జలగండం jalagandam

Jalagandam

N. Harsha

“శ్రీలత” వాళ్ళ నాన్న, పెదన్నాన్న,తాతలు గజ ఈత గాళ్ళు. వీరు గోదావరి నదిపై లాంచీలు, పడవలు, నడిపేవారు. ఇదే వీరి అసలైన జీవన వృత్తి . వీరి ప్రత్యేకత ఏంటంటే !! గోదావరి నదిలో జరిగే పడవ,లాంచీ ప్రమాదాలలో చిక్కుకున్న వాళ్లను కాపాడటంలో వీరి కుటుంబం వాళ్ళు సిద్దహస్తులు . ఇలా జల ప్రమాదాలలో చిక్కుకున్న ఎందరి ప్రాణాలనో కాపాడి, చివరికి పడవ ప్రమాదాలలోనే వీరూ మరణించారు.ఇలా ఇతరులను కాపాడబోయి వారి ప్రాణాలనే పోగొట్టుకున్న వారి తాత,నాన్న లను ప్రత్యక్షంగా చూసిన శ్రీలతను కొంత కాలంగా ఒక లాంటి భయం వెంటాడుతుంది . గోదావరి జిల్లాలోనే పుట్టి, నీళ్లలోనే, నీళ్ళ తోనే పెరిగిన ఈమె కు…. వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు చూడడానికి వచ్చిన వారందరూ….ఈ కుటుంబానికి జలగండం ఉందనీ, అందరూ ఇలా చని పోవడమే ననీ,వాళ్ళ నానమ్మ తో సహా, అందరూ గుసగుసలాడుకునే సరికి… అప్పటినుండి ఆమె కు నీళ్లంటే భయం పట్టుకుంది. ఇది రోజు రోజుకూ …ఒక ఫోబియాలా మారింది. ఆమె నీరున్న ఏ ప్రాంతానికి వెళ్లాలన్న గజగజ ఒణుకుతుంది. కనీసం పంటకాలువ కూడా దాటలేక పోతుంది.ఆమె లోని ఈ భయాన్ని పోగొట్టాలానీ చాలా హాస్పిటల్స్ లో ఆమె ను చూపించారు. అందరి డాక్టర్లదీ ఒకే మాట…. ఆమెకు సబ్ కాన్షియస్ లో భయం పెరిగిందనీ,నీళ్లు ఉండే విహార ప్రదేశాలలో ఆమె సరదాగా గడిపేలా, తిరిగేలా చేయడం వలన, ఆమె తన మనసులోని భయం నుండి బయట పడుతుందని చెప్పారు. దీంతో ఆమె కు ఎంతో నచ్చచెప్పి ఆమెను తిరిగి బోటు,పడవ ఎక్కించాలని, రాజమండ్రి నుండి భద్రాచలానికి లాంచీలో వెళ్ళడానికి టికెట్లను బుక్ చేశారు శ్రీలత భర్త వేణుగోపాల్. ఇతనొక ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్. వీరికి ఒక పాప ఒక బాబు ఉన్నారు. బాబు “సుమంత్” ఇంజనీరింగ్ చదువుతుండగా, పాప “ప్రవళిక” 9వ తరగతి చదువుతుంది. పిల్లలకు గోదావరి నది పై , బోటు ప్రయాణాన్ని,పోలవరం ప్రాజెక్టు వ్యూ ని, పాపికొండల సుందర దృశ్యాలను చూపిస్తూ, అలాగే డాక్టర్లు చెప్పినట్లు గా వాళ్ళ అమ్మ శ్రీలత లోని నీళ్ళ భయాన్ని పోగొట్టాలనేదే…. ఈ సారి వాళ్ల నాన్న 2ఇన్ 1 టూర్ ప్లాన్.