IPL 2020 ముహూర్తం కుదిరింది

IPL 2020 ముహూర్తం కుదిరింది

 

క్రికెట్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న IPL 2020 ముహూర్తం కుదిరింది.
యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుండి ఐపీఎల్ 20 20 టోర్నమెంట్ మొదలు కాబోతుంది.

కరోనా టైంలో ఐపీఎల్ షెడ్యూల్ ఎలా ఉండబోతుంది ?

ఐపీఎల్ నెలన్నర పాటు జరిగే ఈ టోర్నమెంట్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయంలో కరోనా కారణంగా వాయిదా పడింది. అసలు ఐపీఎల్ జరుగుతుందా? లేదా? అని ఊహాగానలకు స్టాండింగ్ కమిటీ పుల్ స్టాప్ పెట్టింది.
సెప్టెంబర్ 19 నుండి ప్రారంభమై నవంబర్ 8న జరిగే ఫైనల్ తో ముగియనుంది.

యూఏఈలో షార్జా, దుబాయ్ నివేదికల్లో మ్యాచ్లు నిర్వహించబోతున్న ట్లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ తెలిపారు.

ఇదిలా ఉండగా భారత ప్రభుత్వం నుంచి అనుమతి ఇంకా లభించలేదు. ఐపీఎల్ టోర్నీ నిర్వహణను యు ఏ ఈ లో జరపడానికి భారత ప్రభుత్వం నుండి అనుమతి త్వరలోనే వస్తుందని ఐపీఎల్ నిర్వాహకులు స్పష్టం చేశారు.

వచ్చేవారం నిర్వహించే గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామన్నారు.

ముందుగా అనుకున్నట్లు మ్యాచులు నిర్వహించడం జరుగుతుంది. మ్యాచ్లు కుదించడం వంటివి జరుగవు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సెప్టెంబర్ 22 నవంబర్ 20 వరకు అంటే 44 రోజులు 60 మ్యాచ్ షెడ్యూల్ ఉండబోతుంది.

ఇదంతా ఇలా ఉండగా ఆ సమయంలో ఐపీఎల్ స్టేడియం లో చూడ చూసేందుకు ప్రేక్షకులు అనుమతిస్తారా? లేదా? ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తారా ? ఎటువంటి నిబంధనలు అమలు పరుస్తారు అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది…

ఏదేమైనా క్రికెట్ ప్రియులకు మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్….