నది నాకు ఆదర్శం

“నది నాకు ఆదర్శం”

నిండుగా పారినా
నీళ్లు లేక తడి ఆరినా
నీటి అలలతో సవ్వడి చేసినా
ఎండిన ఇసుకతో జారినా
నది నాకు ఆదర్శం
*
ప్రవహించిన చోటల్లా
పొంగిన వాగులై
ఏపుగా పెరిగిన పొలాలై
గొంతు తడి చేసే అమృతమై
బ్రతుకునిచ్చే
నది నాకు ఆదర్శం
*
కదిలే దారిలో
పర్వతాలు ఎదురొచ్చినా
వంకలు దారి మార్చినా
అడవులు ఏమార్చినా
ఆగకుండా
నడక ఆపకుండా
తడబడక ముందుకు సాగే
నది నాకు ఆదర్శం
*
రాళ్లున్నా..ముళ్ళున్నా..
అడ్డంగా ఏమొచ్చినా
ముందుకు సాగటమే
గమ్యం చేరటమే తెలిసిన
నది నాకు ఆదర్శం.

షేరూ.

1 thought on “నది నాకు ఆదర్శం”

  1. Remembering the song “బంగారు కలల్ని.. గుండె లోతు గాయాల్ని…కడుపులో దాచుకున్న జీవనది”…from బాహుబలి movie….good description of a river Sir…

Comments are closed.