కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోండిలా..

దిగువ మధ్యతరగతి కుటుంబాలకు రేషన్ కార్డు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఆధార్ వచ్చినా కూడా రేషన్ కార్డుకు సెపరేట్ ఐడెంటిటీ ఉంది. సబ్సీడీ ధరకు రేషన్ సరుకులను పొందటమే కాదు, పలు రకాల ప్రభుత్వ కార్యక్రమాలకు రేషన్ కార్డు సంజీవనిగా మారింది. అయితే రేషన్ కార్డు కొత్తది తీసుకోవాలన్నా, భార్య లేదా పిల్లల పేర్లను పొందుపరచాలన్నా ఇప్పుడు మీ సేవలో కొన్ని సింపుల్ స్టెప్ట్స్ ఫాలో అయితే సరిపోతుంది. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఈ కింది పత్రాలు ఉంటే సరిపోతుంది.

అడ్రస్ ప్రూప్ : ప్రస్తుతం ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ ఇంటి అడ్రస్ కు సంబంధించి ఏదైనా ధృవీకరణ పత్రం
ఐడెంటిటీ కార్డు : కుటుంబ యజమాని గుర్తింపు కార్డు.. ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు.. వీటిలో ఏదో ఒకటి

మీకు దగ్గర్లోని మీ సేవా కేంద్రాల్లో ఆన్ లైన్ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. పైన పేర్కొన్న డాక్యుమెంట్లతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయించాల్సి ఉంటుంది. మీ సేవాలో రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక దరఖాస్తుదారులకు నెంబర్ కేటాయిస్తారు. మీ సేవా కేంద్రం వారిచ్చే దరఖాస్తు ఫారంతో పాటు కావాల్సిన జిరాక్స్ పత్రాలను అటాచ్ చేసి ఎమ్మార్వో ఆఫీసులో సమర్పించాలి. అనంతరం ఎమ్మార్వో కార్యాలయం వారు పరిశీలించి నిబంధనలకు లోబడి రేషన్ కార్డులు జారీ చేస్తారు. గతంలో జారీ చేసిన కార్డుల్లో తప్పులుంటే సరిదిద్ధుకోవడానికి కూడా అవకాశముంది. అలాగే పాత కార్డుల్లో కొత్తగా కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేయించుకునే వెసులుబాటు కూడా ఉంది.