
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) గారు పరమపదించారన్న ఫేక్ వార్త బుదవారం రాత్రి నుండి వేగంగా తిరుగుతుంది.
అసలు వివరాల్లోకి వెళితే ప్రణబ్ ముఖర్జీ గారు ఢిల్లీ లోని ఆర్మీ రీసర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్ లో చేరారు.తనకు బ్రెయిన్ లో చిన్న ఆరోగ్య సమస్య కారణంగా శస్త్రచికిత్సకు ఆ హాస్పటల్లో జాయిన్ అయ్యారు. చికిత్సలో భాగంగా అతనికి వైద్యులు కరోనా టెస్టులు కూడా నిర్వహించారు అయితే దురదృష్టవశాత్తు ప్రణబ్ ముఖర్జీ గారికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

ఈ విషయంపైనే ప్రణబ్ ముఖర్జీ గారే తన ట్విట్టర్ ద్వారా ప్రజలందరికీ తన యొక్క మిత్రులకు ఈ ఇరవై రోజుల్లో తనను కలిసిన వారికి కూడా క్వారంటైన్ లో ఉండాలని కరోనా పరీక్షలు చేయించుకోవాలని తన ట్విట్టర్ ద్వారా కోరడం జరిగింది.
నిజం గడపదాటేలోగానే అబద్ధం ప్రపంచం మొత్తం చుట్టేసి నట్టు ప్రణబ్ ముఖర్జీ గారికి ట్రీట్మెంట్ జరుగుతుండగానే అతను చనిపోయాడు అన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వైరల్ అయిన వార్తని నిర్ధారణ చేసుకోకుండానే చాలామంది ప్రముఖులు కూడా ప్రణబ్ ముఖర్జీ గారికి సంతాపాన్ని తెలుపుతూ ట్విట్టర్ వేదికగా మెసేజ్ లు చేయడం ప్రారంభించారు
ఈ వార్త విన్న కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి లోనయ్యారు అందుకే సాక్షాత్తూ ప్రణబ్ ముఖర్జీ గారి తనయుడు అభిజిత్ ముఖర్జీ మాజీ రాష్ట్రపతి గారి ఆరోగ్య స్థితిని ప్రజలకు తెలియజేసి ప్రజల్లో ఉన్న గందరగోళానికి తెరదించాడు.
ఈ సోషల్ మీడియా దెబ్బకి బ్రతికున్న విషయాన్ని కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఒకప్పుడు ఒక మనిషి చనిపోతే ఆ విషయాన్ని అందరికీ చేర్చేవారు కాకపోతే అప్పుడు నిర్ధారణ చేసుకుని ఆ విషయాన్ని అందరికీ చెప్పే వారు. కానీ ఈ సోషల్ మీడియా వాడకం అనేది పెరిగిన తర్వాత నిర్ధారించే వారి సంఖ్య తగ్గింది నిజంతో పనిలేకుండానే ప్రపంచం మొత్తాన్ని ఫేక్ న్యూస్ చుట్టేసి వస్తుంది అందువల్ల మేము చనిపోలేదు రా దేవుడా బతికే ఉన్నానని కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది.
Topic | Website |
మీ Salary ల నెలల వారీ Token Numbers తో సహా వార్షిక నివేదిక మీకోసం అందిస్తున్నాం భద్రపరుచుకోండి. | ఇక్కడ క్లిక్ చేయండి |
TS Employee Data at One Place | ఇక్కడ క్లిక్ చేయండి |