సమీర్ పరుగుల అమీర్

HCA -హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ – A1 డివిజన్ 3డేస్ ప్రీమియర్ లీగ్ ఛాంపియన్షిప్ లో

ఈ రోజు 29.12.2020 మంగళవారం హైదరాబాద్ లో స్పోర్టివ్ జట్టు vs శ్రీ చక్ర జట్టు మధ్య జరిగిన మ్యాచ్లో స్పోర్టివ్ టీమ్ ఆటగాడు

కోదాడ కు చెందిన షేక్ సమీర్ HCA 3 డే లీగ్ మ్యాచ్లో స్పోర్టివ్ క్రికెట్ క్లబ్ జట్టు తరపున ఆడి సెంచరీ సాధించడంతో కోదాడ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు ముస్కు శ్రీనివాస రెడ్డి, ప్రధాన కార్యదర్శి సాధిక్ ఆనందం వ్యక్తం చేశారు…..సమీర్ ప్రాథమిక కోచింగ్ కోదాడ క్రికెట్ అకాడమీ లో సిద్దిఖ్ వద్ద తీసుకొని ….. ప్రస్తుతం హైదరాబాద్ లో మాజీ రంజీ క్రీడాకారుడు గౌస్ బాబా వద్ద శిక్షణ తీసుకుంటున్నాడు.

ఈ సందర్భగా కోచ్ సిద్ధిఖ్ మాట్లాడుతూ సమీర్ అమితమైన ప్రతిభ గల క్రీడాకారుడు, మొదటి మ్యాచ్లో గాయం కారణంగా బ్యాటింగ్ చేయలేదు కానీ … తన ఫిట్నెస్ వలన గాయం నుండి తొందరగా కొల్కొని రెండవ మ్యాచ్లో అద్భుతంగా 163 పరుగులు చేశాడు…రాబోయే మ్యాచ్లో ఇదే విధంగా ఆడి రంజీ జట్టులో చోటు సంపాదించాలని కోదాడ కు మంచి పేరును తీసుకురావాలని కోరారు.

సమీర్ తండ్రి మస్తాన్ సూర్యాపేట జిల్లా, మేళ్ళచేరువు మండలం, హేమ్ల తండ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగ పనిచేస్తున్నారు.