By వడ్డెపల్లి మల్లేశం,సామాజిక విశ్లేషకులు
CORONA కల్లోలం తో బయట పడ్డ డొల్లతనం మూలంగా వైద్య రంగం అనాదిగా నిర్లక్ష్యానికి గురవుతూ పెట్టుబడిదారులకు ఈ అవకాశం కాసుల పంట గా రూపొందడానికి ప్రభుత్వాల నిర్లక్ష్యం ప్రభుత్వాలకు గుణపాఠం నేర్పని ప్రజా చైతన్య రాహిత్యం ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. అప్పుడప్పుడు ప్రభుత్వ వైద్యశాలలో ఏదైనా అపశృతి చోటు చేసుకున్నప్పుడు తాత్కాలికంగా కొంత మంది ప్రజలు ఆవేశాలకు గురై ఉద్యమాలు లేవ తీయడం, అధికారులు ,ప్రజా ప్రతినిధులు వచ్చి తగు చర్య తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ప్రజలు మరిచిపోవడం ప్రభుత్వాలు తన విధానాన్ని తిరిగి కొనసాగించడం షరా మామూలైపోయింది.
.
అలాంటప్పుడు ప్రజల చైతన్యం లేకుండా పోరాటాలు లేకుండా చట్టసభలలో వైద్య రంగం పై ఎలాంటి చర్చ లేకుండా ప్రభుత్వ రంగం గురించి మనము అతిగా ఆశించడం అత్యాశ కాక మరేమవుతుంది?
కరోనా నేపథ్యంలో రాజకీయ నాయకుల కోటీశ్వరుల అభిప్రాయాలు:-
ఓటు విషయంలో తప్ప ఇంకా ప్రజలందరూ ఏ విషయంలోనూ సమానం కాదు అనేది భారతదేశంలో ఇంతకాలం ఉన్నా ఒక వాస్తవం. చట్టం ముందు అందరూ సమానులే అని నానుడి ఉన్నప్పటికీ అది భారతదేశంలో అమలు కాలేదు. ప్రస్తుతము కరోనా విలయతాండవం చేస్తున్న వేళ తెలిసి వచ్చిన మరొక్క చెరగని సత్యం" రాజైనా
పేద అయినా రాజైనా CORONA ముందు సమానులే”.
ఈ నేపథ్యంలో ఇటీవల భారతదేశంలో ప్రముఖ రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు కోటీశ్వరులు మంత్రులు సినిమా నటులు CORONA బారిన పడి చికిత్స అనంతరం తిరిగి వచ్చిన తర్వాత రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. లతా సామాన్యులు కాదు కనుక వీళ్లు చెప్పే విషయాలు సామాన్య ప్రజానీకానికి ఏ రకంగానూ దోహద పడవు. కారణం ఏమిటంటే వీళ్లు చేరినది ప్రైవేటు వైద్యశాలలో… చాలా బాగా చూసుకున్నారని, మంచి ఆహారం అందించారని, మామూలుగా మనం ఇంట్లోనే ఉండి చికిత్స పొందడం ద్వారా కరోనాను సులువుగా జయించవచ్చు అని ప్రజలకు ధైర్యవచనాలు పలుకుతున్నారు. వీళ్ళు ప్రైవేటు వైద్యశాలలో ఎందుకు చేరినట్లు?ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందడం ద్వారా ప్రజలకు భరోసాను కల్పించవలసిన ది పోయి ప్రభుత్వ రంగం మీద సామాన్య ప్రజానీకానికి నమ్మకం లేకుండా చేసే వీరు చర్య ప్రభుత్వానికి ఎలా నచ్చుతుంది?.
