సాహసం

కృష్ణ బెంజిమన్ 14 సంవత్సరాల కుర్రవాడు.ఇతని తల్లి కృష్ణకుమారి తమిళియన్. ఇతని తండ్రి నికోలస్ బెంజిమెన్ బ్రిటీషర్. ఈ కుర్రవాడు అచ్చం తన నాన్న లాగే తెల్లగా బంగారపు రంగు జుట్టుతో ఆకుపచ్చ కళ్ళతో విదేశీయుడు లా ఉంటాడు. ఇతనికి తల్లిదండ్రులు అంటే చాలా ఇష్టం.కాని ఇతని అమ్మానాన్నలు గత 2సం త్సరాలుగా కనబడటం లేదు. ఎటు వెళ్లారు? ఎక్కడ ఉన్నారు? సమాచారం లేదు. రెండేళ్లుగా వాళ్ళ తాత ఇతడ్ని రహస్యంగా పెంచుతున్నాడు .వాళ్ళ తాత ను తన అమ్మానాన్నల గురించి ఎన్ని సార్లు అడిగినా అతను చెప్పేవాడు కాదు. కనీసం మనం ఎందుకు రహస్యంగా బతుకుతున్నామో కూడా వివరించే వాడు కాదు. ఒకరోజు అకస్మాత్తుగా బ్రిటీష్ సైన్యం తన తాత ను కూడా ఎత్తుకెళ్లిి
పోయింది. అదృష్టవశాత్తు
కృష్ణా బెంజిమన్ సైన్యం కంట పడలేదు. అందువలన అతడు తప్పించుకోగలిగాడు. ఏ సమాచారం తెలియక పోగా ఒంటరిగా ఉన్న కృష్ణ బెంజిమెన్ సమాచారం కోసం ఇల్లు మొత్తం వెతికాడు. లోపలి గది మూలల్లో ఒక రహస్య ప్రవేశద్వారాన్ని దానికి చిన్న తలుపు ఉండటాన్ని కనుగొన్నాడు. నిదానంగా ఆ తలుపు తెరుచుకొని మెట్ల ద్వారా లోపలికి దిగాడు. అక్కడ ఒక పాత డైరీ , కొన్ని పాత గ్రంథాలు, ఒక ట్రంకు పెట్టె
ఉన్నాయి. ఆ డైరీ ని చదువడం ప్రారంభించాడు. తన తల్లి కృష్ణకుమారి మైసూర్ రాజావారికి నమ్మిన బంటు. గూఢచర్యం , సమాచార విద్యలో ఆరితేరింది. మైసూరు రాజ్యాన్ని కాపాడడానికి బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా పని చేస్తుండేది. అప్పుడే తను నాన్నను వివాహం చేసుకుంది. దీని కారణంగా ఇప్పుడు కృష్ణా తల్లిదండ్రులు బ్రిటన్ జైలులో బందీలుగా ఉన్నారు. అతను ఈ విషయం తెలుసు కొని తల్లడిల్లి పోయాడు. తన తల్లిదండ్రుల కోసం ఎంతగానో ఏడ్చాడు. ఇన్ని రోజుల ఎడబాటును తట్టుకోలేకపోయాడు. వారిని ఎలాగైనా కలవాలనీ, వారిని విడిపించాలని నిర్ణయించుకున్నాడు .ఏమీ అర్థం కాని కృష్ణ బెంజిమెన్ రహస్య గది ని బాగా వెతికాడు.మరో పెట్టెలో ఒకచిన్న మడత కుర్చీ,ఒక పుస్తకం, రాగి ఉంగరం, కొన్ని నూనె సీసాలు ఉన్నాయి. పుస్తకం పై మడత కుర్చీ- మ్యాజిక్ తైలం అని రాసి ఉంది. మొత్తం చదివి వివరాలు తెలుసుకున్నాడు. రహస్య గది లో గుండ్రంగా ఒక ముగ్గు వేసాడు. మధ్యలో మడత కుర్చీని పరిచాడు. రాగి ఉంగరం వేలుకు పెట్టుకున్నాడు. కొంచెం మ్యాజిక్ నూనె ను కుర్చీకి తన చేతులకు కాళ్లకు రాసుకున్నాడు. మ్యాజిక్ ఆయిల్ సీసాలు చేతి వేళ్ళ అంతే ఉంటాయి.ఈ మ్యాజిక్ ఆయిల్ ని ఎవరు రాసుకున్నా ఇతరులకు కనబడరనీ, ఎక్కడికైనా వెళ్లవచ్చని వారి అమ్మ రాసిన పుస్తకంలో ఉంది. ఇది రాసుకున్న కొంత సమయం తర్వాత, కృష్ణ బెంజిమన్ కుర్చీ తో సహా తను ఆకాశంలో ఉన్నట్టుగా తెలిసుకొన్నాడు. తన రాగి ఉంగరం తో అతను ఎటు వైపు చూపిస్తే అటువైపు ప్రయాణం సాగుతుంటే ఆశ్చర్యపోయాడు. చాలా సంతోషించాడు. వీటితో తన తల్లిదండ్రులను చేరుకోవచ్చని ఆనందపడ్డాడు. ఈ రాత్రి వారి తాత ను కలిసి మాట్లాడాలనుకున్నాడు. బ్రిటిష్ సైన్యం జైలులో తన తాత ను కలిశాడు. తన తాత కు తాను ఎలా వచ్చాడో చెప్పాడు . తన తల్లిదండ్రులను కలుసుకుంటానని చెప్పాడు. అప్పుడు వారి తాత మరిన్ని విషయాలు చెప్పాడు మ్యాజిక్ నూనె, మడత కుర్చీ రాత్రే పనిచేస్తుందని , పగలు పని చేయదని చెప్పాడు. బ్రిటన్ జైలుకు చేరుకోవాలంటే , సముద్రాన్ని దాటాలి .