విడియో గేమ్

Spread the love

కిట్టు 12 సంవత్సరాల చురుకైన పిల్లవాడు. తెలివైనవాడు అందరితో కలిసిమెలిసి ఉండేవాడు. వాళ్ళ అమ్మానాన్నలు ఒక్కగానొక్క కొడుకును అల్లారుముద్దుగా పెంచుకునేవారు. ఒకరోజు వాళ్ల నాన్న ఒక కొత్త ఫోన్ ఒక కొత్త సిమ్ కొన్నాడు. పాత ఫోన్ని అలాగే ఇంట్లో ఉంచాడు. క్రమంగా కిట్టు ఆ ఫోన్లో లో రకరకాల గేమ్స్ ని డౌన్లోడ్ చేసి ఆడే వాడు. ఒకసారి ప్లే స్టోర్ లో “Look & Smile”అనే కొత్త గేమ్ విడుదలైంది. దీనినే డౌన్లోడ్ చేసి ఆడటం మొదలు పెట్టాడు. ఈ గేమ్లో ఎంతసేపు స్మైల్ చేస్తే అన్ని పాయింట్స్ వస్తాయి. అలాగే ఎంతసేపు కళ్ళు ఆర్పకుండా చూస్తే అన్ని పాయింట్స్ వస్తాయి. రెండు కలిపి చేస్తే డబల్ పాయింట్స్ వస్తాయి. ఈ స్మైల్ గేమ్ కిట్టు కి బాగా నచ్చింది. కళ్లార్పకుండా చూస్తూ …..స్మైల్ చేస్తూ ఆడుతూ …..కాయిన్స్, గిఫ్ట్స్, క్యాష్ ప్రైజెస్ ఫోన్ లో గెలుచుకొని, స్టేజెస్ దాటుకుంటూ వెళ్తున్నాడు. ఆన్లైన్లో అందరి కంటే తనే ఎక్కువ కాయిన్స్ గెలుచుకోవాలని ఎక్కువ గంటలు ఆడ సాగాడు. క్రమంగా అమ్మానాన్నలతో ఫ్రెండ్స్ తో మాట్లాడడం మానేసి ఎప్పుడు ఫోన్ పట్టుకొనే కూర్చునే వాడు. తిండి కూడా సరిగ్గా తినకుండా గబగబా మింగే వాడు. కొన్ని సార్లు స్కూల్ కి వెళ్ళనని మారాం చేసేవాడు. ఇది చూసిన వాళ్ళమ్మ తిట్టి ఫోన్ లాక్కొని దాచేసింది. కిట్టు కోపంతో అరిచి గొడవ చేయసాగాడు. అయినా సరే వాళ్ళ అమ్మ ఫోన్ తిరిగి ఇవ్వలేదు. తర్వాత నిదానంగా స్కూల్ కి వెళ్ళ సాగాడు. అమ్మ సంతోషించింది. కానీ కిట్టు వాళ్ళ అమ్మ కు తెలియకుండా ఫోన్ ని తన స్కూల్ బ్యాగ్ లో దొంగతనంగా పెట్టుకొని వెళ్ళేవాడు. క్లాసులకు వెళ్లకుండా చెట్ల కింద దాక్కొని రహస్యంగా ఈ గేమ్ ఆడుతూ ఉండేవాడు. దీనివలన గేమ్ లో దాదాపుగా ఫైనల్ స్టేజ్ దగ్గరికి చేరాడు. ఈ గేమ్ గెలవడం కోసం రాత్రిపూట వాళ్ళ అమ్మానాన్నలు నిద్ర పోయిన తర్వాత, రాత్రి ఈ ఆట ఆడే వాడు. దీనివలన క్రమంగా నిద్ర కరువైంది. ఒకరోజు అకస్మాత్తుగా రాత్రి 3 గంటలకు ఏడవటం, అరవడం మొదలు పెట్టాడు. ఏం జరిగిందో వాళ్ళ అమ్మ నాన్నలకు అర్థం కాలేదు. కారణం అతని కను రెప్పలు మూసుకోవడం లేదు మరియు బుగ్గలు బిగుసుకుపోయాయి. కళ్ళు మూసుకో కపోవడంతో అతని కళ్ళు ఎర్రబడి నీళ్లు కారసాగాయి. కళ్ళకు కు కొంచెం గాలి తగిలిన తట్టుకోలేకపోతున్నాడు. కళ్ళు బాగా నొప్పి చేశాయి. ఎంత ప్రయత్నించినా కళ్ళు మూసుకోవడం లేదు. ఇంతవరకు ఇలాంటి కేసును చూడని డాక్టర్ ఇది ఎలా జరిగిందో అడిగాడు. కానీ వారి అమ్మానాన్నలు తెలియదన్నారు. మీ బాబు రోజు ఏం చేస్తుంటాడు ? అని డాక్టర్ అడిగాడు. మామూలుగా రోజూ స్కూల్ కి వెళుతున్నాడనీ బానే ఉన్నాడనీ, కానీ ఈ పది రోజుల నుండి మాత్రం నీరసంగా ఒంటరిగా ఉంటున్నాడని చెప్పారు. మొబైల్ గుంజు కోవడం వలన అలిగాడేమోనని మేము ఊరుకొన్నామని చెప్పారు. కొన్ని మందులు ఇచ్చి కంటికి తడిగుడ్డ కట్ట వలసినదిగా సిఫారస్ చేసినాడు. బుగ్గలు గట్టి పడడం వలన మాటలు కూడా పెగిలేవి కావు. మాట్లాడలేక ఇబ్బంది పడే వాడు. కొంచెం తడిగుడ్డ అటూ, ఇటు జరిపినా నొప్పితో విలవిలలాడి పోయేవాడు. కొన్ని రోజుల తర్వాత ఒక రోజు బాగా నిద్ర పోయాడు.