WHO హెచ్చరికలు గాని, ICMR సూచనలు గాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరము చర్చించి ఉమ్మడిగా కార్యాచరణ చేయవలసింది పోయి ఎవరి విశ్వాసాల మీద వాళ్లు ప్రజల రోగాలను గాలికి వదిలి పెడితే రాష్ట్రంలో అవసరంలేని సచివాలయం కూల్చివేత పై ప్రజల దృష్టిని నాయకుల దృష్టికి మళ్లిస్తే ప్రభుత్వ వైద్యం విఫలం కాక ఏమవుతుంది?
ప్రభుత్వంలోనే వివిధ వర్గాల ప్రకటనలకు పొంతన లేకపోవడం సౌకర్యాలు లేకపోవడం వల్లనే ప్రైవేటు వైద్యశాలకు వెళుతున్నామని ప్రజలు ఆందోళన పడుతూ ఉంటే భరోసా ఇచ్చి ప్రజలకు ఖర్చు కాకుండా చూడాల్సింది పోయి పూర్తిగానే పట్టించుకోకపోవడం పట్ల ప్రజలు ఎవరికి వారే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కానీ ఆ ఆందోళన ప్రజాందోళన గా మారితేనే
ప్రభుత్వాలు కొంతైనా స్పందించే అవకాశం ఉన్నది .
CORONA నేపథ్యంలో ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయాలి:-
దాదాపుగా మూడు వేల డాక్టర్లు వేలాది మంది నర్సులు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పనిచేస్తున్న సిబ్బంది కూడా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ లో నియామకమై అరకొర వేతనాలతో తమ ఆరోగ్యాలను కూడా పక్కకు పెట్టి పని చేస్తూ ఇటీవల వేతనాల పెంపు కోసం ధర్నాలు చేయడం కూడా జరిగింది. ఆలీ ఉద్యోగాలను భర్తీ చేయడం తో పాటు ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి అనుభవజ్ఞులైన వైద్యులకూడా తాత్కాలికంగా నియామకం చేసుకుని ప్రభుత్వ రంగంలోని చికిత్స అందించినట్లయితే బాగుంటుంది. కానీ కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలకె
ప్రభుత్వాలు ఊడిగం చేస్తున్న పరిస్థితి నేడు దాపురించింది. ప్రైవేటు ఆస్పత్రిలో కోసం ప్రభుత్వ భూములను చౌకగా ఇవ్వడం కాకుండా వారి వ్యాపారం కోసం ప్రభుత్వ వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసే కుట్ర ప్రభుత్వాలు చేస్తుంటే ప్రభుత్వ దవాఖానాల్లో ఆక్సిజన్ లేక వెంటిలేటర్ లేక మందులు వివిధ సౌకర్యాలు లేక మరణించేవారికి ఎవరు దిక్కు? దాదాపుగా భారతదేశ వ్యాప్తంగా 40 వేల మంది చనిపోయినారు
అంటే పేద వర్గాలకు డబ్బులు లేకనే కదా.
ప్రభుత్వం ప్రజా వైద్యానికి సంబంధించి అన్ని వసతులను సమకూర్చుకొని అవసరమైతే ప్రైవేటు వ్యవస్థను మొత్తం ప్రభుత్వమే
ఆధీనం చేసుకొని ప్రజల ఆందోళనను తగ్గించే దిశగా విశ్వాసము కల్పించాలి.
ప్రజలకు వైద్యాన్ని ఉచితంగా అందించడం ప్రభుత్వాల యొక్క రాజ్యాంగబద్ధమైన, సామాజిక బాధ్యత కూడా. దేశవ్యాప్తంగా ప్రధాని రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రజల్లోకి వచ్చి సరైన హామీ ఇవ్వాలి.హోమ్ వారం టైంలో ఉన్నవారికి మెడికల్ కిడ్స్, కుటుంబ అవసరాలను సమకూర్చడం లేదు. ప్రాంతీయ వైద్యశాలలో పరీక్షలు నామమాత్రంగా చేస్తున్నప్పటికీ
కిట్స్ సరఫరా అంతంతమాత్రంగానే ఉండడంతో పరీక్షలు తగ్గి పోతున్నవి.ఈ విషయాలపై ప్రభుత్వము ఏనాడు ప్రకటన చేయలేదు. పట్టించుకోలేదు కూడా.
