జ్ఞాపకం

Spread the love
Advertisements

జ్ఞాపకం…
ఓ…వాసంత సమీరం…
ఓ..వెన్నెల జలపాతం…
ఓ..మరుమల్లెల సౌరభం…
ఓ..హరివిల్లు సోయగం…!!

జ్ఞాపకం…..
ఓ..మొగలి పూల పరిమళం…
ఓ…మలయ మారుతం
ఓ…చందన లేపనం..
ఓ…నందన వనం..
ఓ..హిమ శైల శిఖరం..!!

జ్ఞాపకం…..
పెదవులపై మెదిలే… ఓ..చిరు దరహాసం…
తలపులలో కదలాడే.. ఓ..సజీవ చిత్రం…
కనుల వెనుక దాగిన…
ఓ..సుందర స్వప్నం…
మనసును తడిమే.. మమతల హారం…
మరువలేని,మరపురాని
ఓ..తీయని గతం…!!

జ్ఞాపకం….
ఓ..కల్లోల సముద్రం..
ఓ..కన్నీటి కెరటం…
ఓ..అంతులేని విషాదం
ఓ..మనసుకైన గాయం
ఓ..చేదు అనుభవం..
ఓ..చక్కని గుణపాఠం..
ఓ..అమూల్యమైన జీవిత సారం!!!

జ్ఞాపకం….
మనసును మురిపిస్తే…
అదో గొప్ప వరం…!!
మనిషిని బాధిస్తే…
అదే ..ఓ..పెద్ద..శాపం!!!

శకుంతల

Advertisements

స్పందించండి