విద్యార్థినులకు రూ.1,86,000 స్కాలర్‌షిప్.. కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ | DRDO scholarship | in Telugu

DRDO scholarship

టాలెంట్ ఉండి ఫీజు కట్టడం కష్టంగా ఉన్న అమ్మాయిలకు డీఆర్‌డీవో గుడ్ న్యూస్ అందించింది. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది బాగా చదువుకునే అమ్మాయిలకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వనుంది. ఇప్పటికే డిఫెన్స్ రీసెర్స్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ స్కాలర్ షిప్‌లను ప్రకటించింది.


ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, స్పేస్ ఇంజనీరింగ్, రాకెట్రీ, ఏవియానిక్స్, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీరింగ్ విభాగాల్లో చదువుతున్న అమ్మాయిలు ఈ స్కాలర్‌షిప్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. 30 మంది విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్స్ అందిస్తోంది.

స్కాలర్ షిప్ కోసం డీఆర్‌డీవోకు చెందిన రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్-RAC వెబ్‌సైట్ rac.gov.in/లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ 2020 జూలై 19న ప్రారంభం అయింది. దరఖాస్తు చేయడానికి సెప్టెంబర్ 30 లాస్ట్ డేట్. మన దేశానికి చెందిన అమ్మాయిలు మాత్రమే ఈ స్కాలర్‌షిప్స్‌కు అప్లై చేసుకోవాలి. ఎంపికైన అమ్మాయిలకు ఏటా రూ.1,86,000 వరకు స్కాలర్‌షిప్ లభిస్తుంది.

అలాగే డీఆర్‌డీవో బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అమ్మాయిలకు 20 స్కాలర్‌షిప్పులు కేటాయించింది. JEE (Main) స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ ఇంజనీరింగ్ ఫస్టియర్ చదువుతున్న అమ్మాయిలకు 10 స్కాలర్ షిప్పులు కేటాయించింది. గ్రాడ్యుయేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో పాటు గేట్ స్కోర్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైనవారికి వార్షిక కాలేజీ ఫీజు లేదా రూ.1,86,000 వరకు స్కాలర్‌షిప్ రూపంలో డీఆర్‌డీవో అందిస్తుంది. బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ విద్యార్థినులు ఏటా రూ.1,20,000 వరకు నాలుగేళ్లు, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ ఇంజనీరింగ్ విద్యార్థినులు ఏటా రూ.1,86,000 వరకు రెండేళ్లు స్కాలర్‌షిప్ పొందే ఛాన్స్ ఉంది.

అయితే స్కాలర్‌షిప్ కోసం ఎంపికైనవాళ్లు డీఆర్‌డీవో, ప్రభుత్వ ల్యాబరేటరీస్ లేదా AR&DB నిధులతో నడుస్తున్న సంస్థల్లో ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సి ఉంటుంది. స్కాలర్‌షిప్‌కు అర్హత సాధించిన విద్యార్థినులు అన్ని పరీక్షల్లో పాస్ అవ్వాలి. అదే విధంగా విద్యార్థులు 2020-21 విద్యా సంవత్సరంలో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో అడ్మిషన్ పొంది ఉండాలి.

Sl.NoTopicWebsite
1పూర్తి నోటిఫికేషన్ డౌన్ లోడ్ చేయుటకు Click Here
2ఆన్లైన్ లో అప్లై చేయడానికిClick Here
3అధికారిక వెబ్ సైట్Click Here