జాతీయ జెండా ఎగిరేయడానికి నియమాలు తెల్సుకోవడం అత్యవసరం…

జాతీయ జెండా ఆవిష్కరణకు నియమాలెన్నో..
జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..
లేకుంటే కఠిన చర్యలు తప్పవు
జిల్లాలో పంద్రాగస్టు ఏర్పాట్లు షురూ..

స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అందరూ సిద్ధమవుతున్నారు. అధికార యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. దీంతో ఎక్కడ చూసినా సందడి వాతావరణం నెలకొంది. అంతా పంద్రాగస్టు పనుల్లోనే నిగమ్నమై ఉన్నారు. అయితే ఏటా స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల్లో ఎక్కడో ఓ చోట అపశ్రుతులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో స్వాతంత్య్ర దినోత్సవం రోజున త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

జాతీయ జెండా ఆవిష్కరణ సమయంలో నియమాలు తెలియకపోవడంతో ఏటా ఎక్కడో చోట కొన్ని లోటుపాట్లు జరుగుతున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2002లో కేంద్ర ప్రభుత్వం ఓ గెజిట్‌లోని ముఖ్యమైన విషయాలు తెలిపింది. దీనిప్రకారం జెండా కోడ్‌ ఆఫ్‌ ఇండియా సెక్షన్‌ వీ రూల్‌ ప్రకారం స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల్లో జెండాలో పూలు కట్టి ఎగురవేయవచ్చు. భారత ప్రమాణాల సమితి (బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌) మూడు దశల్లో జారీ చేసిన పత్రాలకు అనుగుణంగా జెండా తయారీ, ప్రదర్శనలను నిర్దేశించే చక్రాలను భారత పతాక నిబంధనలుగా పేర్కొంటారు. 1950 జాతీయ చిహ్నాలు, పేర్లు, నిబంధనల చట్టం, 1971 జాతీయ గౌరవ అవమానాలు నిరోధించే చట్టం కలిసి 2002లో భారత పతాక నిబంధనలుగా అవతరించాయి.

జెండా ఆవిష్కరణ… నిబంధనలు :


 • జాతీయ పతాకం 3 రంగులు సమాన వెడల్పు గల పట్టీల్లో ఉండాలి. పై పట్టి కాషాయం (కేసరి) వర్ణం, మధ్యలో తెలుపు, దిగువన ముదురు ఆకు పచ్చ పట్టీలతో ఉండాలి.
 • జెండా పరిమాణం అంటే పొడవు, వెడల్పుల నిష్పత్తి 3:2గా ఉండాలి.
 • 24 స్ర్టోక్స్‌ గల నావికా నీలం రంగు గల అశోక చక్రం తెలుపు పట్టీ మధ్యలో ఉండాలి.
 • భారత జాతీయ పతాకాన్ని ఖాదీ, చేనేత వస్ర్తాలతో మాత్రమే తయారు చేయాలి. ముడి పదార్థాలుగా నూలు, పత్తి, ఉన్ని వాడొచ్చు.
 • ఇతర వాటితో తయారు చేస్తే జరిమానాతోపాటు మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
 • జెండా ఎగురవేసినప్పుడు కాషాయ వర్ణం పైకి వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
 • జాతీయ జెండాను వేదికలు, భవనాల కప్పు, పిట్టగోడలపై నుంచి వేలాడదీయరాదు.
 • ఏదైనా సమావేశ స్థానంలో జెండా ప్రదర్శించాలనుకుంటే ప్రసంగకర్తకు కుడివైపుగా జెండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
 • జాతీయ జెండాకు సమానంగా గానీ, ఇంకా ఎత్తులో గానీ ఏ ఇతర జెండా ఎగురకూడదు. ఒక వేళ వివిధ రకాల జెండాల పక్కన ఎగుర వేయాల్సి వస్తే.. జాతీయ జెండా మిగతా వాటికంటే ఎత్తుగా ఉండాలి.
 • జాతీయ జెండా ఊరేగింపులో గానీ, కవాతులో గానీ ఇతర జెండాలతో కలసి తీసుకువెళ్లేటప్పుడు వాటికి ముందు, మధ్యలో గానీ, కుడి వైపున గానీ ఉండేలా చూసుకోవాలి.
 • ఏదైనా ఒక ప్రతిమ, జ్ఞాపకం, ఫలకానికి విశేషాలంకారంగానే తప్ప జెండాను ఏ వస్తువుకూ తొడుగుగా వాడరాదు. ఏ వ్యక్తికీ చుట్టరాదు.
 • జెండా ఎగురవేత, దించే సమయంలో వ్యక్తులందరూ జెండాకు అభిముఖంగా నిలబడాలి.
 • జెండా ఎగురవేయడం, దించడం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు చేయాలి.
 • ప్లాస్టిక్‌ జెండాలు అసలు వాడరాదు.
 • పై నుంచి కిందకు 3 రంగులు సమానంగా ఉండాలి.
 • జెండాను నేలమీదగానీ, నీటి మీద గానీ పడనీయకూడదు.
 • జెండాపై ఎలాంటి రాతలు, సంతకాలు, ప్రింటింగ్‌లు ఉండరాదు.
 • జెండా ఎప్పుడూ నిటారుగా ఉండాలి. కిందికి వంచకూడదు.
 • జెండాను వడిగా(వేగంగా) ఎగురవేయాలి.
 • జెండా మధ్యలోని ధర్మచక్రంలో 24 ఆకులుండాలి.
 • జెండా పాతపడితే తుడిచే గుడ్డగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించరాదు. అది నేరం. దానిని కాల్చివేయాలి. ఎక్కడంటే అక్కడ పడ వేయరాదు.
 • జెండాను ఎగుర వేసినప్పుడు జాతీయ నాయకుల ఫొటోలు ఉంచాలి.
 • జెండాను ముందుగా 1, 2 సార్లు పరిశీలించుకోవాలి. ఎక్కించి దించడం, మరలా ఎక్కించడం చేయరాదు.
 • భారత భావి పౌరులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు జెండా వందనాన్ని నియమ నిబద్ధతతో, నియమాలతో చేయాలి.
 • జెండా పోల్‌ నిటారుగా ఉండాలి. వంకరగా ఉండరాదు.
 • విద్యార్థుల జేబులకు ఉంచే చిన్న జెండాలు ఎక్కడంటే అక్కడ పడ వేయకూడదు. వాటిని తొక్కరాదు. వాటిని ఒక చోట భద్రపరచాలి.
 • వీలైనంత వరకు పురితాళ్లతో కట్టి చెట్లకు, వరండాలకు త్రివర్ణ పతాకాలను (చిన్నవి) అతికించరాదు. రంగు రంగుల కాగితాలు మాత్రమే అతికించాలి. రడీమేడ్‌ ప్లాస్టిక్‌ త్రివర్ణ పతాకాలు వాడరాదు.

