క్యారం బోర్డ్ 1

క్యారం బోర్డ్

క్యారం బోర్డ్

క్యారం బోర్డ్

అది ఒక కొత్తగా నిర్మించిన ఖరీదైన… అపార్ట్మెంట్. దాదాపుగా 50 ధనవంతులైన ఫ్యామిలీలు దీనిలో నివసిస్తున్నాయి. అపార్ట్మెంట్ బిల్డర్ కమ్ ప్రెసిడెంట్ ….శ్రీరంగరాజు గారికి ఇండోర్ గేమ్స్ అంటే చాలా ఇష్టం. తన ఒక్కగానొక్క కొడుకు “క్రిస్టోఫర్” తో సహా పిల్లలందరికీ క్యారం బోర్డ్ కోచింగ్ సెంటర్ ని అపార్ట్మెంట్ కింద ఏర్పాటు చేశాడు…. “క్రిస్టఫర్” ఒక అద్భుతమైన క్యారం బోర్డు ప్లేయర్. మెరిట్ స్టూడెంట్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతూ… నేషనల్ గేమ్స్ కి సిద్ధం అవుతున్నాడు. అపార్ట్మెంట్లలో నివసించే దాదాపు 100 మంది పిల్లలందరికీ ఇతనే రోల్ మోడల్… శ్రీ రంగ రాజు గారు అపార్ట్ మెంట్ వాచ్ మెన్ డ్యూటీ చేయడానికి తన సొంత ఊరు నుండి ఒక ఫ్యామిలీని గ్రౌండ్ ఫ్లోర్ లో నియమించాడు. వారికి ఒక్కగానొక్క కూతురు…. కవిత. వాళ్ల నాన్న గ్రౌండ్ ఫ్లోర్లో ఇస్త్రీ చేస్తే …. కవిత వాళ్ళ అమ్మతో అపార్ట్ మెంట్ లో వివిధ రకాల పనులు చేస్తూ…. గవర్నమెంట్ కాలేజీ లో B.A., 1st ఇయర్ చదువుతోంది. ఆ అమ్మాయి రోజూ… పిల్లలందరూ క్యారం బోర్డ్ ఆడుతూ ఉంటే… నిలబడి చూస్తూ ఉండేది. కానీ వాళ్ల అమ్మానాన్న మాత్రం ఆ అమ్మాయిని పనిచేయాలనీ, ఆటలతో కడుపు నిండదని చెప్పేవారు. ఒక్కోసారి కవితకు ఆడే అవకాశం దొరికినా, అక్కడి పిల్లలు ఆ అమ్మాయి పల్లెటూరి బట్టలను, రూపాన్నీ చూసి తనకు ఆడే అవకాశాన్ని ఇచ్చేవారే కాదు…తను మాత్రం క్యారం బోర్డ్ నేర్చుకోవాలని తహతహ…. లాడేది. ఇది గమనించిన క్యారంబోర్డ్ కోచ్… సౌరవ్….. కోచింగ్ క్లాస్ కి పిల్లల హాజరు తక్కువగా… ఉన్నప్పుడు కవితకు ఆట ఆడే అవకాశం కల్పించేవాడు. బదులుగా గా కోచింగ్ క్లాస్ నీ,ఆ ప్రాంగణాన్ని శుభ్రం చేయడం, చిందరవందరగా ఉన్న క్యారంబోర్డు లను, వాటి కాయిన్సిని సర్దడం, ఊడ్వటం లాంటి పనులన్నీ చేయాల్సి వచ్చేది . అపార్ట్ మెంట్లో తన పనిని త్వరత్వరగా ముగించుకొని క్యారం ఆడే ఈ అవకాశం కోసం ఎదురు చూసేది…. ఎవరైనా ఆబ్సెంట్ అయితేనే తనకు ఆడే అవకాశం ఇచ్చేవారు.