వీరు అనుకున్నట్టుగానే ఉదయం 7గం.30ని!! కల్లా రాజమండ్రి లాంచ్ స్టేషన్ కు చేరుకున్నారు. లాంచ్ పై స్టేర్ లోని ఓపెన్ డెక్ లో వారి సీట్లలో కూర్చున్నారు. లాంచ్ బయల్దేరడానికి ఇంకా అర్ధగంట సమయం ఉంది. బోటు పై నుండి గోదావరి నది వ్యూ చూడడానికి చాలా బాగుంది. అది చూసిన పిల్లలు కేరింతలు కొడుతూ జాలిగా ఉన్నారు. అన్ని నీళ్లను, పెద్ద నదిని, ఎత్తు నుండి చూసేసరికి ఒక్కసారిగా వేణుగోపాల్ భార్య శ్రీలత కళ్ళు తిరుగుతున్నాయని చెప్తూ కూలబడిపోయింది. వెంటనే లాంచీ స్టేషన్ లోని ఫస్ట్ ఎయిడ్ కౌంటర్ లోనికి తీసుకెళ్ళారు.తెరుకున్న ఆమె నీను లాంచీ ప్రయాణం చేయలేనని రోడ్డు ద్వారానే భద్రాచలం వస్తానని చెప్పింది. చిన్నపిల్లలా మాట్లాడుతున్న ఈమెను చూసి అందరూ నవ్వుకొన్నారు.అయినాసరే ఆమె బోటు ప్రయాణం చేయనని పట్టుబట్టింది. వారి కుటుంబం మొత్తం బ్రతిమలాడీనా “నాకునీళ్ళు ను చూడగానే చాల భయమేస్తుందనీ, నాకు జలగండం ఉందనీ , మాతాతా,మా నాన్న కూడా నాటు పడవ ప్రయాణీకులను కాపాడబోయి, ఈ నది లోనే మునిగిపోయి చనిపోయారని… ఇప్పుడైతే నేను రానంటే రానని భీష్మించుకొని కూర్చుంది .కానీ చాల రోజులనుండి ఈ ట్రిప్ కోసం ఎదురుచూస్తున్న పిల్లలు బోటులో షికారు చేయడానికినికి చాలా హుషారుగా ఉన్నారు. టికెట్లు కూడా బుక్ చేసి ఉండడం తో చేసేది లేక భార్య,భర్త కార్లో భద్రాచలం బయలుదేరగా, పిల్లలిద్దరూ లాంచీలో వస్తామన్నారు. సాయంత్రం 5గం!! కు భద్రాచలం లాంచీస్టేషన్, లో మమ్మల్ని పికప్ చేసుకోండని పిల్లలు తన అమ్మా నాన్నలను బ్రతిమలాడసాగారు.ఆ లాంచీ ఓనర్, ఈ రోజు మా ఫ్యామిలి కూడా ఇదే లాంచీ లో టూర్ కి వెళ్తన్నామనీ… మీము జాగ్రతగా చూసుకుంటామని చెప్పడంతో ……….శ్రీలతావేణుగోపాల్ కారులో గోదావరినది పక్కనే ఉన్న రోడ్డు మార్గంలో భద్రాచలానికి బయలుదేరగా, పిల్లలు హ్యాపీగా లాంచీ లో వెళ్తూ ……వాళ్ళ అమ్మానాన్నలకు బాయ్ చెప్పారు…..

