నిరుద్యోగులకు శుభవార్త… National Career Service

నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉన్నత లక్ష్యాలను అందుకోడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. పోటీ పరీక్షలకు హాజరయ్యే రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది…

ఇందు కోసం ప్రముఖమైనటువంటి సంస్థలతో తర్ఫీదు ఇప్పిస్తున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ తెలిపింది.


ఇందుకోసం మూడు రోజుల శిక్షణ తరగతులను National Career Service Center for SC ST యొక్క పర్యవేక్షణలో నిర్వహిస్తోంది. ఈ కోర్సులను ప్రముఖ శిక్షణా కేంద్రాల ద్వారా SSC స్టాఫ్ సెలక్షన్ కమిటీ, రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డుRRB, ఐబీపీఎస్‌IBPS, ఎల్‌ఐసీ LIC సంస్థల్లో ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు శిక్షణ ఇస్టున్నట్లుగా తెలిపింది. ఐతే ఈ శిక్షణలో ప్రభుత్వ, ప్రైవేటురంగాల్లో కూడా ఉపాధి లభించేలా ట్రైన్ చేస్తారని తెలిపింది. కంప్యూటర్‌ ఓ లెవల్‌, హార్డ్‌వేర్‌ కోర్సుల్లోనూ శిక్షణ ఇస్తామని పేర్కొంది.

ఈ కోర్సుల్లో ప్రవేశానికి 18-30 ఏళ్ల మధ్య వయసు వారు అర్హులని, ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల విలువైన పాఠ్యా పుస్తకాలు, నెలకు వెయ్యి రూపాయలు స్కాలర్షిప్ లాగ ఉంటుందని తెలిపింది.

జాయిన్ అవ్వాలని అనుకునే వారు హైదరాబాద్‌లోని నేషనల్‌ కేరీర్‌ సర్వీస్‌ సెంటర్‌కు చెందిన ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌ క్యాంప్‌స్ కు తమ అప్లికేషన్ లను పంపించాలని తెలిపింది.

సోర్స్ : TV9

ఇక్కడ క్లిక్ చేయండి