Moharram in telugu

Moharram in telugu

మొహర్రం గురించి

ఇస్లామియ క్యాలండర్ ప్రకారం మొదటి మాసం
“ముహర్రం నెల.” ఈ మాసంలో ముఖ్యంగా
హజ్రత్ ఇమాం హసన్, హజ్రత్ ఇమాం హుసైన్
(రజి)గార్లు, మరియు వారి ఎనలేని త్యాగాలు
జ్ఞప్తికి వస్తాయి. వీరిద్దరూ హజ్రత్ అలి(రజి) గారి
కుమారులు. వీరి తల్లి హజ్రత్ ఫాతిమా(రజి). “
వీరిద్దరు అంతిమ ప్రవక్త ముహమ్మద్(స) గారి
మనమళ్ళు. మహాప్రవక్త ముహమ్మద్(స) శిక్షణలో
తర్ఫీదు పొందిన హజ్రత్ ఇమాం హసన్, ఇమామ్
హుసైన్(రజి)లు, ఇస్లాం ధర్మాన్ని పరిరక్షించడానికై
తమ ప్రాణాలను కూడా త్యాగం చేశారు.

సర్వమానవాళికి సన్మార్గం చూపించడానికై నియమించ బడిన మహాప్రవక్త ముహమ్మద్(స) పరమ
పదించిన తరువాత ఖలీఫాల పాలన అమలులోకి
వచ్చింది. ఈ ఖలీఫాలను ప్రజాస్వామ్య పద్ధతిలో
ఎన్నుకున్నారు. మొదటి వారు హజ్రత్ అబూబకర్
సిద్దీఖ్ (రజి), కాగా రెండవవారు హజ్రత్ ఉమర్
(రజి), మూడవవారు హజ్రత్ ఉస్మాన్ (రజి),
నాల్గవవారు హజ్రత్ అలీ(రజి)గార్లు. ఈ నలుగురు
ఖలీఫాలను “ఖుల్ ఫాయె రాషిదీన్” అంటాము.
వీరు నలుగురు క్రీ.శ. 632 నుండి క్రీ.శ 659 గ్రహించి
వరకు పరిపాలించారు. వీరి పరిపాలనా కాలంలో
సర్వత్రా న్యాయమే రాజ్యమేలింది. వీరు ప్రజలకు
చేదోడు వాదోడుగా నిలిచారు. అందరికి న్యాయ
పరిపాలన అందించారు. వీరి పరిపాలనా కాలం
చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని నెలకొల్పింది.