ఇలా కొన్ని రోజుల్లోనే తను సునాయాసంగా క్యారంబోర్డు ఆడటం నేర్చుకుంది. క్రమంగా ఈ ఆటలో సింగిల్స్, డబుల్స్ టెక్నిక్ తో వేగంగా… ఆడటం తో….. అపార్ట్మెంట్ పిల్లల్లో కొంత అభిమానాన్ని సంపాదించుకుంది. అనేకసార్లు క్యారమ్స్ డబుల్స్ గేమ్ లో కవితను తమ జట్టులో కోరుకోవడానికి అక్కడి పిల్లలు పోటీ పడేవారు. ఒక్కోసారి ఆ అపార్ట్మెంట్ లో No.1 ఆటగాడు “క్రిస్టఫర్” తోనే నువ్వా! నేనా? అని పోటీపడి…. ఆ కోచింగ్ సెంటర్ లోనే. NO.2 స్థాయికి కవిత ఎదిగింది. దీంతో తనను మాత్రమే అభిమానించే తన స్నేహితులు…..కవిత తో మాట్లాడటం, స్నేహం చేయడం క్రిస్టోఫర్ కి నచ్చేది కాదు. తక్కువ సమయంలో ఆటలో ఇంత ప్రావీణ్యాన్ని సంపాదించిన కవిత ను సహించే వాడు కాదు.ఇంతలో గణేష్ నవరాత్రుల సందర్భంగా క్యారమ్స్ పోటీని నిర్వహించాలని అపార్ట్మెంట్ కమిటీ నిర్ణయించింది. అందువలన పిల్లలంతా ప్రాక్టీస్ చేయడం పెంచారు. అప్పుడు క్రిస్టోఫర్ కవితకు ప్రాక్టీస్ చేసే అవకాశాన్ని ఇచ్చేవాడు కాదు. దీనికి తను మౌనంగా రోదిస్తూ… క్లాస్ రూమ్ వద్ద తచ్చాడుతూ తిరిగేది. అక్కడ ఇస్త్రీ చేస్తూ.. ……ఇదంతా గమనిస్తున్న వాళ్ళ నాన్న! మనకు ఈ ఆటలు వద్దే బిడ్డా! పెద్దోళ్ళతో ఇట్లాంటి ఆటలు మనల్ని ఇబ్బందుల్లోకి నెడతాయే…
..మన పనేదో మనం చేసుకుందామని చెప్పేవాడు. ఇదంతా విని, చూసిన కోచ్ సౌరవ్ కవితను రాత్రి ప్రాక్టీస్ చేసుకోవాల్సిందిగా అనుమతిచ్చాడు. దీంతో కవిత కి మరో అవకాశం దొరికింది. తను రాత్రి గంటలతరబడి….. సొంతంగా ప్రాక్టీస్ చేసేది. ఇది గమనించిన క్రిస్టోఫర్ క్యారం బోర్డ్ కాయిన్స్ ని దాచేసేవాడు. క్రిస్టఫరే దాచేశాడని తెలిసినా…. కోచ్ సౌరవ్ …తన ఉద్యోగానికి ఎక్కడ ఎసరు వస్తుందేమోనని తానూ ఏమి చేయలేక… సైలెంట్ గా ఉండిపోయేవాడు. కానీ….. ఆ అమ్మాయి పరిస్థితి ని చూసి తన సొంతంగా మరో సెట్ ఆఫ్ కాయిన్స్ తెచ్చి ఇచ్చి… కవితని ప్రాక్టీస్ చేయమని చెప్పాడు. కవితా వాళ్ళ అమ్మానాన్నలు కవితను ఈ పోటీలో పాల్గొనవద్దనీ, మనకీ ఆటలు వద్దని…. తిట్టేవారు. ప్రాక్టీస్ కి కూడా సహకరించేవారు కాదు. కానీ బలవంతంగా వారిని ఎలాగో ఒప్పించి తను మళ్లీ ప్రాక్టీస్ ప్రారంభించిది. దీంతో క్రిస్టఫర్ లో అసూయ పెరిగి, కవిత ఆడే ఆ కొత్త కాయిన్స్ కి గుండు సూది…. అంత సన్నని రంధ్రం చేసి… అందులో సీసం నింపి గుర్తుపట్టకుండా… మూసేశాడు. ఇది అర్థం కాని కవిత తన ప్రాక్టీస్ లో మరో సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎంత ప్రయత్నించినా ఆ కాయిన్స్ క్యారంబోర్డ్ రంధ్రంలో పడేవి కావు. సడన్ గా…… తను ఆటకు ఏమైంది? నేను ఎందుకు సరిగా ఆడలేక పోతున్నాను? ఏమైంది?.
