అమ్మ చెప్పిన కథలు 3.

Advertisements “సమయస్ఫూర్తి” మన దేశానికి స్వాతంత్య్రం రావాటానికి సరిగ్గా యాభై సంవత్సరాలకు ముందు…..చిన్న చిన్న గ్రామాలు ఉండేవి.ఎక్కడో ఒక చో ట పెద్ద పట్టణాలు ఉండేవి.ఎటూ వెళ్లినా అడవులే ఉండేవి.విపరీతంగా వర్షాలు కురిసేవి.వాగులు ..వంకలు …చెరువులు నీళ్లతో కళకళలాడేవి.చుట్టూ అడవి..మధ్యలో ఆ ఊరు.ఆ ఊర్లో కొత్తగా పెళ్ళైన జంట.వీరేశం పొలం పనులు చూసుకునే వాడు. లత ఇంట్లో పని చూసుకునేది.అన్నదమ్ములు వేరు పడ్డారు.ఊరికి ఆనుకుని ఉన్న స్థలం అతని వాటాగా వచ్చింది.ఆ స్థలంలోనే ఒక పెద్ద తాటాకుల …

అమ్మ చెప్పిన కథలు 3. Read More »

Advertisements

నా పేరు నేనే మర్చిపోయాను ?? Naa peru nene marchipoyanu

Advertisements Naa peru nene marchipoyanu అది “IATA ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ పూణే . అక్కడ ఓలా క్యాబ్ డ్రైవర్ “జానీ” బుకింగ్ కోసం ఎదురు చూస్తున్నాడు. అతను ప్రతిరోజూ ఉదయం 7 గంటల కల్లా ఎయిర్ పోర్ట్ కు వస్తాడు. ఎయిర్ పోర్ట్ కి వచ్చే ,వెళ్లే ప్రయాణికులను తమ తమ గమ్యస్థానాలలో దింపి, రాత్రి 10 గంటల కల్లా ఇంటికి చేరుకుంటాడు. వీరి కుటుంబం హైదరాబాద్ నుండి పూణే కు వారి కొడుకు …

నా పేరు నేనే మర్చిపోయాను ?? Naa peru nene marchipoyanu Read More »

పంతంగి toll plaza

Advertisements గత వారం రోజుల నుంచి పంతంగి టోల్ ప్లాజా గేటు దగ్గర వాహనాల రద్దీ చూస్తే సంక్రాంతి పండుగ ముందు హడావిడి గుర్తుకొచ్చింది.లాక్ డౌన్ విధిస్తున్నారన్న వార్త కంటే కూడా బతుకుంటే బలుసాకు తిని తమ గ్రామాల్లో బతకొచ్చు…అనే భావన అందరిలోనూ ఉంది.ఇది దిగువ మధ్య తరగతి ..మధ్య తరగతి వారిలో వుందనుకుంటే పొరపాటు.స్థితి మంతుల్లో కూడా బతుకు భయం పట్టుకుంది.పట్టణాలు ..నగరాలు ఇక ఏమాత్రం సేఫ్ ప్లేసులు కావని..ఈ రోజు కరోన వచ్చింది..ముందు ముందు …

పంతంగి toll plaza Read More »

అమ్మ చెప్పిన కథలు 2

Advertisements అమ్మ చెప్పిన కథలు 2 దువా (ప్రార్ధన)ఖలీఫాలు రాజ్యాలను పరిపాలించే రోజులవి.పర్షియా దేశానికి దగ్గరలో ఉన్న యెమెన్ దేశాన్ని సద్గుణ సంపన్నుడు,న్యాయకోవిదుడు అయిన ఖలీఫా కైఫ్ పరిపాలిస్తున్నాడు.అతని పాలనలో ప్రజలందరూ సుఖంగా జీవిస్తున్నారు.ఒయాసిస్సుల నిండా నీళ్లు పుష్కలంగా ఉండేవి.ఖర్జూరపు తోటలు,గోధుమ చేలు, రకరకాల పండ్ల తోటలు,పూల వనాలు కనులకింపుగా ఉండేవి.దూర ప్రాంతాల నుండి వర్తకులు తమ సరుకులను తీసుకు వచ్చి, విక్రయించి,ఓ వారం రోజుల పాటు అక్కడే ఉండి వెళ్లేవారు.వారి వస్తువులకు పూర్తి రక్షణ ఉండేది.శుక్రవారం …

అమ్మ చెప్పిన కథలు 2 Read More »

