మరణానంతర జీవితం

మరణానంతర జీవితం
మరణానంతరం మరొక జీవితం ఉన్నదా? లేదా? ఉంటే ఏ రూపంలోఉంది? ఈ ప్రశ్న యదార్థంగా మన బుద్ధికందని విషయం. ఎందుకంటే మృత్యువు సరిహద్దుకు ఆవల ఏమయినా ఉందో లేదో చూడటానికి కావలసిన కళ్ళు మనకులేవు. అక్కడి ధ్వనిని వినగలగటానికి అవసరమయిన చెవులు కూడ మనకు లేవు. అటు ఏముందో పరిశోధించి తెలుసుకోవడానికి ఎట్టి పరికరాలు కూడా మన వద్ద లేవు. అంటే మరణానికి తదుపరి మరో జీవితం ఉందా లేదా అనే ప్రశ్న వైజ్ఞానిక శాస్త్ర పరిధిలోనికి రాదు.