తెలియని ఆందోళనలో,స్ట్రెస్.. తో
కోచ్ సార్ కి బాధపడుతూ…..చెప్పింది. కాయిన్స్ లో జరిగిన విషయం తెలియని కోచ్…. టెన్షన్ తగ్గించుకుని ప్రశాంతంగా ప్రాక్టీస్ చేయడం వలన మాత్రమే నువ్వు మునుపటి స్థాయికి చేరగలవని చెప్పాడు. ఈ తికమక కాయిన్స్ తో గంటలతరబడి కుస్తీ పడుతూ.. తన దరిద్రాన్ని
తిట్టుకునేది. ఇది చూసిన క్రిస్టఫర్ సంతోషించేవాడు. గణపతి నవరాత్రుల క్యారం బోర్డ్ పోటీలు ప్రారంభమయ్యాయి. క్రిస్టఫర్…. కవిత వాచ్మెన్ కూతురనీ, తనది ఈ అపార్ట్మెంట్ కాదనీ..తను పాల్గొనడానికి అర్హత లేదని నిర్వహణ కమిటీ కి ఆరోపించాడు. ఈ అపార్ట్ మెంట్ లో జీవించే వారందరూ సమానమేనని…. ఒకరిపై వివక్ష తగదని…గణపతి నవరాత్రి కమిటీ కవితకి అవకాశాన్ని ఇచ్చింది. దీంతో ఈ పోటీలలో తీవ్ర ఉత్కంఠత పెరిగింది. తికమక కాయిన్స్ తో ప్రాక్టీస్ చేసిన కవిత కు ఈ పోటీలలోని మామూలు కాయిన్స్ తో ఆడడానికి తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వచ్చింది. వీటి తేడాలేంటో తనకు అర్థం కాక పిచ్చి పెట్టేది. తను తీవ్ర కృషి తో.. తనను తాను నిలబెట్టుకొని.. చాలా కష్టంగా ఫైనల్స్ వరికీ చేరింది.
…….. ఒకవేళ తను ఓడిపోతానేమోనని, దానిని తట్టుకోలేనని భయపడిన, “క్రిస్టఫర్” ఆమెను అడ్డు తొలగించుకోవడానికి ఒక
ఉపాయం పన్నాడు. కవిత అపార్ట్మెంట్లోలో పని ముగించుకుని వచ్చే సమయంలో…. అమ్మాయి చూస్తుండగానే………కావాలనే…. లిఫ్ట్ డోర్ ని కవిత కుడి చేతి వేళ్లపై బలంగా వేశాడు.దాంతో తన కుడి చేతి వేళ్ళు పూర్తిగా ఫ్యాక్చర్ అయినాయి. ఇది ఎలా జరిగింది ? ఎవరు చేశారు? అని‌ ఎవ్వరడిగినా తను క్రిస్టఫర్ పేరును బయట పెట్టలేదు. తప్పు తనపైనే వేసుకుంది.హాస్పిటల్ కి వెళ్లిన కవితకి డాక్టర్ మూడు నెలల రెస్ట్ చెప్పినాడు. తన పేరు బయటికి రాకపోవడంతో ఇక అడ్డులేని క్రిస్టఫర్… టైటిల్ తనదే నని… లోలోపల..