ఖలీఫాల పరంపరకాలం అంతమయిన తరువాత
ప్రజలు తమ ప్రతినిధిగా హజ్రత్ ఇమాం
హసన్(రజి)ను నియమించుకున్నారు. ఆ సమయంలో సిరియా ప్రాంతానికి గవర్నరుగా
ఉన్నటువంటి మావియా, తన కుమారుడ్ని రాజుగా. గుర్తించమని ప్రజలపై ఒత్తిడి తెచ్చాడు. ఆది ప్రజలకు
నచ్చలేదు. రాచరికపు వర్గానికి, ప్రజాస్వామ్య
వర్గానికి మధ్య యుద్ధం జరిగింది. ఇరువురికీ
అపార నష్టం కలిగింది. ఈ ధన ప్రాణ నష్టాలను కాని
చూసిన ఇమాం హసన్(రజి) తన ప్రతినిధి పదవి నుండి ప్రక్కకు తప్పుకున్నారు. ప్రతి సమాజానికి ఒక ప్రతినిధి తప్పనిసరి. అందుకే ఆ ప్రజలువెంటనే హజ్రత్ ఇమాం హుసైన్(రజి) గారిని తమ వర్గాల
ప్రతినిధిగాఎన్నుకున్నారు.సిరియా ప్రాంతానికి రాజుగా చెలామణిఅవుతున్న యజీద్ దుష్టపరిపాలన అక్కడి ప్రజలకు
ఏమాత్రం నచ్చలేదు. వారు జీవించడమే దుర్భరమైపోయింది. వారు యజీద్ పరిపాలనతో విసిగెత్తిపోయారు.
“ఇక్కడ పరిపాలన బాగా లేదు. మేమిక్కడ
జీవించడమేదుర్భరమైపోతుంది. మీరు ఒక సారి
ఇక్కడికి వచ్చి ఇక్కడి విషయాలన్నీ పరిశీలించి
ఒక మంచి వ్యక్తినిగవర్నరుగా నియమించండి
అని సిరియా ప్రాంత ప్రజలు హజ్రత్ ఇమామ్
హుసైన్(రజి)గారికి లేఖలు వ్రాసారు. ఇలాటి
లేఖలు ఇమామ్ హుసైన్(రజి)కు ఎన్నో వచ్చాయి.
అప్పుడు హజ్రత్ ఇమామ్ హుసైన్(రజి) తన
కుటుంబ సభ్యులు అందరినీ వెంట తీసుకొని
శాంతి చర్చల కోసం సిరియా రాజధాని కుఫాకు
బయలు దేరారు. 72 మంది ఉన్న వారి కుటుంబ
సభ్యులలో పిల్లలు, పెద్దలు, స్త్రీలు, ముసలివాళ్ళు ఉన్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్నసిరియా గవర్నరు యజీద్ – ఇమాం రాజధానిచేరితే తన అధికారానికే ముప్పు వాటిల్లుతుందని
గ్రహించి ఇమాం హుసైన్ ను మార్గమధ్యంలోనే
అడ్డుకోమని పెద్ద సైన్యాన్ని యుద్ధ సామాగ్రితో
పంపించాడు.
యజీద్ శత్రు సైన్యం ఇమాం హుసైన్(రజి)ను
“కర్బలా” అనే స్థలంలో ఎదురుపడి, ‘మీరు
యజీద్ ను రాజుగా గుర్తించాలి. అప్పుడే మిమ్మల్నిఇక్కడినుండి కుఫా పట్టణానికి వెళ్ళనిస్తాము. లేదామేము మీతో యుద్ధం చేస్తాము’ అని అన్నారు.
శాంతి స్వభావుడైన హజ్రత్ ఇమామ్ హుసైన్ (రజి)
యజీద్ శత్రు సైన్యానికి ఎన్నో విధాలుగా నచ్చజెప్పి
ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. కాని,
యజీద్ సైన్యం వారిని ముందుకు సాగనివ్వలేదు.
“ఆశయసాధన కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమే
కాని, ప్రజాస్వామ్యాన్ని కూలదోసి, రాజ్యాధికారాన్ని
అధర్మంతో దౌర్జన్యంగా దోచుకునే దౌర్జన్యపరు
లకు తల వంచను” అన్నారు ఇమామ్ హుసైన్
(రజి). వెనువెంటనే ఆ కర్బలా మైదానంలో ఇరు
వర్గాల మధ్య భీకర పోరు ప్రారంభమైంది. చర్చల
కోసమని వెళ్లిన ఇమాం సమూహం, యుద్ధం
కోసం సర్వసిద్ధంగా తయారై వచ్చిన యజీద్ శత్రు
సైన్యంతో తమ శాయశక్తులా ధైర్యంగా పోరాడారు.యుద్ధ భీకర పోరులో ఇరువర్గా లలోఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు.
కొంతమంది పిల్లలు అనాధలుగా, మరి
కొంతమంది స్త్రీలు వితంతువులుగా మిగిలారు. ఇంకొందరు శాశ్వతంగా వికలాంగులయ్యారు. హజ్రత్ ఇమాం హుసైన్ (రజి)
గారి ఆ చిన్న సమూహం ఒక్కొక్కరుగా