అమ్మ చెప్పిన కథలు 1 – sheru

Advertisements “శ్రమజీవి”……… ఎగసిపడే అలలతో అల్లకల్లోలంగా ఉంది సముద్రం.చేపల వేటకు వెళ్లిన వారంతా వేగంగా తెడ్లు ఆడిస్తూ తీరం వైపు వస్తున్నారు.చీకటి పడటానికి ఇంకా చాలా సమయం ఉంది కానీ నల్లటి మేఘాలు ఆకాశం నిండా కమ్ముకోవటంతో చీకటిగా ఉంది.వేగంగా గాలులు వీస్తున్నాయి.గాలి చప్పుడు..సముద్రపు అలల చప్పుడుతో కలిసి భయంకరమైన కొత్త ధ్వనులు పుట్టుకొస్తున్నాయి. బరువుగా ఉన్న తెప్పను బలమంతా ఉపయోగించి ..ఇసుకలో ఈడ్చుకుంటూ తీసుకొచ్చి అక్కడ ఉన్న పెద్ద బండ రాయికి తాడుని చుట్టూ తిప్పి …

అమ్మ చెప్పిన కథలు 1 – sheru Read More »

Good bye TIK TOK Good bye

Advertisements good bye TIK TOK good bye *** *** **ఎక్కడో ఓ మారు మూల గ్రామం…తన ఇంట్లోనే టైలరింగ్ చేసుకునే ఓ యువకుడు….సరదాగా టిక్ టాక్ లో అప్లోడ్ చేసిన అతని విడియోకి లక్షల్లో లైకులూ.. ఫాలోవర్స్..ఉన్నపళంగా సెలబ్రిటీగా మారిపోయాడు.ఇద్దరు పిల్లల తల్లి..గృహిణి…సరదాగా ఓ పాటకు అనుగుణంగా అభినయిస్తే…వారం తిరిగేసరికి tik tok సెలబ్రిటీ హోదా…బ్రతుకు తెరువు కోసం భార్యాభర్తలిద్దరూ పగలంతా కష్టపడుతుంటారు. . .ఖాళీగా వున్నప్పుడు సరదాగా తీసిన తమ ఇద్దరి వీడియో …

Good bye TIK TOK Good bye Read More »

బిస్కెట్ బాక్స్ 1 , biscuit box story

Advertisements biscuit box story శివ,శంకర్ ఇద్దరు బాల్య మిత్రులు. ఓకే ఊరు వాళ్ళు. పేదరికం కారణంగా చిన్నప్పటి నుంచి వీరిద్దరూ హైదరాబాదు లో ఒక బిస్కెట్ కంపెనీలో పనిచేసేవారు. వీరిద్దరిదీ ఒకే మాట ఒకే బాట.శివ బిస్కెట్ లను చాలా రుచి గా తయారు చేసేవాడు. తక్కువ గా మాట్లాడుతూ ఎక్కువ గా పని చేసేవాడు. శంకరేమో మాట్లాడి ఒప్పించే పనుల్లో, సేల్స్ లో మంచి అనుభవం సంపాదించ గలిగాడు. సరుకు ఎలా అమ్మాలో, మార్కెటింగ్ …

బిస్కెట్ బాక్స్ 1 , biscuit box story Read More »

అతను చెప్పిన దాంట్లో vaasthavam ఉందనిపించింది !!!!!

Advertisements vaasthavam ఒక రిటైర్డ్ ఎంప్లాయ్ ని కలవడానికి కొన్ని నెలల క్రితం అతని ఇంటికి వెళ్ళాను.తాను బైట ఎవరితోనో మాట్లాడుతున్నారు.నన్ను లోపల కూర్చోమన్నారు.ఈ మధ్యనే కట్టిన రెండంతస్థుల భవనం అది. పై అంతస్తులో విశాలమైన హాలు …గోడకు టీవీ ..రెండు కుర్చీలు వేసి ఉన్నాయి.నాలుగైదు కుర్చీలు ఓ మూలన ఒకదాని మీద ఒకటి పేర్చి ఉన్నాయి.టీవీ క్రింద చిన్న స్థూలు.. దాని మీద వాటర్ జగ్గూ..రెండు గ్లాసులు ఉన్నాయి.ఇల్లంతా ఖాళీగా వుంది.నేను ఎవరింటికి వెళ్లిన రెండు …

అతను చెప్పిన దాంట్లో vaasthavam ఉందనిపించింది !!!!! Read More »

మట్టి మనిషి

Advertisements matti manishi మట్టి మనిషి అది ఒక పల్లెటూరు. ఆ ఊళ్ళో జయమ్మ అనే ఒక మంచి మనిషి ఉండేది. ఆమెకు ఒక్కగానొక్క కొడుకు “మొద్దు”.వాడి అసలు పేరు వేరే ఉన్నా అందరూ వాణ్ని “మొద్దోడ” అని పిలవడంతో వాడికి ఆ పేరే స్థిరపడిపోయింది. మొద్దోడు పేరుకు తగ్గట్టుగానే నల్లగా, ఎత్తుగా, పొడవుజుట్టు తో బలంగా ఉండేవాడు. వీడికి దాదాపుగా పాతికేళ్ళ దాకా ఉంటాయి. వాడు మోటు మనిషి, కాయకష్టం, వ్యవసాయం, ఎడ్ల తో సహవాసం …

మట్టి మనిషి Read More »