stars in telugu

వేణుగోపాల్ కు, కొడుకు సుమంత్ లాంచీ నుండి మధ్య మధ్యలో ఫోన్ చేస్తూనే ఉన్నాడు. లాంచ్ ఓనర్ చాలా మూడీ ఫెలో అని, మేమైతే చాలా జాలిగా ఉన్నామని, పోలవరం ప్రాజెక్ట్ వ్యూ చాలా బాగుందని చెప్తూ మధ్యాహ్నం “కొల్లూరు బాంబూ హట్స్” లో లంచ్ చేస్తామని, తర్వాత పెరంటాలపల్లి చేరుకొంటామని, కొద్దిసేపట్లో పాపికొండల వ్యూ పాయింట్ కి చేరుకోబోతున్నామని చెప్పాడు….. వాళ్ళ అమ్మ శ్రీలత పిల్లలతో మాట్లాడుతూ ……………రాజమండ్రిలో గోదావరి నది వెడల్పు 6కి.మీ ఉంటే పాపికొండల వద్ద కిలోమీటర్ లో సగం మాత్రమే ఉంటుందని,అది కూడా బాగామలుపు తిరిగి ఉంటుందని , అక్కడే సుడిగుండలు ఎక్కువగా తిరుగుతాయని, అక్కడ నది చాలా లోతుగా ఉంటుందని ఈ దార్లు మొత్తం మా తాత,నాన్న లతో కలిసి నేనూ తిరిగానని, జల ప్రమాదాలు జరిగినప్పుడు వారు చేసిన సాహాసాలను, వారు తప్పించుకొన్న దారులను గురించి చెప్పసాగింది. ఇప్పుడైతే మీ నాన్న,నేను మీకు దగ్గరలోనే టేకూరు” త్రిలింగేశ్వరస్వామి గుడి” లోనే ఉన్నామనీ, మీరు సెల్ ఫోన్ లో తీసిన వీడియోలని మాకు పంపాలని చెప్పింది. ఫోన్ పెట్టేసిన కొంతసేపటికి లాంచీ పాపికొండల ప్రాంతానికి చేరుకుంది. మూలమలుపులోని నది ప్రవాహం అప్పటికప్పుడే ఒక్కసారిగా పెరగడంతో ఆ ప్రాంతానికి చేరుకొన్న లాంచీ క్రూయిస్ ఇంజన్ ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో ఒకవైపు వెళ్లాల్సిన లాంచీ మరో వైపు గా వెళ్తూ….. గుండ్రంగా తిరగటం మొదలుపెట్టింది. గుండ్రంగా తిరుగుతున్న లాంచీ లోనికి ఒక వైపు క్రింది నుంచి నీళ్ళు కుప్పలు,తెప్పలు గా లోపలికి రాసాగాయి.ఈ నీళ్ళు ఎలా వచ్చాయో!! ఆ లాంచీ కెప్టెన్ కి అర్థం కాలేదు. దీంతో లాంచీ బరువు ఒక్కసారిగా భారీ గా పెరిగింది.ఒక వైపు నుండి నీళ్ళు రావడంతో జనం ఒకపక్క నుండి పరోపక్కకు మూకుమ్మడిగా వచ్చారు.దీంతో లాంచీ ఒకవైపు బరువు ఎక్కువై మరోపక్కకు పూర్తిగా ఒరిగింది.అందరూ హా..హా.. కారాలతో మొత్తుకొంటూ,లైఫ్ జాకెట్ల కోసం కొట్టుకోవడం మొదలుపెట్టారు… దీంతో తొక్కిసలాట మొదలైంది. ప్రమాద సంకేతాలు పెరగడం తో పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేశారు. విషయం తెలుసుకున్న వెంటనే వాళ్ళ అమ్మ ఫోన్ ను, వాళ్ల నాన్న దగ్గరి నుంచి గబుక్కున గుంజుకొని మాట్లాడుతూ…. భయపడవద్దని ….లైఫ్ జాకెట్లు వేసుకొన్నారా? అని అడిగింది. పిల్లలు అవును వేసుకునే ఉన్నామని చెప్పారు. ఒకే, ఒకవేళ ప్రమాదం జరిగితే ….