చాలా రోజులు ప్రయాణం చేయాలి. ఆకలిదప్పులు తట్టుకోవాలి .నిద్రను జయించాలి .పగలు ప్రయాణం ఉండదు , కావున పగలు ఖాళీ గా ఉండీ ఇతర ప్రమాదాల నుంచి తప్పించుకోగలగాలి. ఇది చాలా కష్టమైన పని ప్రాణాలతో చెలగాటం. వద్దు అని తాత వారించాడు. కానీ కృష్ణ బెంజిమెన్ వినలేదు. ఆ రాత్రి నుండి ప్రయాణం ప్రారంభించాడు. ఎక్కువగా సముద్రం మీద ప్రయాణం చేయవలసి వచ్చేది. బ్రిటన్ వెళ్లే ఓడలను అనుసరించేవాడు. సముద్రపు మధ్య అక్కడక్కడ దీవులలో ఆగే వాడు .ఆకలిని తట్టుకోలేక చెట్ల ఆకులను తిని ఉప్పు నీళ్లతో సరి కొట్టుకునే వాడు . దాంతో కడుపునొప్పితో అల్లాడిపోయే వాడు. కొన్నిసార్లు సముద్రపు చేపలను ఆహారం తినలేక బాగా ఏడ్చేవాడు. తన తల్లిదండ్రులను తలుచుకొని రోధించే వాడు. భగవంతుడిని సహాయం చేయమని ప్రార్థించేవాడు.కొన్ని రోజుల తర్వాత ఆహారం నీరు బాగా కష్టమయ్యింది. బాగా నీరసించి పోసాగాడు. పది రోజుల ప్రయాణం తర్వాత గ్యాలపాగస్ దీవులను చేరుకొన్నాడు. క్రూరంగా ఉండే వేట కుక్కలు కృష్ణ ను వెంబడించాయి. వాటి నుండి తప్పించుకోవడానికి బాగా పరిగెత్తాడు. ఒక చెట్టు మీది కెక్కి ఆ రోజంతా అక్కడే ఉన్నాడు. ఆహారం నీరు తక్కువగా తీసుకోవడం వలన స్పృహ కోల్పోయాడు. చెట్టు పై నుండి కింద పడి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లాడు. అదృష్టవశాత్తు దీవుల లోని సంచార జాతి వాళ్ళు కాపాడారు. మేల్కొన్న తర్వాత వారి భాష ఇతనికి, ఇతని భాష వారు అర్థం చేసుకోలేకపోయారు. ఇతను ఇక్కడికి ఎలా వచ్చాడో వారికి అర్థమయ్యేది కాదు. కుక్కల గాయాల వలన కొన్ని రోజుల పాటు అక్కడే ఉన్నాడు. చిన్న సంచిలో మడత కుర్చీ మ్యాజిక్ ఆయిల్ సీసాలను దాచేవాడు. అప్పుడు ఆ దీవుల కొచ్చేకొంతమంది నావికుల తో స్నేహం ఏర్పడింది .వారితో బ్రిటన్ జైలు సమాచారం, మ్యాప్ సేకరించ గలిగాడు. ఒక రోజు రాత్రి అతి ఎత్తయిన బ్రిటన్ జైలు గోడ ఒక పక్కకు చేరగలిగాడు. అన్ని జైలు గదులలో రాత్రిపూట ఎవరికీ కనబడకుండా తన మ్యాజిక్ ఆయిల్ తో పెద్ద పెద్ద ఇనుప తలుపులతో ఉన్న జైలు గదులను ఒక్కొక్కటిగా వెతికాడు.ఒక మూలన ఉన్న అమ్మా నాన్న జైలుగదిలోకి రహస్యంగా ప్రవేశించాడు. అచ్చం వాళ్ళ నాన్న లాగే ఉన్న కృష్ణ ను అమ్మ గుర్తుపట్టింది. ఈ సంఘటనకు వారి అమ్మ ఆనందం తో మాటలు పెగలలేదు . వారు కొడుకు స్థితిని చూసి గంటల తరబడి ఏడ్చారు. ఆ రోజు పగలంతా రహస్యంగా జైలు గోడల మధ్యే కృష్ణ ను దాచారు. ఒకవేళ బ్రిటిష్ అధికారులు చూస్తే ప్రాణాలకే ప్రమాదం. భయంతో గజగజ వణికిపోయారు. అన్ని విషయాలు తెలిసిన వాళ్ళ అమ్మ కృష్ణ తెచ్చిన మడత కుర్చీ మ్యాజిక్ తైలం ఉపయోగించింది.వారు తప్పించుకున్నారు. వారు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేంతవరకు గ్యాలపాగస్
దీవులలో కృష్ణా మిత్రుల వద్ద నివసించారు.1947 తర్వాత తన తాత ను కలుసుకొని తమిళనాడు సముద్రం తీరాన హాయిగా జీవితం గడిపారు. కృష్ణా బెంజిమెన్ సాహసం వారి గుండెలలో చెరగని ముద్ర వేసింది.

  • HARSHA

1 thought on “సాహసం”

Comments are closed.