Online Classes Dr.BVS PRASAD గారి అభిప్రాయం

Advertisements Dr. BVS PRASAD Online Classes Dr. BVS PRASAD గారి అభిప్రాయం ఆన్లైన్ టీచింగ్ మంచిదా?. కాదా?? … అనే విషయం మీద ప్రముఖ చెవి, ముక్కు, గొంతు వైద్య నిపుణులు డాక్టర్ బి.వి.ఎస్. ప్రసాద్ గారి అభిప్రాయం.1.గంటలు గంటలు చెవి లో ఇయర్ ప్లగ్స్ పెట్టుకోవటం వలన … బయటి చెవి లో ఉండే మృదు లాస్తి ఎముక దెబ్బ తింటుంది.2.నిదానంగా వినికిడి లోపాలు మొదలవుతాయి … ఎందుకంటే శబ్దం కర్ణభేరికి దగ్గర …

Online Classes Dr.BVS PRASAD గారి అభిప్రాయం Read More »

“వజ్రం”

Advertisements “వజ్రం” వజ్రం ఆకాశం నిండా నల్లని మబ్బులు కమ్ముకుంటున్నాయి.గాలి స్తంభించినట్టైంది…ఉక్కపోతగా ఉంది.చెట్లన్నీ శిలలైనట్టు..ఆకులు కూడా కదలడం మానేసాయి. సెలవులన్నీ అయిపోయాయి.చింటూకి చిన్నప్పటి నుంచి ఒక అనుమానం…ఎండలు బాగా వున్నప్పుడు..బయటకు వెళ్లి ఆడుకోలేని పరిస్థితుల్లో సెలవులు ఇచ్చి..వాతావరణం చల్లబడ్డాక ..వర్షాలు పడుతోంటే..ఆడుకునే సమయంలో స్కూలుకు పంపుతారు.ఇదెక్కడి న్యాయం…చింటూఏడవ తరగతి పాసయ్యాడు.ఇక ఎనిమిదో తరగతి చదవాలి.శ్రీశైలం వెళ్లే దారిలో ..ఎత్తైన కొండలు దాటుకుని ..లోతైన లోయల్లోకి వెళితే అక్కడ ..లోయకు పైన..కొండలను ఆనుకొని ..అడవి ప్రాంతంలో వుంది ఆ …

“వజ్రం” Read More »

SANTOSH BABU REAL HERO 1 రియల్ హీరో ” సంతోష్ బాబు”

Advertisements santosh babu “పీడకల” మంచి నిద్రఆ నిద్రలో ఓ అందమైన కలపెదవుల మీదతొంగిచూసిన దరహాసంరాబోయే సెలవుల్లో పిల్లల్ని ఊరంతా తిప్పాలిఆమెకు అందమైన చీర……. మోకాలి ఆపరేషన్ అమ్మకుకంటి పొర తొలగింపు నాన్నకుపరీక్ష పుస్తకాలు చెల్లెలికి అన్నింటి కంటే ముఖ్యంస్నేహితులని కలవాలితన వీరోచిత గాధలు చెప్పాలి” పెదవుల మీది చిరునవ్వుమాయమవక ముందే..దగ్గరలో శతృమూకల కాల్పులుధైర్యంగా ముందుకే నడకశత్రు సంహారం చేసుకుంటూ అప్పుడొచ్చింది ఆ బుల్లెట్మృత్యువుని మోసుకొస్తూకలల్ని మాత్రమే కాదు ప్రాణాన్ని కూడానిర్దయగా తీసుకెళ్లింది. భారతదేశమా మన్నించుమళ్లీ జన్మంటూ …

SANTOSH BABU REAL HERO 1 రియల్ హీరో ” సంతోష్ బాబు” Read More »

క్యారం బోర్డ్ 1

Advertisements క్యారం బోర్డ్ క్యారం బోర్డ్ అది ఒక కొత్తగా నిర్మించిన ఖరీదైన… అపార్ట్మెంట్. దాదాపుగా 50 ధనవంతులైన ఫ్యామిలీలు దీనిలో నివసిస్తున్నాయి. అపార్ట్మెంట్ బిల్డర్ కమ్ ప్రెసిడెంట్ ….శ్రీరంగరాజు గారికి ఇండోర్ గేమ్స్ అంటే చాలా ఇష్టం. తన ఒక్కగానొక్క కొడుకు “క్రిస్టోఫర్” తో సహా పిల్లలందరికీ క్యారం బోర్డ్ కోచింగ్ సెంటర్ ని అపార్ట్మెంట్ కింద ఏర్పాటు చేశాడు…. “క్రిస్టఫర్” ఒక అద్భుతమైన క్యారం బోర్డు ప్లేయర్. మెరిట్ స్టూడెంట్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ ఫస్ట్ …

క్యారం బోర్డ్ 1 Read More »

సహాయం….. ఎవరిది ?

