సైబర్ కవితకు బహుమతి పొందిన రమాదేవి కులకర్ణి

తెలంగాణ రాష్ట్ర పోలిస్ విమెన్ సేఫ్టీ వింగ్:


స్త్రీలు, బాలికలపైన జరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడానికి cybHER అనే విభాగాన్ని ప్రారంభించి గ్రామగ్రామాలల్లో అందరినీ జాగృతమొనరించడానికి వివిధ కార్యక్రమాలను చేపట్టింది. సింబియాసిస్ లా కాలేజి వారి సౌజన్యం తో అంతర్జాల నేరస్థుల ఆటకట్టించడానికి సైబ్ హర్ ని ఎలా వినియోగించాలి తెలియజేసే కార్యక్రమాలను చేపట్టి అందులో భాగంగా డ్రాయింగ్ కవిత్వం పోటీలను నిర్వహించారు. ఈ కవిత పోటీలలో ఉప్పల్ కు చెందిన రచయిత్రి, మోటివేషనల్ స్పీకర్, స్పార్క్ పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి రమాదేవి కులకర్ణి గారు విజేతగా నిలిచారు.


CybHER ప్రచార కార్యక్రమం వీడ్కోలు సమావేశం వెబినార్ కు ఆహ్వానం అందుకున్నారు.
డీజీపీ తెలంగాణ శ్రీ మహేందర్ రెడ్డి ఐపీఎస్ గారూ, అడిషనల్ డిజిపి విమెన్ సేఫ్టీ శ్రీమతి స్వాతి లాఖ్రా గారు, డి ఐ జి విమెన్ సేఫ్టీ శ్రీమతి సుమతి ఐ పి ఎస్ గారు cybHER యొక్క ప్రాముఖ్యతను వివరించి, తాము ప్రతి మహిళకు అండగా ఉంటామని అన్నారు. CybHER కిట్ విడుదల చేశారు.
ఆ సందర్బంగా కవిత్వం లో విజేత అయిన రమాదేవి కులకర్ణి గారికి మిగతా వారికి అభినందనలు తెలిపారు. జాతీయ చిహ్నం కలిగిన కప్ ని బహుమతిగా అందజేశారు.


ఇంతకు ముందు విమెన్ సేఫ్టీ వింగ్ నిర్వహించిన హితైషి అనే కవితా సంకలనం లో కూడా తనకు చోటు తభించిందని అక్షర యాన్ తరఫున తాను పాల్గొన్నానని, విమెన్ సేఫ్టీ వింగ్ పోలీస్ కి కృతజ్ఞతలు తెలిపారు, తాను ఇందులో భాగస్వామ్యం అయినందుకు గర్వాంగా ఉందని రమాదేవి కులకర్ణి గారు అన్నారు.