నా పేరు నేనే మర్చిపోయాను ?? Naa peru nene marchipoyanu

Naa peru nene marchipoyanu

నా పేరు నేనే మర్చిపోయాను

అది “IATA ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ పూణే ✈. అక్కడ ఓలా క్యాబ్ డ్రైవర్👮‍♂️ “జానీ” బుకింగ్ కోసం ఎదురు చూస్తున్నాడు. అతను ప్రతిరోజూ ఉదయం 7 గంటల కల్లా ఎయిర్ పోర్ట్ కు వస్తాడు. ఎయిర్ పోర్ట్ కి వచ్చే ,వెళ్లే ప్రయాణికులను తమ తమ గమ్యస్థానాలలో దింపి, రాత్రి 10 గంటల కల్లా ఇంటికి 🏠 చేరుకుంటాడు. వీరి కుటుంబం హైదరాబాద్ నుండి పూణే కు వారి కొడుకు చదువు కోసం వలస వచ్చింది. ఆ రోజు ఉదయం 7 గంటలకు అప్పుడే ఇంటి నుండి ఎయిర్ పోర్ట్ కు వచ్చాడు. వెంటనే తన ఫోన్ కు ఒక బుకింగ్ రావడంతో పికప్ పాయింట్ దగ్గర అతను వెయిట్ చేస్తున్నాడు. ఒక కస్టమర్ తను బుక్ చేసిన కార్ నెంబర్ ను చూసుకొంటూ…. ఇటువైపుగా వస్తూ బుక్ చేసింది తనేనని సైగ చేస్తూ…. లోపలికి వచ్చి కారులో కూర్చున్నాడు. తను సూటు,బూటు నల్లని కళ్ళ జోడు తో చాలా హుందాగా, మాస్కు పెట్టుకొని, క్యాప్ తో ఉన్నాడు. లోపల కూర్చున్న వెంటనే తన కోటు జేబులో నుంచి ఒక స్ప్రే తీసి తన కోటు మొత్తానికి దానిని స్ప్రే చేసుకున్నాడు. కార్ మూవ్ చేస్తున్న ఆ క్యాబ్ డ్రైవర్ కు ఒక్కసారిగా బాగా దాహం వేసింది. ఇంత చలి కాలంలో ఈ విపరీత దాహం ఏంటని !! వాటర్ బాటిల్ కోసం అటూ ఇటూ చూశాడు. వెంటనే కారులో వెనక సీటులో కూర్చున్న ఆ కస్టమర్ తన చేతిలోని వాటర్ బాటిల్ ను అతనికి కి అందించాడు. అప్పటికే బాగా దాహంతో ఉన్న ఆ క్యాబ్ డ్రైవర్ జానీ వెంటనే ఆ వాటర్ బాటిల్ లోని వాటర్ ను గటగటా తాగేశాడు. కొంత ప్రయాణం జరిగిన తర్వాత నుండి తనకు మగతగా, మత్తుగా, గాలిలో తేలుతన్నట్లుగా ఉంది. గజిబిజిగా ఉన్న అతనికి షుగర్ లెవెల్స్ పడిపోయాయా? లేక బీపీ డౌన్ అయిందా? తనకు ఏమీ అర్థం కావట్లేదు….. కానీ ఆ కస్టమర్ చెప్పిన ప్రతి చోటికి కారుని ఎలాగో తమాయించుకుంటూ…. నడుపుతూ తీసుకు వెళుతున్నాడు ….. కానీ అప్పటికే ఎంత సమయం అయిందో కూడా అతనికి అర్థం కావట్లేదు. తిరిగి.. తిరిగి ..