Advertisements అది ప్రవక్త గారి కాలం. ఆ కాలంలో అందరూ పేదవారే . ఒక పూట తిని రెండుపూటల పస్తులుండే కాలం అది. మన ప్రవక్త వారు కూడా ఎన్నో సార్లు పస్తులుండటం జరిగింది . డబ్బులు ఉన్నవారు కూడా తమ సంపదను దైవమార్గంలో దాన ధర్మాలు, పేదల కొరకు ఖర్చు చేసేవారు. ఆ కాలంలో ఒక వ్యక్తి ఉండే వారు. వారి ఇంట్లో వరుసగా 4 రోజులుగా తినడానికి ఏమి లేక ఇంట్లో వారందరూ పస్తులుండేవారు …

సహాయం….. ఎవరిది ? Read More »

మన బాధ్యత లేదా?

Advertisements మన బాధ్యత లేదా? లక్షల మంది చదువుకున్న వారు ప్రయివేట్ పాఠశాలల్లో టీచర్లుగా పని చేస్తున్నారు.ఉదయం స్టడీ అవర్ పేరుతో తెల్లవారు జాము నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఏదో ఒక క్లాస్ లో ఉండాల్సిందే.తరగతిలో కూచొని పాఠాలు చెప్పకూడదు.ఎప్పుడూ నిలబడే ఉండాలి. ఏదో ఒక అనారోగ్యంతో ఒక పది నిమిషాలు కూర్చుంటే…సీసీ కెమెరాల ద్వారానో…స్పెషల్ అసిస్టెంట్స్ ద్వారానో సమాచారం తెచ్చుకొని.పిల్లల ముందే కూర్చో వద్దని సలహాలు..లేకపోతే ఆఫీస్ గదిలో అవే సలహాలు.ఎదురు జవాబు …

మన బాధ్యత లేదా? Read More »

మంగళ్ యాన్

Advertisements అది …ఆల్ ఇండియా మెడికల్ కాలేజ్ చెన్నై….. ఆరోజు ప్రొఫెసర్ హరి భరత్ కొంతమంది మెడికల్ విద్యార్థులతో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నాడు. భరత్ బాలమేధావి, తను15 సంవత్సరాల వయసులోనే మెడికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయ్యాడు. బ్లడ్ క్యాంప్ ప్రాంగణంలో ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో వర్షం……. వెంటనే ప్రొఫెసర్ భరత్ తన చుట్టూ ఉన్న కొంత మంది విద్యార్థులతో ఒక చెట్టు కిందికి చేరాడు. అదే చెట్టుపై అకస్మాత్తుగా ఒక పెద్ద పిడుగు పడింది. విద్యార్థులందరూ …

మంగళ్ యాన్ Read More »

ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించాలని అనుకుంటున్నారా ?

Advertisements అక్షర ఓ ఆశ చచ్చిన నిరుద్యోగ ఉపాధ్యాయుడా….!! గత ఇరవై సంవత్సరాలను తీసుకుంటే సగటున ప్రతి ఏడాదిన్నరకు ఒక DSC వేశారు. అందులో ప్రతిDSC కి 20000 నుండి 50000 ఉద్యోగాలు ఉండేవి.. మరి ఇప్పుడు విడుదలైన నోటిఫికేషన్ ఐదు సంవత్సరాల తర్వాత… కనీసం 30000 నుండి 50000 పోస్ట్ లు ఆశించారుకాని ఖాళీలు లేవు ఇవే ఎక్కువ అన్న రీతిలో సుప్రీం కోర్ట్ చీవాట్లతో వేసింది…కొన్ని జిల్లాలలో కనీసం ఒక్క పోస్ట్ కూడా లేదు…. …

ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించాలని అనుకుంటున్నారా ? Read More »

ప్రియ….

Advertisements ప్రియ విద్యార్థిని. చదువుల్లోనూ తెలివితేటల్లోను ఎప్పుడూ ముందే, కానీ తనది ఒక పేద కుటుంబం. పల్లెటూరు వాతావరణం. మంచి సంబంధం వచ్చిందని డిగ్రీ పూర్తికాకముందే తనను అడగకుండా సంబంధం నిశ్చయించారు. తన ఇష్టలకన్న తన తల్లిదండ్రుల సంతోషమే ముఖ్యం అనుకోని తలవంచి పెళ్లి చేసుకుంది. కొత్త వాతావరణం, కొత్త మనుషులు, కొత్త సంబంధాలు, కొత్త బాధ్యతలు, కానీ తన తెలివితేటలతో అందరి మనసును గెలిచింది.ప్రియ జీవితం కొంతకాలం వరకు ప్రేమానురాగాలతో సాగింది, వారికి ఇద్దరు పిల్లలు …

ప్రియ…. Read More »

