కాల్ సెంటర్ ఉద్యోగాలు త్వరలో మాయం కాబోతున్నాయా ?

call phones

రానున్న రోజుల్లో టెలిమార్కెటింగ్ వ్యవస్థలో కాల్ సెంటర్లలో పని చేయడానికి మనుషులకు కాకుండా రోబో లకు కూడా అవకాశాలు రాబోతున్నాయా?

సాధారణంగా ప్రతి ఒకరికి ప్రతిరోజూ వారి నెట్వర్క్ కంపెనీల దగ్గర నుంచి మొదలుపెడితే వివిధ కంపెనీల బ్యాంకుల టెలి మార్కెటింగ్ కాల్స్ అనేవి సర్వసాధారణంగా వస్తుంటాయి అయితే ఇప్పటివరకు వివిధ కంపెనీలు కొంత డాటాబేస్ సేకరించి కాల్ సెంటర్లో నిర్వహిస్తూ అందులో పనిచేసే వారికి ఈ రోజు ఒక రెండు వందల నుండి 300 వరకు కాల్ చేయాలి అని చెప్పేసి వారికి రూల్స్ ఉంటాయి.

భవిష్యత్తులో ఈ టెలిమార్కెటింగ్ కాల్స్ ని మనుషులకు బదులుగా రోబోలు చేయబోతున్నాయి. ఎలా అయితే ప్రస్తుతం రికార్డు వాయిస్ ని ప్లే చేస్తున్నాయో అలా కాకుండా రియల్ టైం లో మనం మాట్లాడిన సమాచారాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో అప్పటికప్పుడే విశ్లేషణ చేసి రెస్పాండ్ అయ్యే విధంగా రోబోటిక్ స్క్రిప్ట్ వివిధ కంపెనీలును తయారు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి.

ఇదే గనుక జరిగితే ఈ రోబో లు సాధారణ మనుషుల లాగా రోజుకి 200 నుండి 300 వరకు కాకుండా దాదాపుగా ఒక మూడు వేల మందికి కూడా ఫోన్ చేయగలవు.

అంటే భవిష్యత్తులో మనకు టెలిమార్కెటింగ్ కాల్స్ బెడద పెరగడంతోపాటు కాల్ సెంటర్లలో ఉద్యోగాలు కూడా ఈ రోబో ల ప్రవేశంతో మాయం కాబోతున్నాయన్నమాట…

ఇక్కడ క్లిక్ చేయండి