ఆ రాత్రంతా నిద్ర పోయిన తరువాత,మూతబడిన కళ్ళు ఉదయం నుండి తెరుచుకోవడం లేదని వాళ్ళమ్మ గుర్తించింది. కిట్టు సైగలు చేస్తున్నాడు కానీ చెప్ప లేక పోతున్నాడు. ఎంత ప్రయత్నించినా మూతబడిన కళ్ళు తెరవ లేకపోతున్నాడు. మాట్లాడ లేక పోతున్నాడు. ఇది చూసిన డాక్టర్ తనకు అర్థం కావట్లేదని హైదరాబాద్ వెళ్లాలని సూచించాడు. కిట్టు గుడ్డివాడిగా, మూగవాడిగా మారిపోయాడు. తల్లిదండ్రులు ఎంతగానో కుమిలిపోయారు. ఎన్ని టెస్టులు చేసిన అన్ని బాగుండేవి. ఈ పిల్లవాడు ఎందుకిలా అయ్యాడో డాక్టర్లకు కూడా అంతుబట్టలేదు. డాక్టర్లు చేతులెత్తేశారు. కిట్టు ను తీసుకొని ఇంటికి చేరారు. చుట్టాలు, చుట్టుపక్కల వాళ్ళు దయ్యం పట్టిందని దిష్టి తాకిందని, చేతబడని రకరకాలుగా మాట్లాడేవారు. ఇది విని వాళ్ళ అమ్మ ఎంతగానో కుమిలిపోయింది. విషయం తెలుసుకొన్న వాళ్ల మామయ్య అంజి రెడ్డి ఇంటికి వచ్చాడు. ఇతను సాప్ట్ వేర్ ఇంజనీర్. ఇతను పిల్లల వీడియో గేమ్స్ డిజైన్ చేస్తాడు .ఇతనికి పిల్లల మనసు బాగా తెలిసు. కిట్టు గురించి తెలుసుకోవడం కోసం స్కూల్ టీచర్లను అతని స్నేహితులను ఆరా తీశాడు. స్కూల్ టీచర్లు గత 20 రోజుల నుండే ఈ సమస్యనీ, స్కూలుకు వచ్చేవాడు కానీ క్లాసులకు ఆబ్సెంట్ అయ్యేవాడనీ చెప్పారు. స్నేహితులు క్లాస్ కు రాకుండా చెట్ల కిందే దాక్కునే వాడని చెప్పారు. ఇంటికొచ్చిన అంజి రెడ్డి అతని స్కూల్ బ్యాగ్ ని చెక్ చేశాడు. అందులో మొబైల్ ఫోన్ దొరికింది. చార్జింగ్ పెట్టి మొత్తం చూశాడు. అందులో look & smile గేమ్ ను తెరిచాడు. ఒక సంవత్సరం పాటు ఆడవలసిన ఆ ఆటను 17 రోజులలో పూర్తి చేశాడు.ఇది ఎలా చేయగలిగాడో వాళ్ల మామయ్యకు అర్థం కాలేదు. అతనికి షాక్ లా అనిపించింది.కానీ గేమ్ లోని చివరి నిమిషం సబ్మిట్ చేయలేదని తెలుసుకొన్నాడు. తీవ్రంగా గేమ్ ఆడడం వలన ఆటలో మైండ్ లాక్ అయి ఉండ వచ్చేమో నని, ఒకవేళ దీని కారణంగా ఇలా జరిగిందా? అని అనుమాన పడ్డాడు. వెంటనే తన కంపెనీ వీడియో గేమ్ డాక్టర్ ని పిలిపించాడు. ఇద్దరు కలిసి ఒక ఉపాయం ఆలోచించారు. వీరే look & smile గేమ్ లోనీ కిట్టు పూర్తి చేయని లాస్ట్ మినిట్ ని సబ్మిట్ చేశారు.దీనితో కిట్టు ఆల్ ఇండియా లో ఈ గేమ్ ని గెలిచేశాడు. క్యాష్ ప్రైజ్ లక్ష రూపాయలు సాధించగలిగాడు. ఈ విషయాన్ని తన మామయ్య కిట్టు చెవి దగ్గర తను గేమ్ గెలిచేశాడని క్యాష్ ప్రైస్ తో రెండు రోజులలో కంపెనీ వాళ్ళు వస్తున్నారని నీవే త్వరగా లేచి రెడీ అయ్యి ఆ ప్రైజ్ మనీ తీసుకోవాలని చెప్పాడు. వెంటనే కిట్టు లో కొద్దిగా మార్పు కనిపించింది. వెంటనే వాళ్ల మామయ్య దీనికి తోడుగా look & smile గేమ్ మేనేజర్స్ తో కూడా ఫోన్ లో మాట్లాడించగానే కిట్టు మాట్లాడడం మొదలు పెట్టాడు. వారు నిజంగానే రెండు రోజులలో వచ్చి ప్రైజ్ మనీ ఇస్తామని చెప్పగానే కిట్టు కళ్ళు తెరిచి మామూలుగా అవ్వడం మొదలు పెట్టాడు. ఇది చూసిన వాళ్ళ కాల్నీ వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అనుకున్నట్టుగానే రెండు రోజుల తర్వాత ప్రైజ్ మనీ తీసుకున్న కిట్టు చాలా సంతోషంగా మామూలుగా అయ్యాడు. మొబైల్ గేమ్స్ కంపెనీవారు పిల్లలు కానీ పెద్దలు కానీ అతిగా మొబైల్ వాడకూడదనీ, చాలా ప్రమాదకరమని తెలియజేశారు. అతిగా మొబైల్ లో గేమ్స్ ఆడడం వలనే కిట్టు మైండ్ చివరి నిమిషంలో లాక్ అయ్యిందని వారి మామయ్య గమనించకపోతే జీవితాంతం గుడ్డివాడిగా మూగవాడిగా మిగిలిపోయే వాడని చెప్పారు. మూఢనమ్మకాలు వదిలి సైంటిఫిక్ గా ఆలోచించాలని చెప్పారు. అప్పటినుండి ఆ కాలనీ వాళ్ళందరూ పరిమితంగా ఫోన్ వాడుతూ…. అవుట్ డోర్ర్ గేమ్స్ ఎక్కువగా ఆడే వారు. చూశారుగా పిల్లలూ ఫోన్ తో మొబైల్ గేమ్స్ తో జాగ్రత్తగా ఉండాలని నేర్చుకున్నారు గా…… మరి.బాయ్…

