నాకు రోల్ మోడల్ ఎవరు ?

Spread the love
Advertisements

నాకు రోల్ మోడల్ ఎవరు?
ఈ ప్రశ్న పదేపదే నాకు నేనే వేసుకున్నాను.
నా చిన్ననాటి బడి సంగతులు నుంచి ఇప్పటిదాకా జరిగిన అన్నీ విషయాలు గుర్తుకు వస్తున్నాయి.

తెలుగు నవలలు బాగా పొద్దు పోయేంతవరకూ చదివే వాడిని. మత గ్రంథాల కన్నా అభిమాన రచయితల కథలే బాగా చదివేవాడిని.
ఆ రచయితలు నాకు రొల్ మోడలా…
ఎందుకో మనసు అంగీకరించించటం లేదు.
మరీ సినిమాల హీరోలు…
నిస్సందేహంగా కారు..

సారా తాగిన వాడికి కొద్దిసేపు ఆ మత్తు ఉంటుంది.ఈ సినిమాలు కూడా అంతే…చూసినంత సేపు కనుల ముందు కొత్త లోక సాక్షత్కారం..
ఒక్కసారి ఆ మాయ ప్రపంచం లో నుండి బయటకు వస్తామో…సమస్యలన్నీ మేమున్నాం అంటూ ముందుకు వస్తాయి.
ఐఏఎస్ ఆఫీసర్లు…పోలీస్లు ..డాక్టర్లు..రాజకీయ నాయకులు…
వీరంతా మనోఫలకం నుంచి నిష్క్రమిస్తున్నారు.

రొల్ మోడల్ అంటే నన్ను నన్నుగా గుర్తించేవాడు.కింద పడిన ప్రతిసారి చేయందిస్తూ లేపేవాడు.
ఓటమిని లెక్క చేయక…
గెలుపుని పదిమందికి చెప్పుకుంటూ…
నన్ను తనలో చూసుకుంటూ..చివరి క్షణం వరకు తన సర్వస్వాన్ని దోచి ఇచ్చి …నేను ఉన్నత స్థానం చేరుకోగానే…తాను పక్కకు తొలిగి….దూరంగా ఉండి నా విజయాలన్నీ తన విజయాలుగా భావించే అతను మరెవరో కాదు…
మా నాన్న …జన్మనిచ్చిన తండ్రి.
అతన్ని మించిన రొల్ మోడల్ ఉంటాడా…
నాన్న…నువ్వే నా రొల్ మోడల్..

– గౌస్

మీ అభిప్రాయాన్ని comment box లో రాయగలరు…. ఈ ఆర్టికల్ ను మిత్రులతో కుటుంబ సభ్యులతో ఆప్తులతో షేర్ చేయగలరు

Advertisements

11 thoughts on “నాకు రోల్ మోడల్ ఎవరు ?”

స్పందించండి