మార్పుకి ముందడుగు

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

కొన్ని సంత్సరాల ముందు వరకు మన పిల్లలు యువకులు ఆసక్తికరమైన విషయాలను కనుగొనడం చూసేవాళ్ళం….

పలానా ఉళ్లో ఓ పిల్లాడు ఈ పరికరం తయారు చేశాడు,
పలానా ఊళ్ళో ఓ పాప ధైర్యాన్ని ప్రదర్శించింది,
పలానా చోట అక్కడి యువత కలిసి ఒక సమస్యను పరిష్కరించారు…. మొదలగునవి.

కాని ఇప్పుడు ఈరోజుల్లో……

ఒక 10 సంవత్సరాల బాబు pubg ఆడుతూ బిల్డింగ్ పైనుంచి దూకి చనిపోయాడు,
టిక్ టాక్ చేస్తూ చనిపోయాడు, బైక
కోసం ఆత్మహత్య చేసుకున్నాడు,
మొబైల్ కోసం తల్లిదండ్రుల పై చేయి చేసుకున్నాడు….

ఈ చిల్లర వేషాలు తప్ప ఇంకేం లేదు…

ఇదే కాదు…

ఇంతకుముందు పెద్దల సమస్యల్లో, ఊరి సమస్యల్లో యువత ఊరీ జనాలకు తోడుగా నిల్చేవాళ్ళు

ఇప్పుడు తోడు కాదు కదా… సమస్యలు ఏంటి ఎలా వస్తున్నాయి అని ఆలోచించే తత్వం కూడ కోల్పోయారు..
అలోచించే మేధస్సు కోల్పోయారు..

యువతరం ఇలా చచ్చిపోతుంది ….

ఇదే మన భారత దేశ దౌర్భాగ్యం..

ఇంకా ఇలాగే చూస్తూ వదిలేస్తే… భారత దేశం యువత పరిస్థితి ప్రశ్నార్థకం అవుతుంది…

ఇప్పటికైనా మనలో చైతన్యం రావాలి….
ముఖ్యంగా యువతలో..

నేటి యువతరమే రేపటి భవిషత్తు..

వారిని సరైన మార్గం లో నడిపించండి
దేశం పట్ల, దేశ రాజ్యాంగం పట్ల, దేశ ప్రజల పట్ల ఆసక్తి, గౌరవం, భయం భాద్యతలు కల్పించాలి.

రాజకీయ వ్యవస్థ పట్ల అవగాహన
దేశంలో సమస్యల పట్ల అవగాహన కల్గించాలి.

School లో పిల్లలకు భవిష్యత్తులో మీరు డాక్టర్లు కావాలి ఇంజనీర్లు కావాలి అని నేర్పించడమే కాదు… ప్రజల కోసం అండగా నిలబడే నాయకులు అవగలిగెలా నాయకుడి లక్షణాలు వాళ్ళలో ప్రేరేపించాలి.

ప్రజలన్నా ప్రజాస్వామ్యం అన్నా అర్థం తెలియని మూర్ఖులతో మనం పాలించబడుతున్నాం..

కనీసం ఇప్పటికైనా కళ్లు తెరవండి.
ప్రస్తుతం రాబోయే ఎన్నికల్లో యువతరానికి అవకాశం ఇవ్వండి.

రాజకీయాల్లోకి వచ్చేందుకు పూర్తి అర్హులైన వాళ్ళు
ప్రజల సమస్యల పట్ల, సమస్యల పరష్కారాల పట్ల పూర్తి అవగాహన, నీతి, నిజాయితీ, జవాబుదారీతనం, భయం, భాద్యతతో పని చేసే యువత చాలా మంది ఉన్నారు…
అటువంటి వాళ్లకు అవకాశం ఇవ్వండి.
యువతరాన్ని ప్రోత్సహించండి.

రేపటి భారత భవిష్యత్తులో రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్న యువతరాన్ని చూడండి.

జై హింద్….✊🏻🇮🇳

  • అజహర్