ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించాలని అనుకుంటున్నారా ?

👩‍🦰 అక్షర

ఓ ఆశ చచ్చిన నిరుద్యోగ ఉపాధ్యాయుడా….!!

గత ఇరవై సంవత్సరాలను తీసుకుంటే సగటున ప్రతి ఏడాదిన్నరకు ఒక DSC వేశారు. అందులో ప్రతిDSC కి 20000 నుండి 50000 ఉద్యోగాలు ఉండేవి..

మరి ఇప్పుడు విడుదలైన నోటిఫికేషన్ ఐదు సంవత్సరాల తర్వాత… కనీసం 30000 నుండి 50000 పోస్ట్ లు ఆశించారు
కాని ఖాళీలు లేవు ఇవే ఎక్కువ అన్న రీతిలో సుప్రీం కోర్ట్ చీవాట్లతో వేసింది…
కొన్ని జిల్లాలలో కనీసం ఒక్క పోస్ట్ కూడా లేదు….

ఇక అసలు విషయానికి వద్దాం

ఉద్యొగం పైన ఆశతో B.ED, TTC లు చేశారు… అది పూర్తి చేసుకున్నాకా DSC పడేవరకు ఒక ప్రైవేటు పాఠశాలలో చేరుతారు…
ఇక్కడి నుండి మీరు కూర్చున్న కొమ్మను మీరే నరుక్కుంటున్నారు…

ఎలాగా…???

మీరు చేరగానే ఆ పాఠశాల కరస్పాండెంట్ ఆరా తీస్తాడు అక్కడ ప్రభుత్వ పాఠశాల కు వెళ్ళుతున్న విద్యార్థుల గురించి..ఇంకే మీకు ఒక ఆశ చూపుతాడు..ఆ పిల్లలను మన బడికి తీసుకురా నీకు మంచి జీతం ఇస్తాననో లేదా ప్రతి విద్యార్థి మీద కమీషనో ఇస్తాననో ఆశ పెడుతాడు..
అంతే ఇక స్క్రిప్టు సిద్దం చేసుకొని బయలు దేరుతావు…మీ పిల్లలను మా బడికి పంపండి అంటావు..వాళ్ళు వినకపోతే మొదలు పెడుతావు.
-అసలు ఆ ప్రభుత్వ బడిలో ఏమన్న సదువు చెప్పుతండ్రా..??
– సార్లు టైంకు వత్తండ్రా…??
– అసలు సార్లు ఎంత మంది ఉన్నరు..??
-అక్కడ ఏమన్న సౌకర్యాలు ఉన్నయా చెప్పుండ్రి అంటారు…
అస్సలు వినకపోతే స్థానిక నాయకులతోని ఒత్తిడి తెప్పిస్తరు…
ఐనా వినకపోతే సగం ఫీజు ఇయ్యిండ్రి అంటరు
-బస్సు ఫీజు కడితే చాలు అంటిరి…
-ఒక మంచి విద్యార్థి ఐతే అన్ని మాఫీ అంటివి…
ఎలాగో అలాగా మొత్తానికి ఒక్కన్ని బయటకు లాగుతావు..ప్రపంచ కప్ గెలిచినంత సంబుర పడ్డవ్..
ఆ ఒక్కని పేరు చెప్పి ఆ పిల్లాడి దోస్తులను లాగేశావు.ఆ ప్రభుత్వ బడులలో సంఖ్యతగ్గిపోయింది..ఘనకార్యం సాధించానని గర్వపడ్డావు…
ఓ రెండు సంవత్సరాలు గడిచాయి…
ఆ బడులలో రేషనలైజేషన్ జరిగింది…
ఆ బడులలో ప్రభుత్వం పోస్ట్ లను తగ్గించింది…
జీరో ఉన్నచోట బడి తీసేశారు…
ఇద్దరు ఉన్నకాడ ఒక్కరయ్యారు..
నలుగురు సార్లు ఉన్నకాడ ఒక్కరిద్దరికి వచ్చారు…
ఇదంతా నీవు నీ విజయం చెప్పుకున్నావు….
ఇంకేంటి ఆ ప్రైవేట్ పాఠశాలకు నీతో పని మెల్లగా నిన్ను వదిలించుకోవాలని చూస్తుంది..ఎందుకంటే కొత్తగా బి.ఎడ్, టి.టి.సి చేసినవారు నీ కంటే తక్కువ జీతానికి పని చేయడానికి సిద్దంగా ఉన్నాడు…
అంతే నిన్ను గెంటేస్తాడు ఎందుకంటే ఇంకో పాఠశాల లో జాయిన్ అవుతావు..అక్కడ పని పూర్తికాగే మళ్ళీ గెంటేస్తాడు..
మళ్ళీ కొత్తది …మళ్ళీ మళ్ళీ ఇక విసుగు వస్తుంది..
అప్పుడు అనిపిస్తుంది ప్రభుత్వ ఉద్యోగం ఐతే బాగుండని…
ప్రిపరేషన్ ప్రారంభిస్తావు…
డియ్యస్సీ పడుతుంది…
తక్కువ పోస్ట్ లతో కాని రాదు…
ఈ మళ్ళీ పడుతుంది…
ఈ సారి ఇంకా తక్కువ ఖాళీలు ఎందుకంటే కొత్తగా నీ స్థానం లో వచ్చినవారు నీ కంటే రెట్టించిన ఉత్సాహం లో ప్రభుత్వ పాఠశాలలను కొళ్ళగొడుతున్నాడు కాబట్టి.

అలా విద్యా చక్రం తిరుగుతునే ఉంటది ప్రభుత్వ పాఠశాలలో రోజు రోజుకు ఖాళీలు తగ్గుతాయి..
మెల్ల మెల్ల బడులు కూడా తగ్గుతాయి…

ఆ తరువాత పాత్చాతాపం పడినా ప్రయోజనం ఉండదు.

చదువుతున్నప్పుడు కఠినంగా ఉన్నా ఇదే పచ్చినిజం.

ప్రైవేట్ పాఠశాలలకు మీరు ఇంత చేసినా కరోనా కష్టకాలంలో కనీసం మిమ్ములను ఆదుకోలేని స్థితిలో లాభాలకై మాత్రమే వారి కన్ను ఉంటుంది.

మీ విజ్ఞానాన్ని సరైనదిశలో వాడండి. మీ ఉద్యోగాలను మీరే సృష్టించుకోండి.

ఏ శాఖలో ఉద్యోగాలైనా పరిమిత సంఖ్యలో ఉంటాయి.

ఒక్క ఉపాధ్యాయ వృత్తిలోనే ఎంతమంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లొ ఉంటే వాటికి అనుగునమైన ఉపాధ్యాయ పోస్టులు క్రియేట్ అవుతాయి.

ఇంకో విశేషం ఏమంటే…..

💥మా ఉపాధ్యాయ సంఘాలు మీకోసం DSC లు వేయాలని నిరంతరం పోరాడుతుంటాం..
కానీ
మీరు మాత్రం మేము పని చేసే బడులను మూయాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారు💥
..

ఇది ప్రతి private టీచర్.. B.,ed, TTC అభ్యర్థికి చేరేలా షేర్ చేయగలరు…

✍️శ్యామ్ కుమార్ చల్కపల్లి