సంబరపడిపోయాడు. అకస్మాత్తుగా జరిగిన ఈ యాక్సిడెంట్… గణపతి నిర్వహణ కమిటీ కి తీవ్ర బాధను కలిగించింది…. వెంటనే ఆ కమిటీ సమావేశమై అందరి సూచన మేరకు ఫైనల్ గేమ్ ని మూడు నెలలపాటు వాయిదా వేశారు. దీనిని తన కొడుకు కు…. అవమానంగా భావించిన ప్రెసిడెంట్ అసలు సంగతి తెలుసుకోవడానికి సీసీ టీవీ ఫుటేజ్ ను చెక్ చేశాడు. క్రిస్టఫర్ చేసిన తప్పు కవిత చేతివేళ్ళు విరగొట్టడమే కాకుండా…
కాయిన్స్ ని దాచిపెట్టడం, కాయిన్స్ ని సీసం తో
నింపి మార్ఫింగ్ చేయడం, తను ప్రాక్టీస్ చేయడానకి అవకాశం ఇవ్వకపోవడం లాంటి నిజాలు చూసి బిత్తరపోయి, తల పట్టుకున్నాడు. వీడి ఈ స్వభావాన్ని ఎలా మార్చాలోనని, ఒత్తిడికి గురై, టెన్షన్ తో….. అప్పటికప్పుడు తన కొడుకు క్రిస్టఫర్ విషయాలు బయటికి రాకుండా సీసీటీవీ ఫుటేజ్ నుండి డేటాను డిలీట్ చేశాడు…. అప్పటికైతే తప్పించుకున్నాడు… కాని గేమ్ స్పిరిట్ లేకపోవడం…. ఈర్ష్య, అసూయ…. ఓర్వలేనితనం వలన తన కొడుకు చేసిన ఘోరమైన పనులు అతనిని ఎంతగానో బాధించాయి ….. పాపం కవితకు జరిగిన అన్యాయానికి ఆయన తల్లడిల్లి పోయాడు… తనే స్వయంగా వెళ్లి కవితను…. నీవు తన ఊరు అమ్మాయి వని తన బిడ్డ లాంటి దానివని….. తన ఆటను ప్రశంసించాడు. మరింతగా తన ఆటను పెంచుకోవాలని ప్రోత్సహించాడు…… వారి కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుని…… కవిత నేషనల్ గేమ్స్ లో కూడా సెలెక్ట్ అవుతుందనీ.. ఖర్చు తానే భరిస్తానని వారికి హామీ ఇచ్చాడు….. దీంతో
పట్టువదలని ఆ అమ్మాయి తన ఎడమ చేతితో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించింది. నెల రోజుల వ్యవధి లోనే చక్కటి ప్రతిభ కనబరిచ సాగింది.తనకు ఆట ఎడల ఉన్న ఇష్టం, పట్టుదల, కృషి తో అపార్ట్మెంట్ వాసుల అభిమానాన్ని, ప్రేమని పొందింది. తన రెండు చేతులతో క్యారం బోర్డ్ ఆడే సామర్థ్యంతో అపార్ట్మెంట్ పిల్లలందరికీ రోల్ మోడల్ అయింది. మూడు నెలల సమయం గడిచిపోయింది..ఫైనల్ గేమ్ మరో పది రోజులు ఉందనగానే… క్రిస్టఫర్ పాత సిమ్ కార్డులలోని మధ్యలో ఉండే పలుచని రాగిరేకు ను సేకరిస్తున్నాడు. వాటిని రెండు భాగాలుగా చేసి కొత్త బ్లేడ్ తో కాయిన్స్ చివరలను కట్ చేసి సన్నని చీలికలలో ఆ రేకును అమర్చి దానిని రిమోట్ తో అనుసంధానం చేసి, రిమోట్ ని షూస్ లో పెట్టి ట్యాంపరింగ్ చేస్తున్నాడు.. తను చేసే ఈ పనిని క్రిస్టఫర్ వాళ్ళనాన్న సైలెంట్ గా గమనిస్తూనే…. ఉన్నాడు. కొట్టడం, తిట్టడం, అరవడం, బెదిరించడం ….లాంటి పనుల తో పిల్లల మనసు లోని ఇలాంటి భావాలు తొలగిపోవని….. తల్లిదండ్రుల మాటలు, పనుల… వల్ల నే పిల్లలు హీరోలు గానీ-జీరోలు గాని అవుతారని తన అనుభవం తనకు నేర్పింది. …… అందుకే మనసులో జరిగే సున్నితమైన రియలైజేషన్ కోసం సరైన సమయం కోసం ఎదురు చూడ సాగాడు….. ఫైనల్ గేమ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుందని చెప్పారు. పోటాపోటీగా జరిగే విన్నింగ్ గేమ్ కి…. అపార్ట్మెంట్ మొత్తం దిగింది. అందరూ ఉదయం నుండేఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓకే స్టార్ట్ అన్నారు…………
బెస్ట్ ఆఫ్ త్రీ లో మొదటి గేమ్ క్రిస్టఫర్ గెలిచాడు… రెండవ గేమ్.. కవిత గెలిచింది. అందరూ కళ్ళార్పకుండా చూస్తున్నారు…. ఆ ప్రాంగణం అంతా ఉత్కంఠత….
