కరోనా నేపథ్యంలో ప్రపంచం మొత్తం స్తంభించిపోయిన తరుణంలో విద్యకు సంబంధించి ప్రభుత్వాలు ప్రైవేట్ సంస్థలు అన్నీ కూడా ప్రత్యామ్నాయాల కోసం మార్గాలను అన్వేషిస్తున్నాయి.
ఇటువంటి సందర్భంలో ఆన్లైన్ పాఠాలను ప్రైవేటు విద్యా సంస్థలు విద్యార్థులకు అందుబాటులో తీసుకు వస్తున్నాయి.

అయితే ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు కూడా తమ విద్యార్థులకు పాఠాలను ఆన్లైన్లో అందించాలన్న సదుద్దేశంతో సిద్ధపడుతున్నారు.
ఈ దారిలోనే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్ద అడిషర్ల పల్లి, నల్లగొండ జిల్లా లో గణిత ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న గంజి అమరేందర్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆన్లైన్ లో బోధించేటప్పుడు క్లాసులు రికార్డ్ చేయడానికి అనువుగా అందరూ ఉపయోగించే ట్రైపాడ్ కి బదులు ఒక పరికరాన్ని తయారు చేశారు.
దీనివల్ల ఉపాధ్యాయుల నల్లబల్లపై రాస్తూ బోధిస్తున్నప్పుడు విద్యార్థులు పొందే అనుభూతి ని యధావిధిగా వారు online class లో విద్యార్థులు కూడా పొందేందుకు అనుకూలం గా ఈ పరికరాన్ని తయారు చేశారు.
ఈ క్రింది వీడియోలో అమరేందర్ గారు తయారు చేసినటువంటి పరికరాన్ని మనం గమనించవచ్చు.
తమ పాఠశాలా ఉపాధ్యాయుడు వినూత్నంగా తయారు చేసిన ఈ పరికరంపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు తన మిత్రబృందం అయినటువంటి ఉపాధ్యాయులు ప్రశంసించి అభినందించారని అమరేందర్ గారు తెలియజేశారు.
అతి తక్కువ ఖర్చుతో ఒక ట్రాన్స్పరెంట్ స్లైడ్ మరియు కొన్ని చెక్క ముక్కల సహాయంతోనే తను ఈ పరికరాన్ని తయారు చేసినట్లు తెలిపారు.
ఈ మధ్య కాలంలో తను ప్రభుత్వ ఉపాధ్యాయులకు వేదగణితంలో శిక్షణ లో ఈ పరికరం సహాయంతో శిక్షణ ను ఇంకా ప్రభావవంతంగా నిర్వహించానని తెలిపారు.
జిల్లా విద్యాశాఖ అధికారి గారు మరియు కొందరు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా ప్రత్యక్షంగా మరియూ ఫోన్లో అభినందనలు తెలిపారు.
అదేవిధంగా ఈ ఉపాధ్యాయ శిక్షణను కొత్త పరికరంతో దిగ్విజయంగా నడిపినందుకు తెలంగాణ గణిత ఫోరం రాష్ట్ర,నల్లగొండజిల్లా నాయకులు కూడా ప్రశంసించారనీ.
విద్యార్ధులకు కూడా ఈ పరికరం సహాయంతో తరగతులు ప్రారంభించారని,విద్యార్ధుల నుండి చక్కని స్పందనను కనబరుస్తున్నారని తెలియజేశారు.
ఆ పరికరం గురించి ఆ సార్ మాటల్లోనే విందాం…👇