Good bye TIK TOK Good bye

good bye TIK TOK good bye


*** *** **
ఎక్కడో ఓ మారు మూల గ్రామం…
తన ఇంట్లోనే టైలరింగ్ చేసుకునే ఓ యువకుడు….
సరదాగా టిక్ టాక్ లో అప్లోడ్ చేసిన అతని విడియోకి లక్షల్లో లైకులూ.. ఫాలోవర్స్..ఉన్నపళంగా సెలబ్రిటీగా మారిపోయాడు.
ఇద్దరు పిల్లల తల్లి..గృహిణి…
సరదాగా ఓ పాటకు అనుగుణంగా అభినయిస్తే…వారం తిరిగేసరికి tik tok సెలబ్రిటీ హోదా…
బ్రతుకు తెరువు కోసం భార్యాభర్తలిద్దరూ పగలంతా కష్టపడుతుంటారు. . .ఖాళీగా వున్నప్పుడు సరదాగా తీసిన తమ ఇద్దరి వీడియో జనం పదేపదే చూసేలా చేసింది.సెలబ్రిటీ జంటగా హోదా…పెళ్లిలోనూ..ఫంక్షన్లోనూ వారు కనిపిస్తే ..సెల్ఫీలు..వారి చుట్టూ జనం…ఆనందం…

హీరోల పొలికలతో ఉన్న యువకులు…అందంగా ఉన్న యువతులు….గృహిణులు…..మరుగుజ్జు ఆకారం ఉన్నవారు…. మాటకారులు… నృత్యకారులు… రకరకాల కళల్లో ప్రవేశం ఉన్నవారు…టీవీల్లో…సినిమాల్లోకి కనీసం అడుగు పెట్టటానికి కూడా అనుమతించబడని వారు…స్టార్స్ గా మారి తామే ఇంటర్వ్యూ లు ఇచ్చే స్థాయికి ఎదిగారు.కొద్దిమందికి సినిమాల్లో అవకాశాలు కూడా వచ్చాయి.
అందం ..అభినయం ఉండి కూడా టీవీల్లో ..సినిమాల్లో అవకాశాలు రానివారు…ఎందరో టిక్ టాక్ లో తమ కలలను సాకారం చేసుకుంటున్నారు.
ఎందరి కలలనో నిజం చేసింది ఈ “tik tok“….


ఎప్పుడైనా ఒకరోజు దినపత్రికలో తన ఫోటో వస్తే వంద రోజుల పాటు వేయి మందికి చూపించే జనం…ఈ రోజు మొబైల్లోనే తమ వీడియోని చూపిస్తున్నారు అనే కంటే ఇతరులు తమ దగ్గరికి వచ్చి మీ ఫలానా వీడియో చాలా బాగుందండి.
“మీరు అందంగా కనిపించారు.
మీ నటన బాగుంది.
మీ డాన్స్ బాగుంది.
మీ జోక్ బాగుంది.
టీవీల్లో ట్రై చేయండి.
సినిమాల్లోకి వెళ్ళండి.
మీరు మా చెల్లిలా వున్నారు.
మీరే మా అన్నయ్య.
మిమ్మల్ని అక్క అని పిలవచ్చా..
మిమ్మల్ని వదిన అని పిలుస్తాను”
ఇవన్నీ వారికొచ్చే సందేశాలు.
ఒక వైపు పేరు ప్రతిష్టలు తెచ్చే ఈ టిక్ టాక్ చాలా మంది చని పోయేలా చేసింది.టిక్ టాక్ చేస్తూ వరదల్లో కొట్టుకు పోయాడు ఒక యువకుడు.తనకు వచ్చిన అసభ్య కామెంట్స్ సూసైడ్ దాకా వెళ్లిందో యువతి.కొన్ని వీడియోలు చాలా రోతగా ఉండేవి.ఇవన్నీ కూడా చాలా తక్కువ. ఏది ఎలాగున్నా టిక్ టాక్ మాత్రం మరచి పోలేని మధురమైన అనుభూతిని మిగిల్చింది కోట్ల మంది హృదయాలలో.

ఈ రోజు నుంచి టిక్ టాక్ దూరమవుతున్నందుకు ఒకింత బాధ కలిగినా..దేశం కోసం వదిలి వేయాల్సిందే.దేశ క్షేమమే ప్రధమం…దేశం కోసం ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న మనం టిక్ టాక్ ని వదలుకోలేమా..
సంతోషంగా వదలుకుంటాం…
జై హింద్
“గుడ్ బై టిక్ టాక్ గుడ్ బై”
@ షేరు