చాలా రాత్రి తర్వాత తిరిగి “IATA ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్” పూణే , కి చేరుకున్నారు. ఆ కస్టమర్ కారు దిగేముందు తిరిగి తన కోటులోని స్ప్రే తో తన కోటు మొత్తం స్ప్రే చేసుకుని ఆ కస్టమర్ కారు దిగి పోతూ బాయ్… అని చెప్పి వెళ్ళాడు. క్యాబ్ డ్రైవర్ “జాని” డ్రాపింగ్ పాయింట్ నుండి కొంత దూరం తన కారు ని తీసుకువచ్చి ఓ పక్కకు ఆ కారును పార్క్ చేశాడు. అతనికి కొంతసేపటి తర్వాత కొంత సోయి(మెలకువ) వచ్చినట్లు గా ఉంది. ఏదో అనారోగ్యం వచ్చిందనుకొని ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాడు, కానీ అతనికి ఎంతకీ ఇంటి అడ్రస్ గుర్తుకు రావడం లేదు. తనకి ఇంటికి ఎలా వెళ్ళాలో దారి తెలియడం లేదు. ఎంత ప్రయత్నించినా ఇంటికి వెళ్లే దారి అతనికి గుర్తుకు రావడం లేదు. అంతా అయోమయంగా, మర్చిపోయినట్లు గా ఉంది. వెంటనే తన ఫోన్ ని ఓపెన్ చేద్దామని ఫోన్ ని చేతిలో పట్టుకున్నాడు, కానీ తన ఫోన్ పాస్వర్డ్ ని కూడా అతను మరచిపోయాడు. తన పేరు కూడా అతనికి గుర్తు రావడం లేదు. అతనికి మొత్తం గందరగోళంగా ఉంది. ఎటూ వెళ్ళలేక అతను క్యాబ్ లోనే నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం తన ఇంటి నుండి తన భార్య ఫోన్ చేసింది, ఆ ఫోన్ రింగ్ చప్పుడికి వెంటనే ఉలిక్కిపడి లేచి ఫోన్ ఎత్తాడు. నిన్నటి నుండి ఫోన్ చేస్తుంటే…. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వస్తుందనీ, తను నిన్నటి నుండి ఇంటికి ఎందుకు రాలేదని? తన భార్య అడిగింది. దానికి సమాధానంగా రాత్రి నుండి తనకు ఇంటి అడ్రస్ గుర్తుకు రావడం లేదని, ఫోన్ పాస్వర్డ్,తన పేరు కూడా మర్చిపోయానని చెప్తూ… తనకు గందరగోళంగా ఉందని చెప్పాడు. ఏం జరిగిందో !! అని కంగారు పడిన తన భార్య… తమాయించుకుని నిదానంగా మాట్లాడుతూ.. ఇప్పుడు ఎక్కడున్నారని? అడిగింది. రాత్రి నుండి ఎయిర్ పోర్ట్ డ్రాపింగ్ పాయింట్ వద్దే కార్ పార్క్ చేసుకొని ఉన్నానని చెప్పాడు. దానికి ఆమె అక్కడే ఉండమని మన కొడుకు “సిద్దిఖ్” ని పంపిస్తున్నాననీ, కంగారు పడవద్దని చెప్పింది.