వెంటనే లాంచీ ఎటు ఒరుగుతుందో దానికి వ్యతిరేకదిశలో కి నదిలోకి దూకాలని దైర్యంగా ఉండమని చెప్పి, మేము రెస్క్యూ టీం కూడా ఫోన్ చేశామని.. మీము కూడా మీకు ఎదురుగా వస్తామని ధైర్యం చెప్పింది.ఇంతలోనే లాంచీ లో తొక్కిసలాట పెరిగినందున లాంచీ అదుపుతప్పి బోర్లా పడి నదీ ప్రవాహంలో కొట్టుకుపోతూ… మునిగి పోసాగింది.అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామానికి అన్నా,చెల్లెళ్లు విడివిడిగా సుమంత్ , ప్రవళిక వాళ్ళమ్మ చెప్పినట్లుగానే నీళ్ళలోకి దూకారు. అప్పటివరకూ మాట్లాడుతున్న ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడంతో ప్రమాదం జరిగిందని గ్రహించిన శ్రీలత,వేణుగోపాల్ టేకూరు గుడిమెట్లు గబగబా దిగి గోదావరి నది ఒడ్డుకు చెరుకున్నారు.అక్కడి నుండి ప్రమాదం జరిగిన ప్రదేశం దాదాపుగా 6 కి.మీ. ఉంటుంది. అక్కడ ఒక స్టీమర్ రడీ గా ఉంది. కానీ అందులో డ్రైవరు లేడు.ఒక వైపు పిల్లల ప్రాణాలు, మరో వైపు తనకు నీళ్లంటే చచ్చేంత భయం. అన్నీ తెలిసి ఏం చేయలేక శ్రీలత నరకం అనుభవించ సాగింది. అక్కడ స్టీమర్ నడపడానికి కూడా ఎవరూ లేరు…తను తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని భావించి…..ఎలాగో తన భయాన్ని విదిలించుకోవాలని, తన పిల్లలే తన లోకమని, వారు లేకపోతే నేను బతకలేనని…. ఎలాగైనా పిల్లలను కాపాడుకోవాలని మనసులో గట్టిగా నిర్ణయించుకుంది. గుండె ధైర్యం తెచ్చుకొని ఆ స్టీమర్ తాడును విప్పి ఇంజన్ స్టార్ట్ చేసింది. పాపికొండల వైపుగా, ప్రమాదం జరిగే ప్రదేశం దిశగా వేగంగా, నేర్పు గా స్టీమర్ ని పోనిచ్చింది.శ్రీలత ను చూసిన తన భర్త వేణుగోపాల్, ఒక్కసారిగా బిత్తర పోయాడు. వేగంగా ఉరికే గోదావరి వరద నీటి ప్రవాహం లో జనం కుప్పలు.. కుప్పలుగా.. కొట్టుకొనిపోతున్నారు.కొందరు లాంచీ కిందే ఇరుక్కొని నీళ్ళలో మునిగిపోయారు. మరికొందరు నీటి సుడిగుండాలలో చిక్కుకున్నారు . కరెక్ట్ గా అదే సమయంలో శ్రీలత,వేణుగోపాల్ స్టీమర్ అక్కడికి చేరుకోవడంతో… వారు తాళ్లను విసిరి అక్కడికి కొట్టుకు వస్తున్న 20,30 మందిని కాపాడారు. కానీ తన పిల్లల జాడ తెలియక పోవడంతో వారిలో కంగారు,భయం మొదలైంది . రక్షించబడిన ఈ 20,30 మందిలో లాంచీ కెప్టెన్ కూడా ఉన్నాడు. అతను చాలా భయపడుతూ….ఆఫ్ అయిన లాంచీ ఇంజన్ ను మళ్ళీ స్టార్ట్ చేశానని…కానీ లాంచీ లోనికి కింది నుంచి నీళ్ళు ఎలా వచ్చాయో అర్థంకావట్లేదని పదే పదే చెప్తున్నాడు. లేదంటే అసలు ప్రమాదమే జరిగేది కాదని వాదిస్తున్నాడు. శ్రీలత తన ఇద్దరి పిల్లల కోసం నదివాలుగా ఏడుస్తూ.. తన పిల్లలను పేర్లతో పిలుస్తూ గాలించ సాగింది.