  • హర్ష

అమ్మ చెప్పిన కథలు 2

Spread the love

Spread the love అమ్మ చెప్పిన కథలు 2 దువా (ప్రార్ధన)ఖలీఫాలు రాజ్యాలను పరిపాలించే రోజులవి.పర్షియా దేశానికి దగ్గరలో ఉన్న యెమెన్ దేశాన్ని సద్గుణ సంపన్నుడు,న్యాయకోవిదుడు అయిన ఖలీఫా కైఫ్ పరిపాలిస్తున్నాడు.అతని పాలనలో ప్రజలందరూ సుఖంగా జీవిస్తున్నారు.ఒయాసిస్సుల నిండా నీళ్లు పుష్కలంగా ఉండేవి.ఖర్జూరపు తోటలు,గోధుమ చేలు, రకరకాల పండ్ల తోటలు,పూల వనాలు కనులకింపుగా ఉండేవి.దూర ప్రాంతాల…

అమ్మ చెప్పిన కథలు 1 – sheru

Spread the love

Spread the love “శ్రమజీవి”……… ఎగసిపడే అలలతో అల్లకల్లోలంగా ఉంది సముద్రం.చేపల వేటకు వెళ్లిన వారంతా వేగంగా తెడ్లు ఆడిస్తూ తీరం వైపు వస్తున్నారు.చీకటి పడటానికి ఇంకా చాలా సమయం ఉంది కానీ నల్లటి మేఘాలు ఆకాశం నిండా కమ్ముకోవటంతో చీకటిగా ఉంది.వేగంగా గాలులు వీస్తున్నాయి.గాలి చప్పుడు..సముద్రపు అలల చప్పుడుతో కలిసి భయంకరమైన కొత్త ధ్వనులు…

ఇండియా బ్యాండ్ చేసిన చైనా యాప్స్ లిస్ట్ banned apps

Spread the love

Spread the love ఇండియా బ్యాండ్ చేసిన చైనా యాప్స్ లిస్ట్ banned chaina apps list 1. TikTok2. Shareit3. Kwai4. UC Browser5. Baidu map6. Shein7. Clash of Kings8. DU battery saver9. Helo10. Likee11. YouCam makeup12. Mi Community13. CM Browers14. Virus Cleaner15. APUS Browser16.…

Leave a Reply