Naa peru nene marchipoyanu
Naa peru nene marchipoyanu

అమ్మ తన కొడుకు సిద్దిఖ్ ని పిలిచి విషయం చెప్పి, వాడిని ఎయిర్ పోర్ట్ కు వెళ్లి తన డాడీ ని తీసుకు రమ్మని చెప్పింది. సిద్దిక్ ఐఐటి పూణే లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఫైనలియర్ చదువుతున్నాడు. వీడు చిన్నప్పటి నుండి చాలా మెరిట్ స్టూడెంట్. కంప్యూటర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ డివైజెస్ మీద అద్భుతమైన పరిశోధన చేస్తున్నాడు. ఇప్పటికే ఎన్నో కొత్త ఇన్వెన్షన్స్ ని కనిపెట్టాడు. వీటితో ఒక పెద్ద కంపెనీని స్థాపించాలనేది అతని కల .ఇతను కనిపెట్టిన “వెహికల్ మొబైల్ ట్రాకింగ్ డివైజ్ సిస్టం” అద్భుత ప్రశంసలను అందుకుంది. వీడి కోసమే 4 సంవత్సరాల క్రితం వారి కుటుంబం హైదరాబాద్ నుండి పూణే వచ్చింది. ఆటోలో వెళ్లిన సిద్దిఖ్ డ్రాపింగ్ పాయింట్ దగ్గర తన నాన్న ను కలిసాడు. అతను బాగా నిద్ర మత్తులో ఉన్నాడు. సరే!! మొదలైతే ఇంటికి వెళదామని ఇద్దరు కలిసి వారి క్యాబ్ లోనే ఇంటికి చేరారు. తను ఇంటికి చేరిన వెంటనే ఏమీ మాట్లాడకుండానే, మొహం కడుక్కొని టిఫిన్ చేసి, మళ్ళీ పడుకున్నాడు. బట్టలు ఉతుకు దామని అతని బట్టలు చెక్ చేస్తున్న తన భార్యకు డ్రైవర్ జానీ షర్ట్ జేబులో ఒక కొత్త డాలర్ల నోట్ల కట్ట కనిపించింది. అది చూసి తన కొడుకు సిద్దిఖ్ కు చూపించింది. వాడు అవి అమెరికన్ డాలర్లనీ వాటి విలువ 5 లక్షల వరకు ఉంటుందనీ సిద్దిఖ్ చెప్పాడు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనీ
మధ్యాహ్నం భోజనం తర్వాత, తన భార్య, కొడుకు అడిగిన ఏ ప్రశ్నకు అతను సరిగ్గా సమాధానం చెప్పలేక పోతున్నాడు. తనకు ఆ కస్టమర్ క్యాబ్ ఎక్కిన తర్వాత కొంచెం సేపటికి తనకు దాహం వేసిందనీ, నీళ్లు తాగాను. ఆ నీళ్లు తాగినంతవరకే తనకు గుర్తుందనీ…… తర్వాత అదే కస్టమర్ దిగి వెళ్లిపోయాడు….. తను పార్కింగ్ పాయింట్ కు చేరుకున్నాను. అది మాత్రమే గుర్తుకు వస్తుందని….. మధ్యలో జరిగిన ఏ విషయము గుర్తు లేదని….చెప్ప సాగాడు. డాలర్ల కట్ట తన జేబులో కి ఎలా వచ్చిందో తనకు తెలియదు అని చెప్పాడు. సరిగ్గా మాట్లాడలేకపోవడం, అతిగా నిద్ర పోవడం గమనించిన వారి కొడుకు సిద్దిఖ్, వాళ్ళ అమ్మ, డ్రైవర్ జానీని తర్వాతి రోజు డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళారు. చెక్ చేసి అన్ని టెస్టులు చేసిన డాక్టర్, అతని బ్లడ్లో కొకైన్ లాంటి మత్తు పదార్థం లాంటివి ఉన్నాయని బహుశా బాగా డ్రింక్ చేసి ఉండవచ్చని చెప్పాడు. రెండు రోజుల్లో మామూలు గా అవుతాడనీ భయపడాల్సిందేమీ లేదని డాక్టర్ చెప్పాడు. తనకు తాగినట్టు గుర్తే లేదని, అసలు తాగలేదని, డ్యూటీ కి వెళ్ళినప్పుడు తాగనని డ్రైవర్ జాని చెప్పాడు. అసలేం జరిగిందో!! అర్థం కాని వారి కుటుంబం అతన్ని ఒక 2 రోజులు రెస్ట్ తీసుకోమన్నారు. ఐదు రోజుల తర్వాత అతను మామూలుగా అయ్యాడు… కానీ ప్రతిరోజు తనకు ఎన్నో బుకింగ్స్ “ఓలా” కంపెనీ నుండి వచ్చేవి. కానీ ఈ సంఘటన జరిగిన 10 రోజుల నుండి ఒక బుకింగ్ కూడా లేదు. కనీసం కంపెనీ నుండి కూడా ఫోన్ రాలేదు. దాంతో డ్రైవర్ జానీ ఇంటి వద్దే ఉంటున్నాడు. 