manthena satyanarayana raju daily routine

డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజుగారి దినచర్య ( dr.manthena satyanarayana raju daily routine )

Spread the love

ఆహారపు అలవాట్లు……. మంచినీళ్లు త్రాగు విధానం…..ఆరోగ్యంలో నిద్రపోవడం యొక్క ప్రాముఖ్యత…..శారీరక శ్రమ…….అధిక బరువు తగ్గడం ఎలా?……వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారం…. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో మరెన్నో విషయాలు తెలుగు ప్రజలకు అందించిన ఉన్నతమైన వ్యక్తి తెలుగు ప్రజలందరికి  సుపరిచితం అయిన పేరు…..డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు మరి వారి దినచర్య (daily life style) గురించి తెలుసుకోవాలని మన SARS.CO.IN ఫాలోవర్స్ కోరిక మేరకు ఈ article ప్రచురించడం జరిగింది…. 

ఇంకెందుకు ఆలస్యం పదండి వారి మాటల్లోనే తెలుసుకుందాం…… డాక్టర్ మంతెన సత్యనారాయణ గారి దినచర్య
నేను మీ అందరికీ ఆదర్శంగా ఉండాలి అంటే ముందుగా నేను ఆచరించాలి. నేను ఆచరించని దే ఏ విషయం కూడా మీకు చెప్పను.
ఆచరించి అనుభవించి అందులోని సారం మీకు తెలియజేస్తాను

manthena satyanarayana raju daily routine

  • ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేస్తాను.
  • నిద్ర లేచిన వెంటనే నీరు తాగకుండా మలవిసర్జన చేస్తాను.
  • ఆ తర్వాత అరగంట సేపు నాలుగు గంటల నుండి నాలుగున్నర వరకు మెడిటేషన్ చేస్తాను.
  • మెడిటేషన్ తర్వాత ఒక గంట పాటు శారీరక వ్యాయామం లేదా ఆసనాలు ప్రతిరోజు నాలుగు గంటల 30 నిమిషాల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు చేస్తాను.
  • ఆ తర్వాత ఉదయం ఐదున్నర గంటలకు ఒక లీటర్ నర గోరువెచ్చని నీళ్లు తాగుతాను.
  • 5:30  నుండి 6:00 ఆ సమయంలో రెండో సారి మలవిసర్జన చేస్తాను.
  • బ్రష్ చేస్తాను పేస్ట్ లేకుండా, పది రోజులకు ఒకసారి పేస్ట్ తో బ్రష్ చేస్తాను.
  • షేవింగ్ చేసిన వెంటనే స్నానం చేస్తాను.
  • ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల మధ్య సమయంలో  షూటింగ్ సమయం. ఈ సమయంలో యూట్యూబ్ వీడియోలు లేదా వివిధ tv చానల్స్ లో వీడియోల కోసం షూటింగ్ జరుగుతుంది.
  • మధ్యలో కొంచెం కొంచెం గా సుమారు ఒక లీటర్నర నీరు తాగుతాను.
  • ఉదయం తొమ్మిది గంటలకి వెజిటేబుల్స్ జ్యూస్ లేదా ఫ్రూట్ జ్యూస్ 300ml తీసుకుంటాను.
  • ఈ సమయంలో న్యూస్ పేపర్ చదువుతాను.
  • తర్వాత పది గంటల వరకు ముఖ్యమైన ఫోన్ కాల్స్ మాట్లాడుతుంటాను.
  • పది గంటల నుండి 11:30 వరకు మొలకెత్తిన విత్తనాలు ఫ్రూట్స్ తింటాను
  • 11:30 నుండి ఒంటి గంట వరకు ఆశ్రమ కార్యక్రమాలు చూసుకుంటాను.
  • ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు రెస్ట్ తీసుకొని ఈ సమయంలో పడుకుంటాను.
  • రెండు గంటల నుండి ప్రతి గంటకు నీరు తాగుతుంటాను.
  • 2:30 నుండి 7 గంటల వరకు కన్సల్టెంట్స్ టైం.
  • ఈ సమయంలో లో  కొంచెం మంచిగా నీరు తాగుతుంటాను.
  • సాయంత్రం4:30 ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటాను
  • 5:30 నుండి 6:30 మధ్య సమయంలో డిన్నర్ పూర్తి అవుతుంది. డిన్నర్ లో నట్స్ బాదం పప్పు వేరుశనగలు ఫ్రూట్స్ మొద.. తీసుకుంటాను 
  • ఆ తర్వాత మలవిసర్జన చేస్తాను.
  • 7 గంటల నుండి 9 గంటల సమయంలో ఆశ్రమ వారికి వివిధ అంశాల మీద క్లాసెస్ కార్యక్రమం జరుగుతుంది.
  • 9 గంటల నుండి 10 గంటల వరకు యూట్యూబ్లో లైవ్ లో పాల్గొంటాను
  • 10 గంటలనుండి 10:30 వరకు మెడిటేషన్ చేస్తాను.
  • రాత్రి 10:30 కి నిద్రపోతాను.

manthena satyanarayana raju daily routine

ఉచిత ఆరోగ్య సలహాలు కొరకు సంప్రదించండి 9848021122 ఉదయం 7 గం. నుండి రాత్రి 9 గం.సోమవారం నుండి శనివారం వరకు.

One thought on “డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజుగారి దినచర్య ( dr.manthena satyanarayana raju daily routine )”

Leave a Reply