

1 thought on “సరిలేరు సచిన్…నీకెవ్వరూ…”

  1. చాలా మంచి విషయాలు తెలియచేసినందుకు ధన్యవాదాలు

Comments are closed.