Dr.B.V.S.Prasad కోవిడ్ 19 కి సంబంధించి ఒక చిన్న అనుభవం

Dr.B.V.S.Prasad

కోవిడ్ 19 కి సంబంధించి … ఒక చిన్న అనుభవం … మీతో పంచుకుంటున్నాను.
దయచేసి పాజిటివ్ గా తీసుకోమని నా మనవి ……
ఆ మధ్య నా చిన్న నాటి స్నేహితులలో ఒకరు ఫోన్ చేసారు. తను గవర్నమెంట్ లో డివిజన్ స్థాయి ఆఫీసర్. ఫోన్ సారాంశం ఏమిటంటే….. తన సబార్డినేట్స్ లో ఫీల్డ్ విజిట్ కి వెళ్ళి వచ్చిన తరువాత ఒకతనికి కోవిడ్ లక్షణాలు కనిపిస్తే టెస్ట్ పాజిటివ్ వచ్చింది … దానితో మిగిలిన వారికి టెస్ట్ చేయిస్తే అందరికీ పాజిటివ్ వచ్చింది … నన్ను కూడా టెస్ట్ చేయించుకోమంటున్నారు … ఒకవేళ పాజిటివ్ వస్తే అందరూ వెలి వేస్తారు … అలా కాకుండా నన్నేం చేయమంటారు’. ఇదీ ఫోన్ సారాంశం.
ICMR గైడ్ లైన్స్ ప్రకారం primary contact కాబట్టి టెస్ట్ చేయించుకోవడం తప్పనిసరి. PCR టెస్ట్ కోసం ముక్కు లో మరియు గొంతులో స్వాబ్ తీసుకొంటారు కాబట్టి అప్పటికి తనకి ఒకటిన్నర రోజు టైం ఉంది కాబట్టి నేను ఒక పధ్ధతి సజెస్ట్ చేసాను.అదే … Hypertonic saline nasal wash and mouth gargling. అంటే ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో రెండు మూడు చెంచాల ఉప్పును కలిపి ఒక నేతి పాట్ ( ఉగ్గిన్నె లాగా పెద్దదిగా ఉంటుంది) లో పోసి ఒక ముక్కు పైకి ఒక ముక్కు కిందకి వచ్చేవిధంగా మెడను ముందుకు వంచి, పై ముక్కు లోనికి ఆ నీటిని జాగ్రత్త గా వంపిన … ఆ నీరు కింది ముక్కు లో నుంచి సింక్ లోకి వెళ్ళి పోతుంది.అలా మూడు నాలుగు సార్లు చేసి, అదే విధంగా రెండో ముక్కు పైకి వచ్చే టట్లు చేసి పైన చెప్పిన విధంగా రిపీట్ చేసి … తర్వాత అదే నీటితో నోట్లో పోసుకుని బాగా పుక్కిలించి ఊసెయ్యాలి.
ఇదే పద్ధతి ని రోజుకు కనీసం మూడు సార్లు చేయమని చెప్పాను. తను అలాగే చేసానన్నాడు. రిజల్ట్ వచ్చిన రోజు … నెగటివ్ వచ్చిందని సంతోషంగా చెప్పాడు.నా జీవితాన్ని నిలబెట్టావన్నాడు. ఇంకా ఏదేదో సంతోషంగా చెప్పాడు. ఒకే వెరీగుడ్ అండ్ కంగ్రాట్స్ అని చెప్పాను.

Dr.B.V.S.Prasad
ఇక్కడ నాకు ఒక విషయం భాధగా అనిపించింది.కోవిడ్ పాజిటివ్ అని తెలియగానే … అతడ్ని తీసుకెళ్ళడానికి అంబులెన్స్ రావటం … అందులోనించి PPE కిట్స్ వేసుకొని హెల్త్ వర్కర్స్ దిగటం … ఆ పాజిటివ్ వ్యక్తి కి వాటిని తొడిగి … చుట్టుపక్కల వారికి మరియు ఇంట్లో వారిని హోమ్ క్వారంటైన్ చేయడం … ఆ వీధి లో రాకపోకలు నిషేధించటం … దానితో ఆ ఇంట్లో వారితో మాటలు సంగతి సరేసరి వారి వైపు చూస్తేనే కరోనా వస్తుందేమో అన్న భయం … పాల వాడు రాడు … న్యూస్ పేపర్ వాడు రాడు … అంటే పరిస్థితి ఎంత వరకు వచ్చిందంటే … ఆ కుటుంబాన్ని అనధికారికంగా వెలి వేసినట్లు ఫీలింగ్.
ఈ సంధర్భం లో నేను చెప్పేదేమిటంటే … గవర్నమెంట్ మన కోసం ఎంతో కష్టపడుతోంది. పోలీసులు కానీ, గవర్నమెంట్ డాక్టర్ లు కానీ, ఎఎన్ఎమ్ లు కానీ,ఆశా వర్కర్స్ కానీ, మున్సిపాలిటీ వాళ్ళు కానీ, ఎలక్ట్రికల్ డిపార్టుమెంటు వారు కానీ, జర్నలిస్ట్ మిత్రులు కానీ,రాజకీయ నాయకులు కానీ … మనల్ని కాపాడటానికి వారి ప్రాణాలకు తెగించి కరోనా ని పారద్రోలటానికి పోరాడుతున్నారు.కాబట్టి వ్యక్తి గతంగా మన వంతు కృషి మనం చేయాలి.మాస్క్ వేసుకోవాలి. చేతులు సానిటైజర్ తో శుభ్రం చేసుకుంటుండాలి. భౌతిక దూరం ఖచ్చితంగా పాటించాలి.
పైన చెప్పినట్లు గా టెస్ట్ రిపోర్ట్ నెగటివ్ గా రావడానికి మాత్రమే కాకుండా ఆ ప్రొసీజర్ ను రొటీన్ గా ఇంట్లో అందరూ చేస్తే కరోనా వైరస్ మనకు రాకుండా ఉంటుంది … వచ్చినా కూడా ఎదుటి వారికి అంటుకోకుండా ఉంటుంది.
కొన్ని అధ్యయనాల్లో (ELVIS … ఎడిన్బర్గ్ స్టడీ )కూడా ఇది నిరూపితమయ్యింది.ముఖ్యంగా ముక్కులో…. గొంతులో వైరల్ లోడ్ ని తగ్గిస్తుంది. తద్వారా కోవిడ్ కాంప్లికేషన్స్ తగ్గుతాయి. ఆస్పత్రిలో ఉండే సమయం కూడా తగ్గిపోతుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్ కరోనా పాజిటివ్ ని వారి కుటుంబ సభ్యులను అంటరానివారిగా చూడవద్దు … రేపు మనకు కూడా రాదని గ్యారంటీ లేదు.
చివరగా ఒక్క మాట …
కోవిడ్ పాజిటివ్ తో చనిపోయిన శవాలతో కరోనా వైరస్ వ్యాపించదు … జీవం లేకపోతే వైరస్ కూడా చనిపోతుంది.
(Source : British Medical Journal updated version on 6/7/2020). మనం శపథం చేద్దాం …
మనతో పాటు మన సమాజాన్ని కాపాడుకుందాం.
అందరికీ నమస్కారాలతో …

Dr.B.V.S.Prasad

ప్రముఖ చెవి.ముక్కు. గొంతు. వైద్య నిపుణులు.