11 వ రోజు ఉదయం ఆన్లైన్లో ఒక బుకింగ్ వచ్చింది…… దాని లో తర్వాతి రోజు ఉదయం 6 గంటల కల్లా IATA ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, పూణే కి రావలసిందిగా ఉంది. మళ్లీ అదే నెంబర్ నుండి బుకింగ్ రావడంతో డ్రైవర్ జాని కంగారుపడి, తన కొడుకు సిద్ధిఖ్ తో, మళ్లీ అదే నెంబరా? కాదా ? అని డ్రైవర్ ఫోన్ లో తిరిగి చెక్ చేయమన్నాడు. కానీ సిద్దిఖ్ సేమ్ నెంబర్ తో బుక్ అయిందని గమనించి ఆ విషయాన్ని తన అమ్మ కు కూడా చెప్పాడు. ఇదంతా విన్న జానీ భార్య ఈ బుకింగ్ ని క్యాన్సిల్ చేసుకోవాల్సిందిగా,చెప్పింది. దానికి డ్రైవర్ జానీ ఇది ఇంటర్నేషనల్ బుకింగ్ అని దీనిని క్యాన్సిల్ చేసుకుంటే తనకు కంపెనీలో రేటింగ్ తగ్గి పోతుందనీ చెప్తూ, తర్వాత వచ్చే బుకింగ్స్ తగ్గిపోతాయని చెప్పాడు. పోలీస్ కంప్లైంట్ చేయాల్సిందిగా వాళ్ళ కొడుకు సిద్ధిఖ్ చెప్పాడు. ఏదైనా పొరపాటు జరిగితే కస్టమర్ ఇబ్బందికి గురై, అతనిచ్చే ఫీడ్ బ్యాక్ వల్ల, తనను బ్లాక్ లిస్ట్ లో పెడతారని చెప్పాడు. లాస్ట్ ట్రిప్ కస్టమర్ వల్లనే… తనకేదో జరిగిందనే ఖచ్చితమైన ఆధారం లేకపోవడంతో మరుసటి రోజు ఉదయం 6గంటల కల్లా ఎయిర్ పోర్ట్ కి “డ్రైవర్ జానీ” చేరుకొన్నాడు.
ఉదయం 7 గంటల తర్వాత తన నాన్నకు ఫోన్ చేసిన సిద్ధిఖ్ తో డ్రైవర్ జానీ అంతా బాగానే ఉందని చెప్పాడు. కానీ మధ్యాహ్నం రెండు గంటలకు నుండీ అన్నీ టీవీ న్యూస్ చానల్స్ లో భారత్ రహస్య సమాచారాలను, పాకిస్తాన్ కు , అక్కడి నుండి చైనా కు చేరవేస్తున్న క్యాబ్ డ్రైవర్ జానీ అరెస్ట్…. అనే స్క్రోలింగ్ వస్తూంది… అది చూసి షాక్ తిన్న వారి కుటుంబం… విస్తుపోయింది…. వెంటనే వాళ్ళ నాన్న జానీ కి సిద్ధిఖ్ ఫోన్ చేశాడు. అటువైపు ఫోన్ లిఫ్ట్ చేసిన ఎస్.ఐ తన నాన్న మత్తులో ఉన్నాడనీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, పూణే లో ఇండియా కి సంబంధించిన పరిశోధనా పత్రాలు, ముఖ్యమైన ఫైల్స్, కోవీ ఫర్ 19 సాంపిల్ వాయిల్స్, భారత్ బయోటెక్, హైదరాబాద్ వారి వాల్యుబుల్ “కోవిఫర్” ట్రైల్ రన్ ఇన్ఫర్మేషన్, త్వరలో విడుదల కాబోయే కోవిడ్ మెడిసిన్ ఫార్ములా , ఇతని క్యాబ్లో పట్టుబడ్డాయని, డాలర్స్ నోట్లకట్టలు దొరికాయని చెప్తూ… వెంటనే పోలీస్ స్టేషన్ కి రావలసిందిగా చెప్పాడు… అది విన్న అతని భార్య ఏడవడం మొదలు పెట్టింది….. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని తన తల్లిని ఓదార్చి తను ఖచ్చితంగా నాన్నను తీసుకొస్తానని చెప్పి సిద్దిక్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. అక్కడ ఎస్.ఐ….”డ్రైవర్ జానీ”…. దేశద్రోహి అని, తీహార్ జైల్లో జీవితాంతం ఊచలు లెక్క బెడతాడనీ, ఇంటర్నేషనల్ దందా చేస్తూ బాగా డ్రగ్స్ కి అలవాటు అయ్యాడనీ, చూడు… మతిస్థిమితం కోల్పోయి, ఎలా ఉన్నాడో!! అంటూ తన నాన్న వైపు చూపించాడు. తన నాన్న ను చూసిన సిద్ధిఖ్ ఎంతో బాధతో ఇలా అన్నాడు….. మేము దేశద్రోహులము కాదు… మా తాతల కాలం నుండి నైజాం ప్రభుత్వానికీ, బ్రిటీషర్ల్ కు వ్యతిరేకంగా భారత దేశ స్వాతంత్రం కోసం పోరాడాము… మేము భారతీయులం…. ఎప్పటికీ దేశం కోసం,ఐక్యత కోసం త్యాగాలకు సిద్ధం. మా నాన్నకు డ్రగ్స్ అలవాటు లేదు.. మైండ్ యువర్ వర్డ్స్ అని ఏడుస్తూ…. వాళ్ల నాన్న దగ్గరికి వెళ్లి
అబ్బాజాన్…. జల్దీ…ఉటో ….ఉటో జల్దీ… అని తన తండ్రి ని లేపసాగాడు.

