చదివే అలవాటును కోల్పోతున్నారా జనం..!!!!!!

“టీవీలు…యూట్యూబ్ లు అన్ని చెపుతుంటే.. చూపిస్తుంటే..ఇంకా పుస్తకాలు చదివే వారున్నారా?”

నా మిత్రుడు యధాలాపంగా అడిగినా ఈ ప్రశ్న…నన్ను మాత్రం చాలా ఆలోచింపచేసింది.చదివే అలవాటును కోల్పోతున్నారా జనం..
పరీక్షల కోసం…ఉద్యోగాల కోసం తప్ప పుస్తకాల జోలికి ఎవరూ వెళ్ళటం లేదు.వాటి కోసమే తప్ప మరెందుకు చదవాలి…మరే ఉపయోగము లేదా….
దృశ్యం..శబ్దం…కన్నులకు..చెవులకు పని చెపుతున్నాయి.
ఏదేని సినిమా గాని సీరియల్ గానీ చూస్తున్నప్పుడు మన చూపు ..ఆలోచన ఎంతసేపు దాని మీదనే ఉంటుంది కానీ స్వంతంగా మన మెదడు ఆలోచించదు…వారు చూపించిందే చూడాలి…
అదే ఓ కథ .. నవల ..కవిత చదువుతూ ఉంటే మన మనసు లో ఓ దృశ్యం ఏర్పడుతుంది..దాని చుట్టూ రకరకాల పాత్రలు..సన్నివేశాలు..కదలుతుంటాయి. అందులో మనం ఉంటాం…ఆ అనుభూతిని స్వంతం చేసుకుంటాం.వేరే ఆలోచనలు దరి చేరవు.అదో అద్భుతప్రపంచం…ఆ పాత్రలతో నవ్వుకుంటాం…ఎగురుతాం… గంతులువేస్తాం..బాధపడతాం.. రకరకాల అనుభూతుల్ని స్వంతం చేసుకుంటాం…
ఇన్ని ఆనందాలు మనకు టీవీ చూస్తేనో.. యూట్యూబ్ చూస్తేనో కలగవు.
ఏకాగ్రత కలగాలి అంటే ఏదైనా చదవాలి.
‘గత కొన్ని సంవత్సరాలుగా బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన వెబ్ మ్యాగజైన్లు …చదువరుల సంఖ్యను పెంచుతున్నాయా?’ ఓ పరిశీలన చేద్దామని కేవలం కథలు..కవితల కోసమే ఉన్న ఒక సైట్లో కెళితే…చాలా ఆశ్చర్యం కలిగే విషయాలు తెలిశాయి.గత సంవత్సరమే రాసిన ఓ సస్పెన్సు తో కూడిన పెద్ద కథను వేల సంఖ్యలో పాఠకులు చదివారు..నిన్ననే ప్రచురితమైన కథను ఒక్క రోజులోనే వందల సంఖ్యలో చదివారు.దీనిలో గమనించవలసిన గొప్ప విషయం ఏమిటంటే వీరంతా గొప్ప రచయితలు కాదు.కొత్తగా రాస్తున్నవారే…పేరున్న రచయితల కంటే కొత్త రచయితలకే డిమాండ్ ఎక్కువగా వుంది.
ఈ లాక్ డౌన్ సమయంలో పిల్లల్ని టీవీల ముందు నుంచి పక్కకు తప్పించి అందుబాటులో ఉన్న ఏదేని చిన్న పుస్తకం ఇవ్వండి.ఆ కథల లోని పాత్రలతో మమేకం అవమని చెప్పండి.పనిలో పనిగా ఒక పెన్ను..నోట్ బుక్ కూడా చేతిలో పెట్టండి.నచ్చిన వాక్యం క్రింద గీత గీయమనండి.కొత్త పదం..తెలియని విషయం వస్తే రాసుకోమని చెప్పండి.ఇలా చేయటాన్ని సైకో మోటార్ లెర్నింగ్ అంటారు.చదువుతూ..చేస్తూ ఉంటే..మనలోని న్యూరాన్స్ ఉత్తేజితమై కొత్త ఆలోచనలు..కొత్త ప్రయోగాలు వచ్చే అవకాశం ఉంది.
ఇప్పుడు కొత్త పుస్తకాలు అందుబాటులో లేక పోవచ్చు..తెలుగులో అనేక వెబ్ మ్యాగజైన్లు వస్తున్నాయి.ఎదో ఒక మ్యాగజైన్ లో మంచి కథనో..కవితనో సూచించండి.
ముందు మీరు చదవండి.
తరువాత పిల్లలతో చదివించండి.
@షేరూ(గౌస్)

3 thoughts on “చదివే అలవాటును కోల్పోతున్నారా జనం..!!!!!!”

    1. Thanks andi.
      Now a days ..no one likes to read except..Text books… Competitive books and News papers.
      The thrill we get while reading anything ..can’t get the same watching tv or films.Everyone should make a habit of reading anything s/he likes.

Comments are closed.