which phobia do you have ? మీకున్న ఫోబియో తెల్సుకోండి.

సాధారణంగా ప్రతీ మనిషికీ కొన్ని కొన్ని విషయాలలో బలమున్నట్లే కొన్ని అంశాల్లో భయం కూడా ఉంటుంది.ఈ భయం అనేది ఒకే వ్యక్తిలో అనేక అంశాలల్లో ఉండవచ్చు.అదేవిధంగా వ్యక్తికి వ్యక్తి కి కూడా మార్పులుండవచ్చు.ఐతే భయం అనేది ప్రతీ మనిషిలో ఉండే సాధారణ అంశమే ఐనప్పటికీ ప్రత్యేకంగా కొంత మందికి కొన్ని అంశాల్లో వారు తట్టుకోలేనంత భయం కలుగుతుంది.దీన్నే మనం ఫోబియా గా పరిగణించాల్సి ఉంటుంది.

ఇతరులకు సాధారణంగా కన్పించిన అంశాలు ,పరిగణ లోకి తీసుకోలేని చిన్న చిన్న అంశాల పట్ల కూడా వీరి స్పందన తీవ్రంగా ఉంటుంది.ఐతే ఈ ఫోబియోలు అనేక రకాలు ఉన్నప్పటికీ ఎక్కువ మంది లో ఉండే ఫోబియోలు మనం తెల్సుకుందాం…!!

సాధారణంగా ప్రతీ మనిషికీ కొన్ని కొన్ని విషయాలలో బలమున్నట్లే కొన్ని అంశాల్లో భయం కూడా ఉంటుంది.

ఈ భయం అనేది ఒకే వ్యక్తిలో అనేక అంశాలల్లో ఉండవచ్చు.అదేవిధంగా వ్యక్తికి వ్యక్తి కి కూడా మార్పులుండవచ్చు.

ఐతే భయం అనేది ప్రతీ మనిషిలో ఉండే సాధారణ అంశమే ఐనప్పటికీ ప్రత్యేకంగా కొంత మందికి కొన్ని అంశాల్లో వారు తట్టుకోలేనంత భయం కలుగుతుంది.

దీన్నే మనం ఫోబియా గా పరిగణించాల్సి ఉంటుంది.

ఇతరులకు సాధారణంగా కన్పించిన అంశాలు ,పరిగణ లోకి తీసుకోలేని చిన్న చిన్న అంశాల పట్ల కూడా వీరి స్పందన తీవ్రంగా ఉంటుంది.

ఐతే ఈ ఫోబియోలు అనేక రకాలు ఉన్నప్పటికీ ఎక్కువ మంది లో ఉండే ఫోబియోలు మనం తెల్సుకుందాం…!!

phobia

కొనియో ఫోబియా :

మహానుభావుడు సినిమాలో OCD బాధితుడిగా శర్వానంద్ నటన మనందరికీ తెలిసిందే ఐతే ఎక్కడ దుమ్మూ,ధూళీ బారిన పడతామో అని, బాక్టీరియా,వైరస్ ల బారిన పడతామేమో అని కనీసం హ్యండ్ షేక్ చేయరు. ఏ వస్తువులను తాకరు. వీరిభయం వీరిది.

నియోఫోబియా :

ఈ నియో ఫోబియా ఉన్నోళ్ళకు నయా కార్యక్రమాలు నచ్చవు. అదేనండి కొత్త విషయాలు నచ్చవు. అందుకనే తెల్సుకునే ప్రయత్నం చేయరు. కొత్త ప్రదేశాలకు వెళ్ళరు.కొత్త వ్యక్తులతో మాట్లాడరు. ఇలా కొత్తకౘ అంటేనే వీరికి భయం అన్నమాట…

సోషియో ఫోబియా :

పేరులోనే ఉందికదండి జనాల్లో కల్సిపోవడం అంటే భయం. గిరిగీసుకుని అందులోనే ఉండడం.ఇంకా వీరు ఎప్పడూ ఎదుటి వారు తమ గురించే మాట్లాడుతున్నారేమో అని,తమనే చూస్తున్నారేమో అని, అనుకుంటూ మనుషుల మధ్యన ఉండడమే తప్పుగా ఫీలౌతూ ఉంటారు.