ఢిల్లీ నుండి వచ్చిన స్పెషల్ సిబీ సిఐడి టీం ఇంటరాగేషన్ రూమ్ లోనికి డ్రైవర్ జానీని, పిలిపించారు.వారు అడిగే రకరకాల ప్రశ్నలకు డ్రైవర్ జానీ ఏమి సమాధానం చెప్పలేక పోతున్నాడు. ఒక కస్టమర్ తన క్యాబ్ లోకి ఎక్కింది, దిగింది,తప్ప మధ్యలో తనకు ఏమీ గుర్తు లేదని మాత్రమే… పదే పదే చెబుతున్నాడు. అతను ఇప్పటికింకా సగం మత్తులోనూ, నిద్ర లోనే ఉంటున్నాడు.

కొంత విరామం తర్వాత సిబిసిఐడి డైరెక్టర్…
మొత్తం డిపార్ట్మెంట్ ని పిలిచి ఒక మీటింగ్ ని ఏర్పాటు చేశాడు. ఆయన మాట్లాడుతూ…. మన భారతదేశంలోని రెండు ముఖ్యమైన సంస్థలు 1. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ,పూణే.

  1. భారత్ బయోటెక్స్, హైదరాబాద్. ఈ రెండు కంపెనీలు గత జనవరి 2020 నుండి అనేక రిసర్చ్ లు చేసి కోవిడ్19 ని పూర్తిగా నిర్మూలించే ప్రక్రియ లో భాగం గా “కోవీఫర్” టీకాను తయారు చేశారు. ఇవి క్లీనికల్ దశలో ఉన్నాయి. రాబోయే రెండు మూడు నెలల్లో ఈ మందు విడుదల కాబోతుంది…..ఇది తెలుసుకున్న ఇంటర్నేషనల్ మాఫియా… దీనికి సంబంధించిన ఆ ఫార్ములాలను పాకిస్తాన్ నుండి చైనాకు తరలించాలని ఎత్తులు వేస్తున్నాయి. ఇది జరిగితే, దీని వలన మన దేశానికి మిలియన్ డాలర్ల లో నష్టం జరుగుతుంది, అంతే కాకుండా దీని వలన మన దేశంలో లక్షల మంది ప్రాణాలు కోల్పోతారు. మనం కనిపెట్టిన మందునే ఎక్కువ ధర చెల్లించి, తిరిగి అదే మందును ఇతర దేశాల నుంచి కొనవలసిన పరిస్థితి వస్తుంది. ఇదో పెద్ద ఇంటర్నేషనల్ రాకెట్ అని చెప్పాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనకు ఈ అతి ముఖ్యమైన సమాచారాన్ని, ఆ వీడియో ను మనకు చేరవేసి, మనం పట్టుకొనే లా సహాయం చేసి, ఈ దేశాన్ని కాపాడిన వారెవరో…. వారికి ఈ జాతి రుణపడి ఉంటుంది.వారిని త్వరగా కనిపెట్టి సాదరంగా ఆహ్వానించమని….. భారత హోమ్ మినిస్టర్ “అమిత్ షా” నాకు ఆదేశాలిచ్చాడని చెప్పాడు.వారెవరో మనం వెంటనే తెలుసుకోవాలి.

