వ్యాపారవేత్తలుగా ఎదగాలనుకునే మహిళల కోసం దేనా శక్తి స్కీమ్.

వ్యాపారవేత్తలుగా ఎదగాలనుకునే మహిళల కోసం దేనా శక్తి స్కీమ్.

క్రియేటివ్‌గా.. ఏదైనా చేయాలనుకుంటున్నారా..? మంచి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకుంటున్నారా..? అయితే మీలాంటి మహిళలకు ప్రభుత్వం చేయూతనిస్తుంది. తక్కువ వడ్డీతోనే లక్షల్లో రుణాలు అందిస్తోంది. ఎన్నో పథకాలు పెట్టి మహిళల్లో ఉన్న శక్తి, యుక్తులను బయటకు తీసే ప్రయత్నం చేస్తోంది.

కాలం మారింది.. పరిస్థితులు మారాయి. ఈరోజుల్లో ఇంట్లో మగవాళ్లు, ఆడవాళ్లు ఇద్దరూ పనిచేయాల్సిన అవసరం ఏర్పడింది..! పిల్లలు, చదువు, వైద్యం ఖర్చులు పెరగడంతో అందరూ సంపాదించాల్సిన ఆవశ్యకత వచ్చింది. దీంతో ఆడవాళ్లు ఇంట్లో పనితో పాటు బయట ఉద్యోగాలు చేస్తున్నారు. కొంతమంది మహిళలు కొంచెం క్రియేటివ్‌గా ఆలోచించి ఏదైనా వ్యాపారం చేసి అన్నిరకాలుగా స్థిరపడాలనుకుంటున్నారు. అలాంటి వాళ్లకు ప్రభుత్వం ఎన్నో పథకాలు అందిస్తుంది.

అలాంటి పథకమే దేనా శక్తి పథకం. వ్యవసాయం, చిన్న వ్యాపారాలు, కిరాణా షాప్‌లు పెట్టుకుని వ్యాపారవేత్తలుగా ఎదగాలనుకునే మహిళలకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం కింద రూ.20 లక్షల రూపాయల వరకు రుణం వస్తుంది. అంతేకాదు మార్కెట్​లో ఉన్న వడ్డీ కంటే 0.25 శాతం తక్కువగా ఉంటుంది. అంతేకాదు మైక్రో క్రెడిట్ కేటగిరీ కింద రూ. 50,000 వరకు రుణాలు ఇస్తారు. మీకు దగ్గర్లో ఉన్న దేనా బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుని అప్లై చేసుకోవచ్చు.

దేశంలో చాలామంది మహిళలు టాలెంట్ ఉన్నా డబ్బులు లేక ఆగిపోతారు. ముందుకు వెళ్లేందుకు ఎవరూ ఆర్థిక సాయం చేసేందుకు సిద్ధపడరు. అలాంటి వారు ఆత్మవిశ్వాసం ముందుకు అడుగేసేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది. మహిళలు ఏ రంగంలోనైనా రాణిస్తేనే వారికి గుర్తింపు, గౌరవం దక్కుతాయి. దేశం కూడా ప్రగతిపథంలో నడుస్తోంది. దానికోసం ప్రభుత్వం ఇలాంటి పథకాలను పెడుతుంది.

అయినా ఇలాంటి పథకాలు గురించి చాలామందికి తెలియదు. తెలిస్తే.. చాలామంది మహిళల జీవితంలో మార్పు వస్తుంది. ముందడుగు వేసి తామేంటో ప్రూవ్ చేసుకుంటారు. అలాంటి వాళ్లకు ఇలాంటి వివరాలు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వివరాలను వీలైనంత ఎక్కువగా షేర్ చేద్దాం.