ఇక్కడ ప్రమాదం జరిగిన సందర్బాలలో…. ఒక్కోసారి పాపికొండల అడవుల ఒడ్డుకు కొందరు కొట్టుకు వస్తారని తెలిసిన శ్రీలత అటువైపుగా స్టీమర్ని తిప్పి పాపికొండల అడవుల దగ్గర స్టీమర్ ని నిలిపింది. అక్కడి నుండి అడవిలోనికి కాలినడకన నడుచుకుంటూ లోపలికి వెళ్లసాగారు….. అక్కడ ఎవరివో ఒక జత తడిబట్టలు దూరంగా చెట్ల మీదికి ఎవరికీ కనపడకుండా విసిరేసి వెళ్ళినట్లుగా కనబడుతున్నాయి. అతను తడి బట్టలు ఇక్కడ విసిరేసి వెళ్ళాడంటే అతనికి ఇక్కడే పొడిబట్టలు దొరికాయని అర్థం. అనుకోకుండా ప్రమాదం జరిగినప్పుడు ఇతనికి ఇక్కడకి పొడిబట్టలు ఎలావచ్చాయో!! వారికి అర్థం కాలేదు. మరింతగా చెట్లలో వెతకగా తమ ఇద్దరు పిల్లలు విగతజీవుల వలె అక్కడే పడి ఉన్నారు.వారిని చూసిన వారి తల్లిదండ్రులు ఒక్కసారిగా నిశ్చేష్టులై.. రోదిస్తూ… చేతులలోనికి పిల్లలను తీసుకొని గుడెలవీసేలా ఏడ్వటం మొదలు పెట్టారు. అనుకున్నట్టు గానే జలగండం మింగేసిందని శ్రీలత భావిస్తూ ఏడవసాగింది… కానీ అప్పుడే అక్కడికి చేరుకున్న రెస్క్యూటీం లోని వాలెంటీర్లు ఆ పిల్లల కడుపుల లోని నీటిని తొలగించి హాస్పిటల్ కి తరలించారు….. గుండె పగిలిన స్థితిలో ఉన్న శ్రీలత ఏడుపును చూసి ఎవరూ ఆపలేకపోయారు. ప్రతిసారీ విషాదం మాకే ఎందుకు వస్తుందోనని కన్నీరుమున్నీరైంది. వేణుగోపాల్ ఆ విసిరేసిన తడిచిన బట్టలను చెక్ చేశాడు. వీటికి లాంచ్ ప్రమాదానికి ఏదైనా సంబంధం ఉంటుందేమోనని ఇతనికి అనుమానం వచ్చింది.ఆ తడిచిన ప్యాంట్ జేబులో బాగా నానిన ఒక చిన్న కాగితం ముక్క దొరికింది. అది నిదానంగా విప్పితే ఒక మీసేవ నెంబర్ తప్ప ఏమీ దొరకలేదు.దానిని తీసుకొని మీసేవ సెంటర్ లో ఏదైనా ఆధారం దొరుకుతుందేమోనని చెక్ చేపించాడు.అది చూసిన మీ సేవ సెంటర్ ఉద్యోగి ఇది ఒక ఇన్సూరెన్స్ ప్రీమియుమ్ రిసిప్ట్ అని చెప్పాడు .ఆ రిసిప్ట్ లోని ఇన్సూరెన్స్ నెంబర్ తో వేణుగోపాల్ పాలసీ డీటైల్స్ తెల్సుకొన్నాడు. దానిలో 3గ్గురు పేరు మీద 100 కోట్ల టార్మ్ ఇన్సూరెన్స్ పాలసీ కట్టి ఉంది .ఇంత పెద్ద పాలసీ రెన్యుయల్ ప్రీమియమ్ కట్టి ఖచ్చితంగా వారం రోజులు అవుతుందని తెలుసుకున్నాడు.ఈ టర్మ్ ఇన్సూరన్స్ 2 సం!! ల గ్రేస్ పీరియడ్ ను కూడా పూర్తి చేసుకున్నందున యాక్సిడెంటల్ డెత్ అయితే 100 కోట్ల డబ్బు వస్తుంది.ఈ టర్మ్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ పూర్తి వివరాలు, డౌన్లోడ్ కావాలంటే సెల్ నెంబెర్ కి ఓ.టి.పి వస్తుంది.దానికి ఆధార్ కార్డ్ , పాన్ కార్డ్ డీటైల్స్ కూడా కావాలి…..ఈ వివరాలను ఎలా సంపాదించాలో వేణుగోపాల్ కి అర్థం కావట్లేదు…దీనికి లాంచీ యాక్సిడెంట్ కి ఖచ్చితమైన సంబందం ఉంటుందనేది ఇతని బలమైన నమ్మకం.