దానికి ఒక సీఐడీ అధికారి మాట్లాడుతూ…….. ఆ వీడియోను వారు ఇండియా హోమ్ మినిష్టర్ “అమిత్ షా” కు ట్విట్టర్లో పంపించారని చెప్తూ…. ఆ పంపించిన వీడియో ఏ సెల్ ఫోన్ నుండి వచ్చిందో ఆ నెంబర్ ను ట్రాక్ చేశామని వారు మనతో పాటే ఇక్కడే ఉన్నట్టుగా ఈ ఫోన్ ట్రాకింగ్ సాఫ్ట్ వేర్ పరికరం చూపిస్తుందని చెప్పాడు….

ఆ మీటింగ్ హాల్ లో ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు.
ఆ మొబైల్ ఫోన్ ట్రాకర్ పరికరాన్ని తన చేతిలోకి తీసుకున్న ఆ సిబిసిఐడి డైరెక్టర్….. అది చూపిస్తున్న దిశ గా నడిచాడు…. ఆ మొబైల్ ట్రాకర్ డైరెక్టుగా ఆ సిబిసిఐడి డైరెక్టర్ ను ఇంటరాగేషన్ రూమ్ వైపు తీసుకెళ్ళ…సాగింది….. అలా నడుస్తూ నడుస్తూ అతను…….. డ్రైవర్ జానీ దగ్గరికి వెళ్ళాడు. ఆ ఫోను డ్రైవర్ జానీ జేబులో ఉంది…. ఒకవైపు ఇతను నేరస్తుడు అంటున్నారు… మరోవైపు అసలైన నేరస్తులను పట్టించిన ఫోన్ ఇతని జేబులో ఎలా ఉంది?….. ఆ ఫోన్ పాస్వర్డ్ తో లాక్ అయి ఉంది. వెంటనే ఆ ఫోన్ లోని సిమ్ కార్డు ను సైడ్ నుంచి తీసి దాని యెక్క IMEI నెంబర్ సహాయంతో… దానికి లింక్ అయిన ఆధార్ కార్డు ను కంప్యూటర్ లో చూశారు…. సిద్దఖ్ ఫోటో తెరమీదికి వచ్చింది….ఆ ఫొటో ను చూసి గుర్తుపట్టిన ఒక సిఐడి ఆఫీసర్, ఇతన్ని ఇంతకుముందు ఆఫీస్ ముందే చూశానని చెప్పాడు . ఇక్కడే ఎక్కడో చెట్టుకింద ఉండవచ్చునని వెళ్లి చూసి వస్తానని వెళ్లాడు. ఎస్ సార్!! ఆ అబ్బాయి చెట్టు కిందే కూర్చుని ఉన్నాడని ఆ ఆఫీసర్ చెప్పాడు.

వెంటనే బయట ఉన్న సిద్ధిఖ్ ని లోపలికి అనుమతించారు. అప్పుడు ఆ సిబిఐ డైరెక్టర్ ఈ ఫోన్ ఎవరిది? అని అడిగాడు. యస్, ఇది నాది అన్నాడు. అయితే దీన్ని అన్లాక్ చెయ్!! అన్నాడు. సిద్ధిఖ్ ఆ ఫోన్ని అన్లాక్ చేసి ఆ డైరెక్టర్ కు ఇచ్చాడు.ఐతే నీ ఫోన్ డ్రైవర్ జానీ దగ్గర ఎందుకు ఉంది? అని ఆ డైరెక్టర్ అడిగాడు? డ్రైవర్ జాని మా నాన్నగారని చెప్పాడు. సిద్ధిఖ్ ఆవేశంగా మాట్లాడుతూ…. మీరు దేశ ద్రోహి…. ద్రోహి… అన్న ఈ డ్రైవర్ జానీ కొడుకే!! మీరు పట్టుకోలేని ఈ దేశ ద్రోహులను…. నేను పట్టించానని ఈ ప్రపంచానికి…. తలియడానికే నా ఫోన్ మా నాన్న జేబులో ఉంచాను. ఇదిగో నా దగ్గర ఉన్నది మా నాన్న ఫోన్.!!!! అని రొమ్ము విరుచుకుని, ధైర్యం గా సమాధానం చెప్పాడు….