ఎవరి ముందైనా ఏ పని ఐనా చేయాల్సి వస్తే ఏం చేసైనా సరే తప్పించుకుంటారు.

ఐతే ఇది ఈ కాలానికి అంతమంచిది కాదు. ఈ ఫోబియో ఉన్న వారు తప్పక అనుభవజ్ఞులైన సైకాలజిస్ట్ ద్వారా కౌన్సెలింగ్ తీసుకోవాలి.

ట్రైపనో ఫోబియా :

చిన్నపిల్లలు భయపడినట్టే,పెద్దలు కూడా ఇంజెక్షన్ అంటే భయపడడాన్నే ట్రైపనో ఫోబియా అంటారు.

ఆస్ట్రో ఫోబియా :

ఈ ఫోబియో ఉన్న వారు ఉరుములు,మెరుపులంటే భయపడతారు. ఎక్కడ వారిపైన పిడుగు పడుతుందో అని భయపడుతూ,సేఫ్ ప్లేస్ కోసం వెతుకుతూంటారు. ఈ క్రమంలో వీరికి శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది.

కైనో ఫోబియో :

అంటే కుక్కలంటే భయపడడం. కుక్క అరుపు విన్నా,కుకఅకల గుంపు కనబడినా వీరిలో భయం మొదలౌతుంది. ఐతే చిన్నతనంలో కుక్క కరిపించుకున్నవారు వారు మెదడులో ఆ తాలూకా జ్ఞాపకాలను ప్రేరేపించుకోవడం వల్ల ఇలా భయపడుతూ ఉంటారు.

ఏరో ఫోబియా :

పేరులో ఉన్నట్టే విమానం లోఎగరడం అంటే భయపడడం అన్నమాట. విమానం ఎక్కగానే వీరికి గుండెదడ పెరగడం లాంటి కాంప్లికేషన్స్ వస్తాయి. విమాన ప్రమాదాలు కూడా వీటికి ఒక కారణం కావచ్చు.

ఆక్రో ఫోబియా :

ఈ ఫోబియా లో లోతైన ప్రదేశాలంటే భయపడతారు. ఎక్కడికైనా విహారయాత్రలకు వెళ్ళినపుడి రోప్ స్టెప్స్ పైన నడవాలంటే వీరు చాలా భయపడతారు ఎక్కడ ఆ లోయలో పడిపోతామో అని .ఈ ఫోబియోరున్నవారు లోతైనన ప్రదేశానికి చేరుకోగానే ఒత్తిడి ,ఎక్కువ కలికి ఆందోళన ఎక్కువ పొంది ఆరోగ్యం పాడు చేసుకుంటారు.

ఒపిడియో ఫోబియా :

అంటే పాము అంటే భయం కలగడం. పాము అంటే భయం అందరికీ ఉంటుంది. కానీ కొంతమందికి తీవ్రంగా ఉంటుంది. పాము కరవగానే చనిపోతామన్నంతగా. విషం వల్ల ఆ భయంలకలగవచ్చు. సంస్కృతి వల్ల ఆ భయం కలగవచ్చు.

అరాక్నో ఫోబియా :

ఈ అరాక్నో ఫోబియా అంటే సాలె పురుగులు లేదా అరాక్నో కుటుంబానికి చెందిన సాలెపురుగులాంటి కీటకాలంటే భయ పడడం.అన్ని సాలెపురుగులు విషపూరితాలు కానప్పటికీ ఆదిమానవుని కాలం నుండే మనిషికి ఈ అరాక్నే ఫోబియా ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఫోబియాలు ఉన్నాయి. వాటి గురించి సంక్షిప్తంగా…