ఆరోగ్య శ్రీ లో చేర్చకుండా ప్రైవేటు ఆసుపత్రుల వారు ప్రభుత్వంపై ఒత్తిడి చేసిన నేపథ్యంలో ప్రభుత్వ రంగం పై నమ్మకం లేక ప్రైవేటు ఆస్పత్రిలో పోయినవాళ్లు అప్పులపాలు అవుతుంటే వైద్య శాఖ మంత్రి మాత్రం ప్రైవేటు వాళ్ళు ఎక్కువగా వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని ప్రకటనలతో
సరిపెడుతున్నారు.
ప్రభుత్వం వెంటనే వైద్యరంగ నిపుణులు పరిశోధకులు మేధావులు రాజకీయ పక్షాల వారు ప్రజాసంఘాల వారితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ప్రస్తుత అవునా చికిత్సతోపాటు భవిష్యత్తులో ప్రభుత్వ రంగం బలోపేతానికి చర్చించి బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించి ప్రజల విశ్వాసాన్ని కాపాడాలని కోరుతున్నారు. ఇదే అశ్రద్ధ కొనసాగితే ప్రభుత్వ వైద్య రంగం పై ప్రజలు ఉద్యమాలు చేయక తప్పదు విద్య వైద్యం ప్రజల యొక్క ప్రాథమిక హక్కు గనుక ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుంది.
ప్రైవేట్ ఉపాధ్యాయుల పాట్లు:-
కరోనా నేపథ్యంలో అనేక పాఠశాలలో పని చేస్తున్న ప్రైవేటు ఉపాధ్యాయులు విద్యాబోధన లేకపోవడంతో వేతనాలులేక
ఇతరత్రా ఉపాధి అవకాశాలు లేని వారు కడు దయనీయస్థితిలో దినదినగండంగా బ్రతుకులు ఈడుస్తున్నారు.
ఉన్నత విద్యార్హతలు కలిగిన అనేక మందికి ప్రభుత్వ రంగంలో ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు కల్పించకపోవడం వల్ల అటు ప్రభుత్వం ఇచ్చిన హామీ నిరుద్యోగ భృతి
చెల్లించకపోవడం వల్ల అటు ప్రైవేటు ఉపాధ్యాయులు ,నిరుద్యోగులు వీధిన పడ్డారు. ప్రైవేట్ ఉపాధ్యాయుల జీవన పోషణం కోసం కొంతమంది స్వచ్ఛంద కార్యకర్తలు సమాజం సహకారంతో బియ్యము నగదు సమకూర్చుకున్న సందర్భాలు రాష్ట్రంలో చాలానే ఉన్నవి.
కానీ ప్రభుత్వం మాత్రం ప్రైవేటు ఉపాధ్యాయులకు ఎలాంటి ప్యాకేజీ ప్రకటించక పోవడం బాధాకరం. వెంటనే ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుని రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న అర్హులైన పేద వాళ్ళందరికీ ప్యాకేజీ ప్రకటించి ఆదుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.
వాళ్లు కూడా సమాజం పిల్లలే కదా.2. 5 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అర్హులైన నిరుద్యోగులతో భర్తీ
చేయకుండా తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఆకాంక్షను దెబ్బతీయడం యువతను
వంచించడమే అవుతుంది. విద్యార్థులకు పాఠాలు నేర్పిన ప్రైవేట్ ఉపాధ్యాయులకు కరోనా నేర్పుతున్న ఈ కన్నీటి పాఠాలకు ప్రభుత్వం స్పందించి ఆదుకుంటుందని ఆశిద్దాం.
DISCLAIMER
The opinions expressed in this post are the
personal views of the author. They do not necessarily reflect the views of
Stars in telugu
Any omissions or errors are the author’s and Our site does not assume any liability or responsibility for them.