జీవాత్మ-పరమాత్మ

Advertisements జీవాత్మ-పరమాత్మ ఓంమాతృదేవత-పితృదేవతల పాద పద్మములకు నసమస్కరిస్తూ… “ఈశ్వర: సర్వ భూతానాం సత్యశోధన తిష్ఠతి “ సమస్త ప్రానుల్లోనూ అంతర్యామిగా పరమాత్మ ఉంటాడని గ్రహించి,భూత దయ కలిగి, ఇతరుల మనస్సును నొప్పించకుండా, మితిమీరిన స్వార్ధాన్ని వీడి, అందరూ మనుగడ సాగించాలనే భావాన్ని కలిగి ఉండాలి. అలా జీవితం కొనసాగించి మరణం తర్వాత కూడా ఇతరుల హృదయాలలో జీవించగడమే అసలైన మోక్షం. అందుకే ఈ ప్రపంచంలోని ప్రజలంతా అందరి మేలును తన మేలు గా భావిస్తూ,శత్రువులను మిత్రులను సమానంగా …

జీవాత్మ-పరమాత్మ Read More »

“పుత్రోత్సాహం”

Advertisements ఇంటి ముందు కారు వచ్చి ఆగింది.ఎత్తుగా ఉన్న యువకుడు దాని లోంచి దిగాడు.తాను వచ్చేదాకా కారును పక్కన ఆపమని డ్రైవర్ కు చెప్పి గబగబా ఇంట్లోకి వచ్చాడు. అతని రాకను గమనించిన సహజ గట్టిగా నాలుగు ఇండ్లకు వినబడేలా అరిచింది.”అమ్మా… రాజా అన్నయ్య వచ్చాడు”ఆ అరుపు వింటూనే వంట గదిలోంచి ఉన్నపళంగా బైటకు వచ్చింది భారతమ్మ.ఆమెకు యాభయ్యేళ్ళ పైనే వయసు ఉంటుంది.ఆమె మొహంలో సంతోషం కొట్టొచ్చినట్టు కనబడుతోంది.“నాన్న ఎటెల్లారు ” చెల్లి ఇచ్చిన వాటర్ బాటిల్ …

“పుత్రోత్సాహం” Read More »

జ్ఞాపకం

Advertisements జ్ఞాపకం…ఓ…వాసంత సమీరం…ఓ..వెన్నెల జలపాతం…ఓ..మరుమల్లెల సౌరభం…ఓ..హరివిల్లు సోయగం…!! జ్ఞాపకం…..ఓ..మొగలి పూల పరిమళం…ఓ…మలయ మారుతంఓ…చందన లేపనం..ఓ…నందన వనం..ఓ..హిమ శైల శిఖరం..!! జ్ఞాపకం…..పెదవులపై మెదిలే… ఓ..చిరు దరహాసం…తలపులలో కదలాడే.. ఓ..సజీవ చిత్రం…కనుల వెనుక దాగిన…ఓ..సుందర స్వప్నం…మనసును తడిమే.. మమతల హారం…మరువలేని,మరపురానిఓ..తీయని గతం…!! జ్ఞాపకం….ఓ..కల్లోల సముద్రం..ఓ..కన్నీటి కెరటం…ఓ..అంతులేని విషాదంఓ..మనసుకైన గాయంఓ..చేదు అనుభవం..ఓ..చక్కని గుణపాఠం..ఓ..అమూల్యమైన జీవిత సారం!!! జ్ఞాపకం….మనసును మురిపిస్తే…అదో గొప్ప వరం…!!మనిషిని బాధిస్తే…అదే ..ఓ..పెద్ద..శాపం!!! ” శకుంతల “

గోల్డ్ కాయిన్

Advertisements గోల్డ్ కాయిన్ ఆ రోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి. ఒక ఉన్నత పాఠశాలలో ఈ సందర్భంగా సమావేశం ఏర్పాటు చేశారు. షేక్ అబ్దుల్ఖాలిక్ గారు ఆ పాఠశాలలో పనిచేసే బయాలజీ టీచర్. ఆయన గత కొన్నేళ్ళుగా ఆ పాఠశాలలో పనిచేసి ఆ నెల చివరన అనగా అక్టోబర్ 31న రిటైర్ అవుతున్నారు. షేక్ అబ్దుల్ ఖాలిక్ గారు ఆ సమావేశంలో మాట్లాడుతూ… చివరన ఒక ముఖ్య ప్రకటన చేశారు. తను ఈ నెలలో ఒక …

గోల్డ్ కాయిన్ Read More »

నది నాకు ఆదర్శం

Advertisements “నది నాకు ఆదర్శం” నిండుగా పారినానీళ్లు లేక తడి ఆరినానీటి అలలతో సవ్వడి చేసినాఎండిన ఇసుకతో జారినానది నాకు ఆదర్శం*ప్రవహించిన చోటల్లాపొంగిన వాగులైఏపుగా పెరిగిన పొలాలైగొంతు తడి చేసే అమృతమైబ్రతుకునిచ్చేనది నాకు ఆదర్శం*కదిలే దారిలోపర్వతాలు ఎదురొచ్చినావంకలు దారి మార్చినాఅడవులు ఏమార్చినాఆగకుండానడక ఆపకుండాతడబడక ముందుకు సాగేనది నాకు ఆదర్శం*రాళ్లున్నా..ముళ్ళున్నా..అడ్డంగా ఏమొచ్చినాముందుకు సాగటమేగమ్యం చేరటమే తెలిసిననది నాకు ఆదర్శం. షేరూ.