…. ప్లేయర్స్ ఇద్దరూ ఒకరిని మించి ఒకరు పోరాడుతున్నారు. లాస్ట్ స్టెప్.. విన్నింగ్ షాట్…. క్రిస్టఫర్ తన షూస్ లోని రిమోట్ ని ప్రెస్ చేస్తూ…. అటెమ్ట్ చేశాడు… ..
అద్భుతంగా పనిచేసే రిమోట్ …..ఆ సమయంలో పని చేయలేదు… అతను షాక్ తిన్నాడు……. అతను అటెమ్ట్ చేసిన ఆ… షాట్ ..సక్సెస్ కాలేదు. ఇక నెక్స్ట్ స్ట్రైక్ కవిత ది…… మళ్లీ…..మళ్లీ.. క్రిస్టఫర్ తన కాలు తో షూస్ లోని రిమోట్ ని గట్టిగా ప్రెస్ చేస్తూ… పట్టుకుంటున్నాడు….. కానీ రిమోట్ కంట్రోల్ పనిచేయడం లేదనీ తనకు తెలుస్తోంది. . …కవిత ది విన్నింగ్ షాట్ …. తను… ఈసారి గేమ్….గెలిచి తీరుతుందనుకుంటున్నారందరూ …. అప్పటివరకు అద్భుతంగా ఆడిన కవిత చివరిగా ఎందుకో…… థర్డ్ ప్యాకెట్ కి కట్ చేసి… పక్కకు పుష్ చేసింది…….నెక్స్ట్ స్ట్రైక్ మళ్లీ క్రిస్టఫర్ ది. రిమోట్ పనిచేయడం లేదని తెలిసి…… దానిని పట్టించుకోకుండా తను అద్భుతమైన షాట్ ఆడాడు…. సక్సెస్…సక్సెస్ క్రిస్టఫర్ గెలిచాడు… అపార్ట్మెంట్ వాళ్ళందరూ క్రిస్టఫర్ ని చప్పట్లతో…. ముంచెత్తించారు…. సరైన సమయంలో…. కవిత ఎందుకలా చేసిందో అర్థం కాలేదు… గణపతి నవరాత్రుల క్యారం బోర్డ్ టైటిల్ మళ్లీ క్రిస్టఫర్ దే…….. కవిత ఓడిపోయింది….. . దీనంగా…తన విరిగి… తిరిగి అతికిన వేళ్లతో… చెమర్చిన కళ్ళతో.. సన్నని నవ్వుతో….. షేక్ హ్యాండ్ అందిస్తూ కంగ్రాట్యులేషన్స్… క్రిస్టఫర్ బాబు.. అని చెప్పింది… ఆ చేతుల స్పర్శ తన చూపులు….. తన మొహం… చూసి… క్రిస్టఫర్ కి ఒళ్ళు జలదరించింది. తెలియని నిర్వేదం……మొహం చూపలేక పోతున్నాడు… కవితకు ఎదురు గా నిలబడలేక, .. చేయకూడనిది ఎదో చేశాననే దుఃఖం తన్నుకుంటూ వస్తుంది…. తనకు తనకే…ఛీ… అనిపిస్తూంది… గెలిచిన ఆ గెలుపును కూడా ఆస్వాదించలేక పోతున్నాడు…. గేమ్ గెలిచినా తనలో సంతోషం లేదు….. తనలో ఏదో భయంకరమైన తప్పు చేశాననే ఫీలింగ్.. తనని తానే విసిరి కొట్టుకోవాలని కసిగా అనిపిస్తుంది… ఇదివరకైతే ఆట గెలిస్తే రొమ్ము విరుచుకుని.. నడిచేవాడు…. కానీ….