stars in telugu

ఈ వివరాలు సేకరించే పనిలో బిజీగా ఉన్న వేణుగోపాల్ కు….సడన్ గా టీ.వీ లో బ్రేకింగ్ న్యూస్ చూశాడు…. టీ.వీ లో హాస్పిటల్ బెడ్ మీది నుంచి మాట్లాడుతున్న తన కొడుకు, కూతుర్ని న్యూస్ ఛానల్ లో చూసి ఒక్క సారిగా షాక్ తిన్నాడు….. లాంచీ ఒనర్ మా ఇద్దరితో కలిసి మాట్లాడుతూనే వచ్చాడనీ, అతని ప్రవర్తన కాస్త డౌట్ గా అనిపించిందనీ, అప్పుడే మా పేరెంట్స్ కి ఫోన్లో చెప్పామనీ,అతను మాటిమాటికి లాంచి లో అండర్ గ్రౌండ్ కు వెళ్తున్నాడనీ……… పక్కన ఉన్న తన భార్య, అత్త, మామ కు కూల్ డ్రింక్ ఇస్తున్నాడనుకున్నాము కానీ దానిలో మత్తు కలిపాడని ఊహించలేదనీ…లాంచీ అడుగున పెద్ద రంధ్రం పడేలా స్క్రూలను లూజు చేస్తున్న వీడియో మామూలుగా పాపికొండల సుందర దృశ్యాలను తీస్తుంటే…. వెనుక ఈ దృశ్యం ఉందని, అది మేము గమనించ లేదని….. మేము అప్రయత్నంగా తీసిన ఆ వీడియో మా పేరెంట్స్ కి పంపగా…. వారు ఆ వీడియో లో… మేము చూడని ఆ లాంచ్ ఓనర్ చేసే పనిని చూసి… జల ప్రమాదాన్ని ఊహించి ఆ వీడియో ని రెస్క్యూ టీమ్ కి పంపి ఫోన్ కూడా చేశారని…. ఈ ప్రమాద సమయానికి ముందే ఆ వీడియో రెస్క్యూటీమ్ వారికి చేరడం తో 80 మంది ప్రయాణికుల్లో 3గ్గురే చనిపోగా… చాలా ప్రాణాలు కాపాడగలిగేలా చేయగలిగారని……ఒడ్డుకు చేరుకొన్న తర్వాత కూడా ఆ అడవిలో అతన్ని పట్టుకోవాలని మేము ప్రయత్నిచామని, ఏదో నాటు మందును మాకు వాసన చూపించడం తోనే ఆ పెనుగులాటలోనే మీము స్పృహ కోల్పోయామని… అప్పుడే అతను పారిపోయాడని చెప్పారు. మా తాత ల సాహసలు మా అమ్మ మాకు చెప్పడం వల్లే నది ప్రమాదం నుండి మేము ఈజీ గా తప్పించుకోగలిగామని వారు చెప్పారు. మా అమ్మ స్టీమర్ నడుపుతుండగా చూశామని, ఆమె క్లిష్ట పరిస్థితులలో తను మనసులో పెట్టుకున్న అనవసర భయాన్ని జయించగలిగిందనీ, మిమ్మల్నీ కాపాడగలిగిందని …. దీనికి మేము చాలా హ్యాపీగా ఫీలవుతున్నామని చెప్పారు.

అందరూ…. మనసులో అనవసర భయాన్ని లేపే మూఢనమ్మకాలను, ఇతరులు అన్న నిరాశ కలిగించే మాటలను, జాతకాలను వదిలిపెట్టి, సైంటిఫిక్ గా ఆలోచించి, పొందిన జీవితం లో హాయిగా బతకాలని పిల్లలు టీవీలో మాట్లాడసాగారు. దీనికి మా అమ్మే ఉదాహరణ అని చెప్తూ.. ఎంతో ధైర్యం, అనుభవం ఉన్న మా అమ్మ, అనవసర మాటలను మనసులో ఉంచుకొని భయంతో ఇన్ని రోజులు బతికిందని, ఈరోజు విడుదలైందని చెప్పారు……… ఆ జల ప్రమాదంలో లాంచీ ఓనర్ భార్య, అత్త, మామ 3గ్గురే చనిపోయారనీ….
….. ఎందుకంటే వారు ఆ సమయంలో,మత్తు మందు వలన ఏర్పడిన గాఢనిద్రలో ఉన్నారనీ….. ప్రమాదం జరిగినప్పుడు వచ్చే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ క్లైమ్ చేయడానికి…..తన భార్య, అత్త, మామ ను లాంచీ ప్రమాదంలో చనిపోయేటట్లుగా క్రియేట్ చేయాలనుకున్నాడనీ.. దాని వలన అతనికి 100 కోట్ల డబ్బు సమకూరుతుందనీ, తను సేకరించిన టర్మ్ ఇన్సూరెన్స్ ఆధారాలను చూపిస్తూ….ఇదే అసలైన కారణమనీ …. వేణుగోపాల్ పోలీసులకు చెప్పాడు…

లాంచీ ఓనర్ కోసం పోలీసులు వెతుకుతున్నారు…… అతడు దొరికితేనే….. మరిన్ని వివరాలు తెలుస్తాయనీ మీడియా వాళ్లకు పోలీసులు చెబుతున్నారు……… ఈ సంఘటనతో జలగండం భయం శ్రీలతను వదిలి వేణుగోపాల్ ని పట్టుకుంది……… ఇప్పుడైతే విహారయాత్రలు అంటే నే….నో..నో అంటున్నాడు…….
……..
…..
Bye….

 

N.Harshavardhan Raju