బ్యాన్ చైనా నినాదం ఉత్తిదేనా ?

ఇటీవలి కాలంలో భారతదేశం యొక్క భూభాగాన్ని ఆక్రమించాలని చైనా చేసిన ప్రయత్నాన్ని భారత్ చాలా బలంగా తిప్పికొట్టింది.

ఈ నేపథ్యంలో బ్యాన్ చైనా ప్రొడక్ట్స్ మరియు బాన్ చైనా గూడ్స్ అన్న నినాదం భారతదేశాన్ని ఉర్రూతలూగించింది.

స్వదేశీ నినాదాన్ని భారతదేశంలో ఉన్న యువత మొత్తం సోషల్ మీడియాలో చాలా వేగంగా తీసుకుపోయారు.

ఈ క్రమంలోనే చైన కు సంబంధించిన అనేక ఆండ్రాయిడ్ అప్లికేషన్లను రిమూవ్ చేయడం మరియు అదే సమయంలో భారత దేశ సమగ్రత ,భద్రత అంశంలో ఉన్న లోపాలను అధిగమించడానికి ఆండ్రాయిడ్ అప్లికేషన్లు మన దేశ సమాచారాన్ని చైనా సర్వర్లలో దాచిపెడుతు న్నాయోఆ యా అప్లికేషన్లను భారత ప్రభుత్వం నిషేధించింది.

ఇవన్నీ ఫోన్లో ఉన్న అప్లికేషన్ల వరకు మనం ఇటువంటి చర్యలు తీసుకున్నాం.

అయితే తాజాగా అమెజాన్, ఫ్లిప్కార్ట్ ల లో నిర్వహించిన ఫ్లాష్ సేల్ లో చైనా కు సంబంధించినటువంటి ప్రముఖ కంపెనీలు వన్ ప్లస్ మరియు xiomi, రెడ్మీ కంపెనీలకు చెందిన వివిధ మోడల్స్ ఆన్లైన్లో ప్రకటించిన కొద్ది సేపట్లోనే అన్ని అమ్ముడుపోయాయి.

ఇది మనల్ని అత్యంత ఆశ్చర్యానికి గురి చేసేటువంటి అంశం. వన్ ప్లస్ కంపెనీకి చెందినటువంటి మోడల్ వన్ ప్లస్ nord ఫోన్ ను వినియోగదారులు అత్యధిక సంఖ్యలో కొనుగోలు చేశారు,అదేవిధంగా రియల్ మీ మొబైల్ ఫోన్లు దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేశాయి. ఇక xiomi మరియు రెడ్మీ మొబైల్స్ ప్రకటించిన కొన్ని క్షణాల్లోనే అన్ని అమ్ముడయ్యాయి అంటే మనం అర్థం చేసుకోవచ్చు.

సోషల్ మీడియాలో ఇచ్చే నినాదాల కంటే డబ్బుకు మనమిచ్చే విలువే ఎక్కువగా ఉంది.అనే విషయం ప్రస్తుతం ఈ సేల్స్ మనకు రుజువు చేస్తున్నాయి అయితే భావోద్వేగాలు ఎమోషన్స్ అనేవి వ్యక్తులకు ఎక్కువకాలం స్థిరంగా ఉండటం కారణంగా చివరకు వేల్యూ ఫర్ మనీ నే అందరూ అనుసరిస్తున్నారు అని అనడంలో సందేహం లేదు.

ఇక్కడ క్లిక్ చేయండి