జీవితం ఒక భిక్ష
నువ్వు ఏర్పర్చుకున్న ఆనందమైన జీవితం వెనుక ఎన్ని కన్నీళ్లు కష్టం ఉందో, ఎందరు విశ్రమించక శ్రమించినా ఫలితం ఉందో తెలుసుకో…
జీవితం నీకు భిక్ష…..
అది ఎప్పటికీ నీది కాదు…..
మనిషి జీవితం సమాధి కే అంకితం!
నీ విలాసవంతమైన జీవితానికి నువ్వు కష్టపడిన రోజులెన్ని ?
అలుపెరగక శ్రమించిన క్షణాలెన్ని?
ఖర్చు చేసిన డబ్బెంత?
నువ్వు నువ్వుగా నిలబడడానికి భూమిపై ఎన్ని కర్మల ఫలితమో?
ఎన్ని కర్మల కార్యచరణ సిద్ధాంతమో తెలుసుకో !
నువ్వు నిర్మించుకుందాం అని అనుకున్నా నీ కలల సౌధం లో నువ్వు రాజకుమారుడివా? /రాజకుమార్తెవా? తెలుసుకో!
నీ అనుభవానికి,
నీ అనుబంధానికి,
బంధుత్వానికి నువ్వు ఇచ్చిన గుర్తింపు గుర్తు తెచ్చుకో…
ఎందరు మహానుభావులకు నువ్వు విలువ ఇచ్చావో తెలుసుకో…..
నువ్వు గెలవడానికి నువ్వు
విడిచిన బంధాలు,
వదిలిన కన్నీళ్లు ,
ఎదురైన కష్టాలు ఇవి ఏవి ఎవరికి అవసరం లేదు…
నిన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేయడానికి ఎందరు నీ వెనుక ఉన్న కృషి తెలుసుకో…
JIVITAM OKA BHIKSHA
నువ్వు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం
మీ అమ్మానాన్న నీన్ను కన్నారు కాబట్టి సగం మాత్రమే తల్లిదండ్రులది!
అయినా మిగతా సగం పాత్ర ప్రపంచానికి అని తెలుసుకో……
ఓటమి నీ ప్రపంచమే..,
ఓటమి అంచున దాటి గెలిచిన విజయం నా ప్రపంచమే…,
నా ఓటమి ,నా విజయం ఇవి రెండు ఈ ప్రపంచానికి అవసరమే..
ఇది నా ఒక్కడి కథ కాదు,
ఒక్కడి ఆలోచన, ఆవేదన, ఆక్రందన కాదు…
జీవితాన్ని గెలవాలనుకుంటే గెలిచే ప్రతి ఒక్కరి “కథ”
రచయిత
అబ్దుల్ రజాక్
అసిస్టెంట్ ప్రొఫెసర్