మార్పుకి ముందడుగు

Advertisements కొన్ని సంత్సరాల ముందు వరకు మన పిల్లలు యువకులు ఆసక్తికరమైన విషయాలను కనుగొనడం చూసేవాళ్ళం…. పలానా ఉళ్లో ఓ పిల్లాడు ఈ పరికరం తయారు చేశాడు,పలానా ఊళ్ళో ఓ పాప ధైర్యాన్ని ప్రదర్శించింది,పలానా చోట అక్కడి యువత కలిసి ఒక సమస్యను పరిష్కరించారు…. మొదలగునవి. కాని ఇప్పుడు ఈరోజుల్లో…… ఒక 10 సంవత్సరాల బాబు pubg ఆడుతూ బిల్డింగ్ పైనుంచి దూకి చనిపోయాడు,టిక్ టాక్ చేస్తూ చనిపోయాడు, బైక కోసం ఆత్మహత్య చేసుకున్నాడు,మొబైల్ కోసం తల్లిదండ్రుల …

మార్పుకి ముందడుగు Read More »

విడియో గేమ్

Advertisements కిట్టు 12 సంవత్సరాల చురుకైన పిల్లవాడు. తెలివైనవాడు అందరితో కలిసిమెలిసి ఉండేవాడు. వాళ్ళ అమ్మానాన్నలు ఒక్కగానొక్క కొడుకును అల్లారుముద్దుగా పెంచుకునేవారు. ఒకరోజు వాళ్ల నాన్న ఒక కొత్త ఫోన్ ఒక కొత్త సిమ్ కొన్నాడు. పాత ఫోన్ని అలాగే ఇంట్లో ఉంచాడు. క్రమంగా కిట్టు ఆ ఫోన్లో లో రకరకాల గేమ్స్ ని డౌన్లోడ్ చేసి ఆడే వాడు. ఒకసారి ప్లే స్టోర్ లో “Look & Smile”అనే కొత్త గేమ్ విడుదలైంది. దీనినే డౌన్లోడ్ …

విడియో గేమ్ Read More »

న్యాయం

Advertisements ఒక భూమి విషయంలో యూదులకు , ముస్లింలకు వివాదం ఏర్పడింది. అది వాళ్ళ వాళ్ళ తాతముత్తతలకు చెందినది అని ఇరువురు గొడవపడుతుంటారు మరి సమస్య తేలాలంటే ఎవరో ఒకరు న్యాయం చెప్పాల్సిందే అయితే అప్పుడు యూదులు అంటారు ” మొత్తం మక్కా నగరంలో అబద్దం చెప్పనివారు , అధర్మం చెయ్యనివారు ఒకే ఒక్కరు అక్కడికి వెళ్దాం ” దానికి ముస్లింలు ” అలా ఎలా ? మా మతపెద్దల దగ్గర వెళ్దాం ” అనిర్ వాదించినా …

న్యాయం Read More »

“సగం జీతంతో సర్దుకు పోయేదెట్ల”

ఏ ఇద్దరు ఉద్యోగస్తులు కలిసినా ఇదే ముచ్చట..ఎవరి ముఖంలోనూ ఆనంద వీచికలు కనబడటం లేదు.
ఉద్యోగి అనగానే అతనేదో పూల పానుపు మీద ఊరేగే అదృష్టవంతుడు అనుకుంటారు చాలామంది.ఆ ఉద్యోగి మీద ఆధార పడిన తల్లిదండ్రులు.. పెళ్లి కావాల్సిన చెల్లెలు..ఉద్యోగం కోసం వెదికే తమ్ముడు…పెళ్లి కేదిగిన కూతురు..పిల్లల చదువులు..ఇలా చెప్పుకుంటూ చాలా ఉంటాయి.

సాహసం

Advertisements కృష్ణ బెంజిమన్ 14 సంవత్సరాల కుర్రవాడు.ఇతని తల్లి కృష్ణకుమారి తమిళియన్. ఇతని తండ్రి నికోలస్ బెంజిమెన్ బ్రిటీషర్. ఈ కుర్రవాడు అచ్చం తన నాన్న లాగే తెల్లగా బంగారపు రంగు జుట్టుతో ఆకుపచ్చ కళ్ళతో విదేశీయుడు లా ఉంటాడు. ఇతనికి తల్లిదండ్రులు అంటే చాలా ఇష్టం.కాని ఇతని అమ్మానాన్నలు గత 2సం త్సరాలుగా కనబడటం లేదు. ఎటు వెళ్లారు? ఎక్కడ ఉన్నారు? సమాచారం లేదు. రెండేళ్లుగా వాళ్ళ తాత ఇతడ్ని రహస్యంగా పెంచుతున్నాడు .వాళ్ళ తాత …

సాహసం Read More »