ర‌కం ఫోబియా పేరు
» ఉష్ణోగ్రత – థర్మోఫోబియా
» చలి – సైక్రో ఫోబియా లేదా క్రియో ఫోబియా
» కొత్తవారు – క్సెనో ఫోబియా
» స్త్రీలు – గైనో ఫోబియా
» పక్షులు – ఆర్నితో ఫోబియా
» విమానాలు (ఎగరటం) – ఏరో ఫోబియా లేదా టెరో ఫోబియో
» వర్షం – ఓంబ్రో ఫోబియా
» ఎగరటం – అవిటో ఫోబియా (ఏరో ఫోబియా)
» దెయ్యాలు – డెమనో ఫోబియా
»జంతువులు – జూ ఫోబియా
» మంచు – చినో ఫోబియా
» లోతు – బాతో ఫోబియా
» మురికి, మలినం – రూపో ఫోబియా లేదా మైసో ఫోబియా
» రక్తం – హెమటో ఫోబియా లేదా హెమో ఫోబియా
» చీకటి – నిక్టో ఫోబియా లేదా స్కాటో ఫోబియా
» నీరు – హైడ్రో ఫోబియా
» దంత వైద్యుడు – డెంటో ఫోబియా
» సూర్యుడు లేదా సూర్యకాంతి – హీలియో ఫోబియా
» గర్భం – మాయూసియో ఫోబియా

» కూరగాయలు – లచనో ఫోబియా
»మరణించిన దేహాలు – తనాటో ఫోబియా
» తొండలు, బల్లులు – హెర్పిటో ఫోబియా
» నిప్పులు – పైరో ఫోబియా
» బంగారం – ఓరో ఫోబియా
» వెంట్రుకలు – చాటో ఫోబియా
» పిల్లులు – అల్యురో ఫోబియా
» రంగులు – క్రోమో ఫోబియా
» దుమ్ము – కోనియో ఫోబియా
» కాంతి – అస్ట్రా ఫోబియా/ కిరౌనో ఫోబియా
» సాలిపురుగులు – అరాక్నో ఫోబియా
» పాములు – ఒపిహియో ఫోబియా
» రోడ్డును దాటటం – అజిరో ఫోబియా
» వృద్ధాప్యం – జెరాస్కో ఫోబియా
» కొత్తదనం – కైనలో ఫోబియా
» కదులుట – కైవసో ఫోబియా
» చేపలు – ఇక్తియో ఫోబియా
» శస్త్ర చికిత్స – ఎర్గాసిమో ఫోబియా/ టోమో ఫోబియా
» దొంగతనం – క్లెప్టో ఫోబియా
» ఇంజక్షన్లు – ట్రైపనో ఫోబియా
» సజీవంగా పూడ్చటం – తాపో ఫోబియా
» ఒంటరితనం – మోనో ఫోబియా
» పూజారులు – హయరో ఫోబియా
» విద్యుత్ – ఎలక్ట్రో ఫోబియా
» ఆల్కహాల్ – మేథి ఫో…
అంతరిక్షం – ఆస్ట్రో ఫోబియా
» గుర్రాలు – ఈక్వినో ఫోబియా/ హిప్పో ఫోబియా
» క్యాన్సర్ – క్యాన్సరో ఫోబియా/ కార్సినో ఫోబియా
» ఎత్తులు – అక్రో ఫోబియా
» పురుషులు – అండ్రో ఫోబియా
» క్రిములు – ఎంటమో ఫోబియా
» తాగుడు – డిప్సో ఫోబియా
» అందం – కల్లో ఫోబియా
»కుక్కలు – కైనో ఫోబియా
» విదేశీయులు – గ్జెనో ఫోబియా
» ఆహారం – కైబో ఫోబియా
» సంఖ్యలు – ఆర్థిమో ఫోబియా/ న్యూమరో ఫోబియా
» చిన్న పిల్లలు – పిడో ఫోబియా
» మార్పు – నియో ఫోబియా
» భిక్షగాళ్లు – హోబో ఫోబియా
» సముద్రం – తలస్సో ఫోబియా
» అందవిహీనత – కాకో ఫోబియా
» అనారోగ్యం – నోసో ఫోబియా లేదా పాతో ఫోబియా
» సంపద – ఫ్లూటో ఫోబియా
» శబ్దం – ఫోనో ఫోబియా
» కీటకాలు – స్కోయిలికి ఫోబియా లేదా హెల్మింథో ఫోబియా

ఇక్కడ క్లిక్ చేయండి