అమర గతులయ్యారు. ముహర్రం నెల
పదవతేదీ శుక్రవారం రోజు ఇమామ్ హుసైన్(రజి)జుమా నమాజు చేసుకుం
టున్న సమయంలో, యజీద్ శత్రుసైన్యంవారిని హతమార్చారు. ధర్మంకోసం ప్రజాస్వామ్యం కోసం పోరాడిన ఇమాం హుసైన్
గారి తలను మొండెం వేరుచేశారు.
ఇమాంగారి శరీర భాగాలను ఈటెలకుతగిలించుకొని, చిందులు తొక్కుతూ
సంబరాలు జరుపుకున్నారు.
కర్బలా యుద్ధం అయితే అలా ముగిసింది.
ఇమాం హుసైన్(రజి) గారి స్త్రీలు, పిల్లలు
బందీలుగా పట్టుబడ్డారు. వారిని త్రాళ్ళతో
బంధించి ఒంటెలపై పడేశారు. యజీద్
సైన్యం హజ్రత్ ఇమామ్ హుసైన్(రజి)
మరియు తన అనుచరుల తలలను, శరీర
భాగాలను ఈటెలు, బరిశెలకు తగిలించు
కొని కుఫా పట్టణానికి ఊరేగింపుగా తీసు
కెళుతున్నారు. ఈ ఘోర దృశ్యాన్ని తిలకిం
చడానికి కుఫా పట్టణ వీధుల్లో ప్రజలు
గుమిగూడారు. హజ్రత్ ఇమాం హుసైన్
(రజి)గారి కుటుంబం పై జరిగిన ఈ హింసా
కాండను చూసిన వారి మనస్సు చలించి
పోయింది.. బండరాతి గుండెలు సైతం
కరిగిపోయాయి. కుఫా పట్టణమంతా
విషాద ఛాయలు క్రమ్ముకున్నాయి.
బందీగా ఉన్న హజ్రత్ ఇమాం హుసైన్(రజి) గారి చెల్లెలు జైనబ్(రజి) కుఫా నగర
ప్రజలను ఉద్దేశించి ఇలా అన్నారు. తల్లులారా! తండ్రులారా!! ఈ ఘోర దృశ్యాన్నిచూడoడి. ఇలాంటి ఘోరం మీరెక్కడైనా
చూచి ఉంటారా? నేను ఇమాం హుసైన్
గారి చెల్లెలు జైనబు. అదిగో ఆ ముందున్న ఈటెకు తగిలించుకొని వెళుతున్నదే మాఅన్నగారి తల. ఆఒంటిపై బంధింపబడి ఉన్నది మా అన్న గారి కుమారుడు
జైనుల్ ఆబిదీన్. ఇతను పది దినాల నుండిజ్వరంతో బాధపడుతున్నాడు. తండ్రిని
కోల్పోయి విలపిస్తున్న ఆ సకీనానుచూడండి. రక్తంతో తడిసి ముద్దయిపోయిన
తన తండ్రి తలను చూసి, ‘మా నాన్నగారి
మొండెo ఏదమ్మా అని దీనంగాఅడుగుతుంటే మా గుండెలు తరుక్కు
పోతున్నాయి. మనింటికి ఇంకెప్పుడు వెల్దాo
అని అడుగుతుంటే, ఏమని సమాధానంచెప్పాలో అర్ధమే కావడం లేదు. ఇమాo
కుటుంబమంతా సర్వనాశనమైపోయింది.
ఎండ తీవ్రత నుండి విశ్రాంతి పొందేఅధికారం లేదు. మా బురఖాలను తొలగించితే అడిగే ధైర్యమే లేకుండా పోయింది.పసికందులు, పిల్లల కోసం గుక్కెడు
మంచినీళ్ళు అడిగితే, మాపైన బాణాల
వర్షం, కొరడా దెబ్బలు కురిపించారు.
ఒ ప్రజలారా! అధికారవాంఛ, రాజ్యకాంక్ష
మా అన్న హజ్రత్ ఇమాం హుసైన్ కు (రజి)గాని, మాకుగాని ఏ కోశానా లేదు. అల్లాహ్మరియు ప్రవక్త(స)గారి నిజ ధర్మాన్నిపరిరక్షించడానికై మేము మా సర్వస్వాన్ని
ధారపోశాము. అల్లాహ మార్గంలోకష్టము వచ్చినా, ఏ నష్టము వచ్చినా వాటిని
ఎదుర్కొనే శక్తిని, సహనాన్ని ప్రసాదించమనిదైవాన్ని వేడుకున్నాం” అని ఇమాంగారిచెల్లెలు తన ఆవేదనను వ్యక్తపరిచారు.
మహాశయులారా! ఇమాం హుసైన్ గారిత్యాగాన్ని చూశారు. ఇమాంగారు ఏ మహత్తర కార్యానికై తమ సర్వస్వాన్ని ధారపోసి, అమరగతులయ్యారో ఆ మహాకార్యనిర్వహణ కోసం సిద్ధపడవలసిన అవసరంఆసన్నమయింది. ధర్మాన్నిపరిరక్షిoచదలిచినవారు వెంటనే ముందుడుగువెయ్యాలి. వారి సత్యమార్గాన్ని అవలoబిస్తూ వారు చూసిన సన్మార్గంలో అందరినీ నడిపించడానికి అల్లాహ్ మనందరికి సహాయసహకారాలు అందించుగాక!

ఖాజామియా

Read more :