జనాభాదే రాజ్య మైతే ప్రగతి పూజ్యం


భారత దేశం లో ప్రతి పదేళ్లకు ఒకసారి

గణన జరుగుతుంది. స్వాతంత్రం వచ్చిన తరువాత
ఆరు సార్లు జనాభా ను లెక్కించారు. సంక్షేమ పథకాల రూపకల్పనకు,రిజర్వేషన్లు మొదలైన
అంశాలలో జనాభా లెక్కలు కీలక పాత్ర వహిస్తాయి
పెరుగుతున్న జనాభా అభివృద్ధి చెందుతున్న
దేశాల అభివృద్ధికి అడ్డుగోడ గా నిలుస్తుంది.
ప్రపంచ జనాభా 1987జూలై 11నాటికి 500 కోట్లు
దాటిందని ఐక్య రాజ్య సమితి ఆధ్య యనం లో
వెల్లడి కావటం తో,1989నుండి జూలై 11 న
ప్రపంచ జనాభా దినోత్సవం గా పాటిస్తున్నారు.
ప్రపంచ జనాభా 1830 లో వంద కోట్లు.
అది1930 నాటికి 200కోట్లకు చేరింది.2020
నాటికి 780 కోట్లు కు,2050 నాటికి 890 కోట్లకు
చేరుకోవచ్చ ని అంచనా.2010_2019మధ్య భారత్ జనాభా ప్రతి ఏటా 1.2శాతం పెరుగుతూ
నేడు 136కోట్లకు చేరింది.ప్రస్తుత చైనా జనాభా
142 కోట్లు.గత 15 సంవత్సరాలు గా ఏటా
భారత దేశం లో కోటి ఎనభై లక్షల జనాభా పెరుగు
తుంది.1951 సంవత్సరం లొ ‌37కోట్లకు దగ్గర గా
ఉన్న జనాభా ప్రస్తుతం 136 కోట్లు దాటింది. ప్రపంచ జనాభా లో చైనా అగ్రస్థానం లో వుంటే
భారత్ ద్వితీయ స్థానం లో ఉంది. ఐక్య రాజ్య సమితి ప్రపంచ జనాభా నివేదిక(2019) ప్రకారం
దేశ జనాభా 2027 నాటికి చైనా ను మించిపోతుంద ని మొదటి స్థానానికి చేరు
తుంది.దక్షిణాది రాష్ట్రాల లో కన్న ఉత్తరాది
రాష్ట్రాలలో జనాభా అధికంగా ఉంది. బాగా
పెరుగుతుంది.
బాల్య వివాహాలు,పుత్ర సంతానం పట్ల
వ్యామోహం, నిరక్షరాస్యత, అంధ విశ్వాసాలు,
పిల్లలను ఆర్థిక వనరు గా భావించటం, మతం మొదలైన కారణాల వల్ల భారత్ లో జనాభా
పుట్టగొడుగుల్లా పెరిగి పోతుంది.వీటికి తోడు
శాస్త్ర,సాంకేతిక రంగాలలో అభివృద్ధి, వైద్య సేవలు
సౌకర్యాల ప్రగతి తో మరణాల రేటు తగ్గడం
జరిగింది.
అధిక జనాభా వల్ల కలిగే అనర్థాలను దృష్టి లో
పెట్టుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాలను చేపట్టాయి.గత 50 సంవత్సరాల
గా కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను జనాభా
నియంత్రణకు అమలు చేస్తుంది కాని ఆశించిన ఫలితాలు రావడం లేదు.అధిక జనాభా తో
అభివృద్ధి కుంటుపడుతుంది.ప్రపంచ విస్తీర్ణం లో
భారత్ 2.4శాతం వుంది.ప్రజలు17.85శాతం
ఉన్నారు.దేశ విస్తీర్ణ త పెరగదు.జన సాంద్రత మాత్రం బాగా పెరుగుతుంది. ఆహార ధాన్యాల
ఉత్పత్తి జనాభా తో పోలిస్తే తక్కువ వు తుంది.దాంతో ఆహార సమస్య ఎదురవుతుంది.
వ్యవసాయ రంగం దాని అనుబంధ రంగాలపై
జీవించే గ్రామీణ జనాభా 1951లో33 కోట్లు
ఉంటే,ప్రస్తుతం అది 80కోట్లకు చేరింది. దీనితో
గ్రామీణ ప్రాంతాలలో తలసరి వార్షిక ఆదాయం
నగరవాసుల తో పోలిస్తే ఏడో వంతుగా ఉంటుంది.
అధిక జనాభా వల్ల అన్నివిధాల నష్టాలు
, ఆర్థికంగా కష్టాలు తప్పవు ఆహార సమస్య,
పేదరికం,ఉపాధి లేకపోవడం, నిరక్షరాస్యత,
పర్యావరణ కాలుష్యము, ఆర్థిక పరమైన
సమస్యలు వెంటాడి వేధిస్తాయి.పాలకులకు
తలనొప్పిగా మారతాయి.
పాలకులలో చిత్తశుద్ది ఉంటే ఎటువంటి
సమస్యనైనా పరిష్కరించ వచ్చు.జనాభా ను
నియంత్రించాలంటే చైనా ను అనుసరిస్తే తప్ప
సత్ఫలితాలు రావు.భారత్ వంటి దేశాల లో
అది ఎంత వరకు సాధ్యమో ఆలోచించాలి.
ప్రజా స్వామ్య దేశం లో రాజకీయ రాబందులు
స్వార్థం తో ఓట్ల కోసం అడ్డదారులు తొక్కడం,ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలు చెయ్యడం,దూరదృష్టి లేకుండా పదవి దృష్టి తో
పనిచెయ్యడం వల్ల చైనా ను అనుసరించ లేరు.అన్ని వర్గాల వారిని బుజ్జగించడం, బుట్టలో
వేసుకోడం,నొట్ల తో ఓట్ల ను కొనడం , మత మౌఢ్యం నుండి బయటపడ క పోవటం ఆచరణలో
చూస్తున్నాం..పాలకులు తెలుసుకోకుంటే
ప్రగతి బండి ముందుకు పోదు.పేదరికం పెరిగి పోతే, నిరుద్యోగం ఎక్కువైతే,
కాలుష్యం అధికమైతే ,మానవాళి మనుగడ
కుడితి లో పడ్డ ఎలుక చందం లా ఉంటుంది.
నేడు కరోనా వైరస్ తో రోగులకు పడకలు లేక,వెంటిలేటర్ లు చాలక పడుతున్న ఇబ్బందులను గమనిస్తే అధిక జనాభా వల్ల
ఎటువంటి ముప్పు పొంచి ఉందో అర్థం చేసుకోవచ్చు.
జనాభా నియంత్రణ టీ చైనా నే ఎందుకు
ఆదర్శం గా తీసుకోవాలంటే దానికి కారణం లేక పోలేదు.1992 వరకు చైనా తలసరి ఆదాయాన్ని
చూస్తే మనకన్నా తక్కువుగా వుండేది. కాని అది
జనాభా విషయం లొ తీసుకున్న శ్రద్ధ వల్ల నేడు
అమెరికా కే సవాల్ విసిరే స్థాయి కి ఎదిగింది.
జనాభా నియంత్రణ లో కఠిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల విజేత గా నిలిచింది.ఒక్క బిడ్డే ముద్దు అపై వద్దు నినాదానికి ఊపిరి పోసింది.
రెండవ బిడ్డ ను కంటే కఠిన మైన అంక్షలను
విధించింది శిక్షలను వేసింది ఫలితంగా త్వరిత గతిన ఉన్నతస్థాయికి చేరుకుంది.ప్రగతి బాట పట్టింది. ప్రపంచం లోనే సంపన్న దేశాలలో
రెండో స్థానాన్ని పొందింది.మంచి ఎక్కడున్నా
స్వీకరించడం లో.తప్పు లేదు. ఇజాలను పక్కన
పెట్టీ నిజాలను గ్రహించాలి. భేషా జా లకు పోకూడదు.దేశం లో నేతలకు అదిలేదు.చిత్తశుద్ది
లేకపోవడం తో సమస్య తీవ్రరూపం దాల్చింది.
” చెట్టు కి కాయ బరువాతల్లికి బిడ్డ బరువా ” నారు పోసిన వాడు నీరు పొయ్యడా!.అంటూ
మెట్ట వేదాంతం చెప్పు తూ జనాభా ను అధికం
చేస్తున్నారు. మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన అనే
సామెత ను మరచిపోయారు.