ఇదంతా నిజమేనని రూఢీ చేసుకున్న సిబిసిఐడి డైరెక్టర్, వావ్!!!కంగ్రాట్యులేషన్స్!! సిద్దిఖ్…. యూ హ్యావ్ డన్ ఎ గుడ్ జాబ్ అన్నాడు!! సిద్దిఖ్ జరిగినదంతా చెప్పాడు…. మొదటి సారి మా నాన్న స్పృహ కోల్పోయినప్పుడే నాకు అనుమానం కలిగింది… నేను కనిపెట్టిన “మొబైల్ వెహికల్ డివైస్ సిష్టాన్ని” మైక్రో కెమెరాస్ ని మా క్యాబ్ కారు కి, నా ల్యాప్టాప్ కి, అనుసంధానం చేశాను.
దీని ద్వారానే నీను, మీకు పంపిన వీడియోని సేకరించాను. అతను వాడిన స్ప్రే లోని క్లోరోఫామ్, వాటర్ లోని కొకైన్ వలనే… మా నాన్న స్పృహ కోల్పోతున్నాడని నాకు తెలుసింది…. ఎవరూ కనిపెట్టలేని విధంగా…. నేను కారు డోరు కి అతికించిన నానో కెమెరా, అదృష్టవశాత్తు దుండగుడి చేతికి అంటుకుంది. అతను “నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ” లో దొంగలిస్తున్న కోవిఫర్ రిసెర్చ్ క్లీనికల్ ఫైల్స్, కోవిడ్ 19 టీకా ఫార్ములా ను, నేను లాప్ టాప్ లోనే చూశాను. జరిగే విషయం నాకు పూర్తిగా అర్థమై…… ఆ వీడియోను హోమ్ మినిష్టర్ అమిత్ షా కు ట్విట్టర్లో పోస్ట్ చేశాను.
మా నాన్నకు ఇవేమీ తెలియదు. మా నాన్న… వాళ్ళనాన్న, మా తాతలు భారత దేశ స్వాతంత్రం కోసం పోరాడిన యోధులు… మా చివరి శ్వాస కూడా “భారత్ మాతాకీ జై” అంటుందని ఆవేశంగా పలికాడు..

నీ ధైర్యం,తెలివితేటలు, నీవు కనిపెట్టిన ఈ పరికరం…. మీ క్యాబ్ తోనే మీ నాన్న ను, ఈ దేశాన్ని కాపాడినందుకు …… అక్కడ మీటింగ్ సభ్యులందరూ నిలబడి చప్పట్లు కొడుతూ.. సిద్దిఖ్ ను అభినందించారు…..
భారతదేశం గర్వించదగ్గ గొప్ప విద్యార్థి సిద్ధిఖ్ అని కొనియాడారు…… మాతృదేశ “ముద్దుబిడ్డలని” ఆ తండ్రీకొడుకులను టీవీ చానల్స్ వారు
చూపించగా…. దేశ ప్రజలు మొత్తం జేజేలు పలికారు. ఇంటికి వెళ్తున్న డ్రైవర్ జాని తన కొడుకు సిద్దిఖ్ తో…. నేను ఎక్కడ ఉన్నాను? నా పేరేంటో నాకే గుర్తుకు రావడం లేదు? నా ఫోన్ ఎక్కడ? అని అడుగుతున్నాడు….
భారతదేశ హోంశాఖ మంత్రి సిద్ధిఖ్ ని పార్లమెంట్ కి పిలిపించి .. రాబోయే రోజుల్లో అతను స్థాపించే ఎలక్ట్రానిక్స్ కంపెనీకి స్థలాన్ని, పెట్టుబడినీ ఇచ్చి ఘనంగా సత్కరించారు… ఇదంతా టీవీలో చూస్తున్న వాళ్ళ అమ్మ ఎంతో సంతోషించింది…….

N.హర్ష వర్ధన్ రాజు.

5 thoughts on “నా పేరు నేనే మర్చిపోయాను ?? Naa peru nene marchipoyanu”

Comments are closed.