డిజైన్‌ వెనుక చరిత్ర…కారణాలు… :


అశోకచక్రం అశోకుడి కాలం నాటిది. చక్ర అనేది సంస్కృత పదం. స్వయంగా తిరుగుతూ, కాలచక్రంలా తన చలనాన్ని పూర్తి చేసి మళ్లీ తన గమనాన్ని ప్రారంభించేదని దీనికి ఇంకో అర్థం కూడా ఉంది. గుర్రం కచ్చితత్వానికి ఎద్దు కృషికి చిహ్నాలు. అశోక్‌ చక్రవర్తి (క్రీ.పూ.273-232) పరిపాలనా కాలంలో తన రాజధాని సారనాథ్‌ లోని అశోక స్తంభం ముందు చక్రం ఉపయోగించాడు. నవీన కాలంలో ఈ అశోకచక్రం జాతీయ పతాకంలో
చోటుచేసుకుంది. దీనిని 1947 జూలై 22న పొందుపరిచారు. ఈ అశోకచక్రం తెల్లని బ్యాక్‌ గ్రౌండ్‌లో నీలి ఊదా రంగులో ఉంటుంది. ప్రఖ్యాత సాండ్‌ స్టోన్‌ (ఇసుకరాయి)లో చెక్కిన నాలుగు సింహాల చిహ్నం సారనాథ్‌ సంగ్రహాలయంలో ఉంది. ఇది అశోక స్తంభం పై భాగాన ఉంటుంది. దీని నిర్మాణ క్రీ.పూ. 250లో జరిగింది. భారత ప్రభుత్వం, దీనిని అధికారిక చిహ్నంగా గుర్తించింది.

ఈ చక్రంలో 24 భావాలు :


ప్రేమ ధైర్యం సహనం శాంతి కరుణ మంచి విశ్వాసం మృదు స్వభావం సంయమనం త్యాగనిరతి ఆత్మార్పణ నిజాయితీ సచ్ఛీలత న్యాయం దయ హుందాతనం ఫవినమ్రత దయ జాలి దివ్యజ్ఞానం ఈశ్వరజ్ఞానం దైవనీతి(దివ్యనీతి) దైవభీతి(దైవభక్తి) దైవంపై ఆశ/నమ్మకం/ విశ్వాసం. ఈ ఇరవై నాలుగు ఆకులు (స్ర్టోక్స్‌) 24 గంటలూ భారత ప్రగతిని సూచిస్తాయి.

2002 లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గెజిట్ లోని ముఖ్యమైన విషయాలు ఇలా ఉన్నవి.

జెండా ఎగురవేయడంలో నియమాలు తెలిసో తెలియకో కొన్ని లోటుపాట్లు జరుగుతున్నవి.కాగా రాజ్యాంగా స్పూర్తికి విరుద్ధంగా కొన్ని కార్యక్రమాలు చేయటం కూడా జరుగుచున్నది.

Flag code of India సెక్షన్ V రూల్ ప్రకారం రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే సంధర్భంగా జెండాలో పూలుఫెట్టి ఎగుర వేయవచ్చు

జెండా ఎవరు ఎగుర వేయాలనేది ఒక సమస్య

 • విధాన నిర్ణాయక సంస్థలు,(బాధ్యులు ప్రధాని,ముఖ్యమంత్రి, ZP చైర్మెన్,గ్రామ సర్పంచు మొదలగు వారు).
 • కార్యనినిర్వహణ సంస్థలు.(రాష్ట్రపతి, గవర్నర్ కలెక్టర్ MDO, MEO.MRO హెడ్ మాష్టర్ ప్రిన్సిపాల్) అనేవి ఈ విధంగా రెండు రకాలు. మనం కార్యనిర్వహణ సంస్థల క్రిందకు వస్తాము. కార్యనిర్వహుకులం.
 • పాఠశాలలు, కాలేజీలు కార్యనిర్వహణ సంస్థలు. కావున పాఠశాల్లో 15 ఆగష్టు, 26 జనవరిలనందు ప్రధానోపాధ్యాయులే
 • జాతీయ జెండాను ఎగుర వేయాలి.

ఇక్కడ క్లిక్ చేయండి