మరణానంతర జీవితం

మరణానంతర జీవితం
మరణానంతరం మరొక జీవితం ఉన్నదా? లేదా? ఉంటే ఏ రూపంలోఉంది? ఈ ప్రశ్న యదార్థంగా మన బుద్ధికందని విషయం. ఎందుకంటే మృత్యువు సరిహద్దుకు ఆవల ఏమయినా ఉందో లేదో చూడటానికి కావలసిన కళ్ళు మనకులేవు. అక్కడి ధ్వనిని వినగలగటానికి అవసరమయిన చెవులు కూడ మనకు లేవు. అటు ఏముందో పరిశోధించి తెలుసుకోవడానికి ఎట్టి పరికరాలు కూడా మన వద్ద లేవు. అంటే మరణానికి తదుపరి మరో జీవితం ఉందా లేదా అనే ప్రశ్న వైజ్ఞానిక శాస్త్ర పరిధిలోనికి రాదు.

కామయ్యతోపు – మామిడి తోట

Advertisements గిరీషుడు కంబోళ రాజ్యానికి రాజు. ఆయన కోట వెనుక ఒక పెద్ద మామిడి తోట ఉండేది.ఆ తోటలోని మామిడి పండ్లు ప్రత్యేకమైనవి. గుమ్మడి కాయ సైజులో ఉండే ఆ మామిడి పండ్లు కేవలం రాజు గారి కి మాత్రమే. మరెవరు తినడానికి గానీ చూడటానికి గానీ వీలు లేదు. కారణం రాజుగారి పూర్వీకుల నుండి రాజులు మాత్రమే తినవలసిన ప్రత్యేక ఔషధగుణాలున్న అత్యంత తీపి కలిగిన మామిడి పళ్ళు. ఇవి చెట్టుకు కొన్ని మాత్రమే కాసేవి. …

కామయ్యతోపు – మామిడి తోట Read More »

చెక్క బొమ్మ

చెక్క బొమ్మ
నసీమా అనే 10 సంవత్సరాల పాప వారి తల్లిదండ్రులతో కలసి ఆ అడవికి వెళ్లి అడవిలో దొరికే తేనె ఇతర పండ్లను తెచ్చి వాటిని వారానికి ఒకసారి సంతలో అమ్మి దానితో వచ్చిన సొమ్ముతో బ్రతికే వాళ్ళు. ఒకరోజు వారు ముగ్గురు తేనె కోసం అడవిలో వెతుకుతూ ఉండగా ఒక చెట్టు తోర్రలోకి చూశారు అక్కడ వారికి ఒక చెక్క బొమ్మ కనిపించింది ఆ బొమ్మ ఆ పాపకు కు బాగా నచ్చింది వారి తల్లిదండ్రులు తేనెపట్టు నుండి తేనెను సేకరించే లోగా ఆ పాప చెక్క బొమ్మ తో ఆడుకో సాగింది. సీసాలలో పట్టగా మిగిలిన తేనే ను నసీమా

“అమ్మ మాట”

Advertisements చాలా సంవత్సరాల క్రిందట…చిన్న చిన్న రాజ్యాలు …వాటి చుట్టూ దట్టమైన అడవులు.. కొండలు…స్వచ్ఛమైన నదులు…….అలాంటి ఒక రాజ్యంలో వీరవరం అనే ఊరు ఉంది.దాని పక్కనే నది ప్రవహిస్తోంది.అన్ని కాలాల్లోనూ నది నిండా నీళ్లుండటం దాని ప్రత్యేకత.పైన ఎక్కడో కొండల్లో పుట్టి ఇక్కడి దాకా వచ్చి ..ఇక్కడ నుంచి క్రిందకు ఎంత దూరం పోతుందో ఎవరికీ తెలీదు.ఆ ఊరికి ఉత్తరం దిక్కులో.. తాటి ఆకులతో కప్పిన పెద్ద ఇల్లు ఉంది.దాని ముందు విశాలమైన ఖాళీ స్థలం …దానిలో …

“అమ్మ మాట” Read More »

ప్రేమా ? స్వర్థమా ?

అనగనగా ఒక అడవిలో ఎన్నో విశాలమైన చెట్లు……. ఒక చెట్టుపై రెండు ప్రేమ పక్షులు ఆ రెండు

పక్షులు ఎంతో ప్రేమగా సంతోషంగా జీవనం సాగించేవి…ఒకరోజు ఆడపక్షి మగపక్షి తో ఇలా అంది  “మనం చాలా కాలంగా కలిసి నివసిస్తున్నాము ఏదైనా కారణం వల్ల నువ్వు నన్ను వదిలి వెళితే నేను ఎలా ఉండగలను అనే ఊహే నన్ను కలవర పెడుతుంది నువ్వు లేకుండా నేను ఒక్క క్షణమైనా బ్రతకలేను”.

