MAKE IN INDIA స్మార్ట్ ఫోన్లు రెడీ అయ్యాయ్…5777 రూపాయలకే స్మార్ట్ ఫోన్…

ఇటీవల కాలంలో Ban Chaina గో లోకల్ అన్న నినాదంతో భారతదేశాన్నఅ ఉర్రూతలూగించిన విషయం మనందరికీ తెలిసిందే.

ఐతే అదే క్రమంలో మోదీ గారు మేకిన్ ఇండియా ను కూడా బలపరిచే క్రమంలొ కోవిడ్ లో కూడా ప్రత్యేక చరఅయలు తీసుకున్న విషయం మనకుతెలిసిందే.

ఈ క్రమంలో భారతదేశంలో మేకిన్ ఇండియా స్మార్ట్ ఫోన్ 74వ స్వతంత్ర్యదినోత్సవం నాడు విడుదలకాబోతుంది.ఐతే ఈ ఫోన్ ను లావా కంపెనీ విడుదల చేయబోతుంది.

Lava Z61, LAVA ZPro, Lava A5, Lava A9 ఫోన్ల కు ప్రత్యేకంగా ProudlyIndian అనే వెర్షన్లతో విడుదల కాబోతున్నాయి.

ఐతే స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో #ProudlyIndian అనే లోగో ఉంటే, మిగిలిన ఫోన్ లకు త్రివర్ణపతకాలుండబోతున్నాయి.

పైన చెప్పుకున్న అన్ని రకాల ఫోన్ లు త్వరలో ఆఫ్ లైన్,ఆన్ లైన్ లో అంందుబాటులో రానున్నాయి.

LAVA Z61Pro

ఈఫోన్ కేవలం ఒక్క వేరియంట్ లో మాత్రమే అందుబాటులో ఉండనుంది.
2 జీబీ ర్యామ్ + 16 జీబీ స్టోరేజ్

ఈ మోడల్ ధరను రూ.5,777గా నిర్ణయించారు.

లావా ఏ5 ధరను రూ
1,333గానూ,

లావా ఏ9 ఫోన్ ధరను రూ.1,574 గానూ నిర్ణయించారు.

ఈ రెండు ఫోన్లూ ఇప్పటికే ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉన్నాయి.

LAVA Z61. KEY FEATURES…

ఇందులో 5.45 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 18:9గా ఉండనుంది. 1.6 గిగా హెర్ట్జ్ ప్రాసెసర్ ఈ ఫోన్లో అందించారు. 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ ఇందులో అందుబాటులో ఉంది. దీన్ని మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా 128 జీబీ వరకు పెంచుకోవచ్చు. వెనకవైపు 8 మెగా పిక్సెల్, ముందువైపు 5 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు. బ్లూ టూత్ 4.2, వైఫై, జీపీఎస్, యూఎస్ బీ ఓటీజీ, మైక్రో యూఎస్ బీ పోర్టు, ఫేస్ అన్ లాక్ సపోర్ట్ కూడా ఇందులో ఉన్నాయి. 3100 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.

LAVA A5 KEY FEATURES…

ఇందులో 2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్ ప్లేను అందించారు. వెనకవైపు 0.3 మెగా పిక్సెల్ కెమెరా ఉంది. ఈ ఫోన్ లో 32 జీబీ వరకు ఎస్ డీ కార్డు వేసుకోవచ్చు. బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ ను కూడా ఇందులో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 1000 ఎంఏహెచ్. చార్జింగ్ మూడు రోజుల వరకు ఉంటుందని లావా తెలిపింది. ఈ ఫోన్ మందం 1.28 సెంటీమీటర్లుగా ఉంది.

LAVA A9 KEY FEATURES…

ఇందులో 2.8 అంగుళాల డిస్ ప్లేను అందించారు. వెనక వైపు 1.3 మెగా పిక్సెల్ కెమెరా ఉంది. 4 ఎంబీ ర్యామ్ ను ఈ మోడల్ లో అందించారు. ఈ ఫోన్ లో 32 జీబీ వరకు మెమోరీ కార్డు వేసుకోవచ్చు. బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఇందులో ఉంది. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 1000 ఎంఏహెచ్ గా ఉంది. చార్జింగ్ ఆరు రోజుల వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ మందం 1.2 సెంటీమీటర్లు.

ఇక్కడ క్లిక్ చేయండి