కరోనా ఎఫెక్ట్ – సాఫ్ట్ వేర్ ఉద్యోగిని కూరగాయలు అమ్ముకుంటుంది

కరోనా ఎఫెక్ట్ – సాఫ్ట్ వేర్

ఉద్యోగిని కూరగాయలు అమ్ముకుంటుంది

“Yes…I can do this”

ఓరుగల్లుకు చెందిన శారద…
చదివింది ఇంజనీర్…
రెండున్నర సంవత్సరాల పాటు ఢిల్లీలో ఉద్యోగం చేసింది.
ఆ తర్వాత కరోనా కంటే మూడు నెలల ముందు  ఓ సాఫ్ట్వేర్ కంపెనీ ట్రైనింగ్ ఇచ్చి jobలో తీసుకున్నారు కరోనా కారణంగా కొత్త ప్రాజెక్టు లేకపోవడం వలన జాబ్ వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రస్తుతం రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముతుంది.

corona effect
” జాబ్ కోల్పోయినందుకు బాధగా ఉన్నా ఎటువంటి భయం లేదు, నేను ఎలాగైనా ఏ పని చేసైనా బ్రతక గలను. నా కుటుంబానికి నా అవసరం ఉన్నందున  నేను ప్రస్తుతం రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముతున్నాను. ఈ పని చేస్తున్నందుకు ఎటువంటి నామోషి లేదు నా చిన్ననాటి ఫ్రెండ్స్ టీచర్స్ ఇంజనీరింగ్ లెక్చరర్స్ నా వద్దకు వచ్చి కూరగాయలు తీసుకుంటున్నారు. అందరు కూడా నా స్ఫూర్తికి అభినందిస్తున్నారు . భగవంతుడు మనందరికీ కాళ్లు, చేతులు ,కష్టపడడానికి అవసరమైన అన్ని ఇచ్చినాడు లగ్జరీగా బతికితేనే లైఫ్ ఉంటుందని అనుకోను..”
అని సోదరి శారద చెబుతుంటే నిజంగా చాలా ఆనందాన్ని ఇస్తుంది.

*********
టీవీలో ఆ అమ్మాయి ధైర్యంగా…ఆత్మ విశ్వాసంతో ఆ మాటలు అంటూంటే…నిజంగా మారుతున్న యువతరం మీద గౌరవం పెరిగింది.వారు సమస్యలను ఎదుర్కొనే తీరు ఆదర్శనీయంగా వుంది.
సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోల్పోయిన యువతి లక్షణంగా కూరగాయల వ్యాపారం చేసుకుంటోంది.తన కుటుంబం రోడ్డు మీద పడకుండా కాపాడుకుంటోంది.
ఒక పాఠశాల ప్రిన్సిపాల్..
ఒక కాలేజి లెక్చరర్….
టీచర్లు…ఇంకా వేరే వేరే ఆఫీసుల్లో పని చేసే ఉద్యోగులు…
“యు ఆర్ ఫయర్డ్…”
అనగానే బెంబేలు పడలేదు..పూలమ్ముతూ .పండ్లమ్ముతూ …మెస్త్రి పనులు చేస్తున్నారు…ఎవరూ తక్కువ ఎక్కువలనే భేషజాలకు పోవట్లేదు.డిగ్నిటీ ఆఫ్ లేబర్ కు సార్ధకత కలిపిస్తున్నారు.
అగ్ర రాజ్యాన్ని ఎనిమిదేళ్ల పాటు ఏలిన ఒబామా..ఓ చోట పని చేస్తున్నాడు.అతని కంటే ముందున్న అధ్యక్షులు కూడా వారికి నచ్చిన పనుల్లో నిమగ్న మయ్యారు.వారెవరూ కూడా తాము గతంలో ఓ అగ్ర దేశానికి అధ్యక్షులము అనే అభిజాత్యానికి గురికాలేదు.
ఇప్పుడిప్పుడే ఈ సంస్కృతి మన దేశంలో కూడా వ్యాపిస్తోంది.చాలా హర్షణీయ పరిణామం…
కాడెద్దుల స్థానంలో ఎదిగిన కూతుర్లు తండ్రికి సహాయంగా…ఈ వార్త ఎన్ని హృదయాలను కదలించలేదు.. సోను సూద్ తన వంతు చేయూత వారికి ఇస్తాననటం స్వాగతించవలసిందే.
చిన్న చిన్న ఇబ్బందులకు ..సమస్యలకు గాభరపడిపోయి ప్రాణాలు తీసుకునే వారు వీరిని చూసి స్ఫూర్తి పొందాలి.
నేను బీఎడ్ చేస్తున్నప్పుడు. .టూర్ గురించి చర్చ వస్తే ..స్టాఫ్ అంతా మానేజ్మెంట్ వైపు ఉన్నారు. కానీ ఒక మేడం మాత్రం స్టూడెంట్స్ వైపు వున్నారు.చివరికి మేనేజ్మెంట్ దిగి వచ్చింది.ఆ మేడంని మా ఫ్రెండ్స్ అడిగారు..”మీరు ఒక్కరే ధైర్యంగా మా గురించి మాట్లాడారు.ఇది ప్రయివేట్ కాలేజ్…మిమ్మల్ని తీసేస్తే…”
“ఇక్కడ కాకపోతే వేరే చోట ఉద్యోగం చేస్తాను కాకపోతే ఓ ఐదారు నెలలు జీతం ఉండదు వేరే ఉద్యోగం దొరికే వరకు.కానీ మీకు మాత్రం ఈ వయసులో…ఈ కోర్సు చేస్తున్నప్పుడు టూర్ కు వెళ్లామన్న ఆనందం మీ జీవిత కాలం ఉంటుంది.ఆ జ్ఞాపకంల్లో నేనుంటాను.నా జాబ్ కంటే మీ ఆనందం గొప్పది కదా.. దట్స్ అల్..”అని ఆమె చెబుతూ ..చిన్నప్పుడే పోలియో వచ్చి వంకర పోయినా ఆమె కాలు …కొద్దిగా వంగిన చేయి ఆసరతో లేచి నిలబడి..శరీరం బరువంతా ఒంటి కాలు మీద వేసి నడుచుకుంటూ వెళ్ళిపోయింది.
అంగ వైకల్యం ఆమె ఆశయం ముందు ..సంకల్పం ముందు కాన రాకుండా పోయింది.
విద్యార్థుల పట్ల ఆమె అభిమానానికి….ఆమె belongingness కు తల వంచి ఆమెకు పాదాభివందనం…

sheru