మీకు తెలుసా… ????

pre conceived notion, కంఫర్ట్ జోన్, వార్ మాంగర్స్…….. పేపర్ చదువుతుంటేనో…ఎవరైనా మాట్లాడుతూ ఉంటేనో..కొన్ని కొన్ని పదాలు మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి.విషయం అర్ధమైనట్టుగా ఉంటుంది కానీ ఆ కొత్త పదాలు అర్ధం కావు.ఎవరినైన అడుగుదామనుకుంటే…’ఇది కూడా తెలియదా’ అని అనుకుంటారని …తమను తక్కువ చేసి మాట్లాడుతారేమోనని మనసులో శంక.తెలియకపోయినా తెలిసినట్టే నవ్వేసి ఊరుకుంటాం.కానీ మనసులో ఏ మూలనో ఇది తొలిచేస్తూ వుంటుంది.
అలాంటి మూడు ముఖ్యమైన పదబంధాల గురించి తెలుసుకుందాం.

కరోనాలో మానిషే భగవంతుడు

కరోనాలో మానిషే భగవంతుడు
అందుకే నేమో యుద్ధంలో రాజు శత్రువులను చంపితే వీరుడంటారు …
అదే రాజు తనవారి ఒక్కరి ప్రాణం కాపాడిన దేవుడు అంటారు..

చదివే అలవాటును కోల్పోతున్నారా జనం..!!!!!!

పరీక్షల కోసం…ఉద్యోగాల కోసం తప్ప పుస్తకాల జోలికి ఎవరూ వెళ్ళటం లేదు.వాటి కోసమే తప్ప మరెందుకు చదవాలి…మరే ఉపయోగము లేదా….

లాక్ డౌన్ గీతలు…. ఒక నవ్వు

Advertisements లాక్ డౌన్ గీతలు.. పేదవాడి చూపేప్పుడూపైకేచుక్కల్లో చిక్కిన ధరలుతన చేతికిచిక్కేనా అని…. ఒక నవ్వు.… మనసులో మాలిన్యాన్ని కడిగేస్తూ..కళ్ళల్లో ప్రేమను ఒలక బోస్తూ..స్నేహాన్ని కాంక్షిస్తూ..శత్రుత్వాన్ని దూరం చేస్తూ..బోసి నవ్వులతో మొదలై…తొలి యవ్వనపు చిహ్నలై..సంసారపు సరిగమలై….సంతానపు ఫలాలై….నవ్వులు పూయించటమేజీవితం.. నేటి రోజుల్లో…రేపటి బ్రతుకే ప్రశ్నయితే…మిగిలిందేమిటి…ఒక్క నవ్వే…సకల జబ్బుల హరణంకోట్ల డబ్బుల సమానంతోటి మనిషికిమనిషి గా మనమిచ్చే బహుకరణంఈ చిన్న నవ్వే… -షేరూ

లాక్ డౌన్ లో…… ఇల్లాలు

Advertisements వీధి అంతా లాక్ డౌన్..ఊరంతా లాక్ డౌన్…రాష్ట్రం….దేశం…ప్రపంచం …అంతా లాక్ డౌన్….టీవీల్లో వార్తలు…నిజాలో అబద్ధాలో చూడక తప్పదు …చేతిలో వెచ్చని టీ…సమయసందర్భం లేకుండా..ఎల్ల వేళలా టీ…జాబ్ కెళ్లక నెల దాటింది.ఇంట్లో కూచోని కూచొని విసుగు పుడుతోంది.బద్దకం అలవాటైంది.సోమరితనం దానికి తోడైంది.తిన్నాక చేయి కడుక్కునెందుకు సింక్ దగ్గరికి కూడా పోలేనంత బద్దకం…“నాన్న ఈ రోజు బజ్జీలు తింటే ఎలా ఉంటుంది.”చింటూ గాడి కోరిక.“బజ్జీ మిరప కాయల్లేవు.”రివ్వున సమాధానం వంటింట్లోంచి బయటకు వచ్చింది.“సరే ఉల్లిగడ్డలున్నాయిగా..బజ్జీలు కాకపోతే పకోడీలతో సరిపెట్టుకుంటాం”… …

లాక్ డౌన్ లో…… ఇల్లాలు Read More »

నాకు రోల్ మోడల్ ఎవరు ?

Advertisements నాకు రోల్ మోడల్ ఎవరు?ఈ ప్రశ్న పదేపదే నాకు నేనే వేసుకున్నాను.నా చిన్ననాటి బడి సంగతులు నుంచి ఇప్పటిదాకా జరిగిన అన్నీ విషయాలు గుర్తుకు వస్తున్నాయి. తెలుగు నవలలు బాగా పొద్దు పోయేంతవరకూ చదివే వాడిని. మత గ్రంథాల కన్నా అభిమాన రచయితల కథలే బాగా చదివేవాడిని.ఆ రచయితలు నాకు రొల్ మోడలా…ఎందుకో మనసు అంగీకరించించటం లేదు.మరీ సినిమాల హీరోలు…నిస్సందేహంగా కారు.. సారా తాగిన వాడికి కొద్దిసేపు ఆ మత్తు ఉంటుంది.ఈ సినిమాలు కూడా అంతే…చూసినంత …

నాకు రోల్ మోడల్ ఎవరు ? Read More »