అధిక జనాభా వల్ల కలిగే ముప్పు ని
పాలకులు గమనించాలి.జనాభా ను నియంత్రించడం కష్టమేమీ కాదు.ధృడ సంకల్పం తో పాటు, పట్టు దల తో ముందుకెళితే సత్ఫలితాలు
ఉంటాయి.బాల్య వివాహాలను అరికట్టడం,స్త్రీ ల వివాహ వయసు పెంచడం,అక్రమ వలసలకు
అడ్డుకట్ట వెయ్యడం, కుటుంబ నియంత్రణ కార్యక్రమాలలో.మార్పులు చెయ్యడం ,అధిక సంతానం ఉన్నవారిపై అంక్షలు విధించడం,శిక్షలు వెయ్యడం చేస్తే సానుకూల
ఫలితాలు రాకుండ ఎలా ఉంటాయి?
చైనా సాధించిన విజయాలను చూసైనా కళ్ళు
తెరవాలి.ప్రతి ఒక్కరు ఆరోగ్యం జీవించా లం టె
తినడానికి తిండి,కట్టుకోడానికి గుడ్డ,ఉండటానికీ
ఇల్లు,ఉపాధి వుండాలి.ఉన్నవాళ్ళ కే దిక్కు లేదు
కొత్తగా పుట్టే వారి పరిస్థితీ ఏమిటన్నది పాలకులు
ఆలోచించాలి.గతం నుండి గుణ పాఠాలు నేర్చు కోవాలి ముందు చూపు తో రాబోయే ముప్పు
ను తెలుసుకొని ముందుకెళ్లాలి.ముందు గా
మేలుకో కుంటే ఏకు మే కై యా క ఏమి చెయ్యలేని
స్థితి. అధిక జనాభా ను అరికట్టడం లో పాలకులకు
ప్రజలు సహకరించాలి.ఆ దిశగా వెళ్లాలని ఆశిద్దాం.
__ఆచార్య గిడ్డి వెంకట రమణఇక్కడ క్లిక్ చేయండి