ఇప్పుడు…ఒణికిపోతున్నాడు… సైలెంట్ గా వెళ్లి ఒక మూలన కూర్చున్నాడు… కవిత విరిగిన చేతి వేళ్ళను పట్టుకున్న… ఆ స్పర్శ అతనిని విడిచి వెళ్లడం లేదు. ఈ సంఘటన అతనిని ఎంతో బాధించింది.అక్కడికి వచ్చిన వాళ్ళ నాన్న తన పక్కనే కూర్చున్నాడు….. మెల్లిగా…. ఆ షూస్ లోని బ్యాటరీస్ ని తీసింది నేనే నని చెప్పాడు…. అందువల్లే షూస్ లోని రిమోట్ కంట్రోలర్ పని చేయలేదని అన్నాడు…… ఆ అమ్మాయే నిన్ను గెలిపించిందన్నాడు…. అప్పటికే ఎంతో బాధ తో కుమిలిపోతున్న క్రిస్టోఫర్.. వెంటనే గట్టిగా వాళ్ల నాన్నను కౌగిలించుకొని సారీ …..నాన్న …గేమ్ స్పిరిట్ మిస్ అయ్యాను. పెద్ద తప్పు చేశానని బాధపడ్డాడు….. ఈసారి అలా ఎప్పుడూ జరగదని రియలైజ్ అయ్యాడు…. దీంతో వాళ్ళ నాన్న కుదుట పడ్డాడు…. ఇన్ని రోజుల అతని ఒత్తిడి మాయమైంది…… క్రిస్టోఫర్ కవితని తన తప్పును తెలుసుకున్నాననీ, క్షమించమని అడిగాడు……మీరు సారీ చెప్పొద్దు క్రిస్టోఫర్ బాబు….. ఈ ఆట లో నైపుణ్యం సంపాదించడానికి మీరే నాకు స్ఫూర్తి అని చెప్పింది …. క్రిస్టఫర్ వాళ్ల నాన్న గారి వైపు చూసి… నన్ను, నా కుటుంబాన్ని ఆదుకొన్న మీకోసం..
… మిమ్మల్ని, మీ బిడ్డను, మీ కుటుంబాన్ని… నేను ఎప్పుడూ ఓడిపోనివ్వను… అది కేవలం ఆట లో నైనా సరే…. అని చిరునవ్వుతో చెప్పింది.. మీలాంటి వారు ఉంటే, ఆడపిల్లలపై యాసిడ్ దాడులు, ఆఘాయిత్యాలు జరగవనీ కన్నీరు కార్చింది… ఇది చూసి క్రిస్టఫర్ పూర్తి గా మారిపోయాడు. … తరువాత నుంచి వీళ్లిద్దరూ మంచి స్నేహితులుగా….. నేషనల్ టీమ్ లో ఒకే జట్టుగా… ఒకే (తెలంగాణ) రాష్ట్రం నుండి …. అద్భుత ప్రదర్శనను ఇస్తున్నారు…. మళ్లీ జరిగే అద్భుతమైన ఫైనల్స్ కోసం అపార్ట్మెంట్ వాసులందరూ వెయిట్ చేస్తున్నారు ……..

✍️ ఎన్.హర్షవర్దన్ రాజు

3 thoughts on “క్యారం బోర్డ్ 1”

Comments are closed.