
మక్కా నగరంలో ఒక ముసలావిడ ఉండేది. ఆమె మనసులో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, వారి అనుచరులు మరణించాలని కోరుకుంటూ ఉండేది.తన కోరిక నెరవేరకపోవడంతో
కొన్ని రోజుల తర్వాత ……తన యొక్క ఊరిని వదిలి వెళ్లాలని తన సామానంతా బుట్టలో పెట్టుకుని బయటకు వచ్చి కూర్చుంది ఎవరైనా కూలీ వారు వస్తారని ఎదురు చూస్తూ ఉంది. ఆమెను ఒక యువకుడు చూసి ఏమైనా సహాయం కావాలా అడిగారు అవును కూలీ వారి కోసం ఎదురు చూస్తున్నాను మీకు కావాల్సినంత కూలీ ఇస్తాను…. తన బుట్టను ఊరి బయటికి తెచ్చి పెట్టమని కోరింది… దారిపొడవునా మహమ్మద్ (స.అ.వ) ప్రవక్త గారి ని తిడుతూ అతను ఒక మాయావి అని దుర్భాషలాడుతూ ఉంది… ఊరి బయటకు వెళ్లిన తర్వాత ఇలా అంది నాయన నువ్వు చాలా అమాయకంగా ఉన్నావు నువ్వు కూడా ఊరిని వదిలి వెళ్ళిపో త్వరలో ఇక్కడ యుద్దం జరగబోతుంది … మొహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అనే ఒక మాయావి అందరిని మాయ చేసేస్తున్నాడు అతను మాటలు వినగానే అందరూ అతని వారై పోతున్నారు అందుకే నువ్వు అతని నుండి దూరంగా ఉండు అని చెప్పుకుంటు…. కూలీ ఇవ్వసాగింది … అప్పుడు యువకుడు దీనికి కూలీ ఎందుకమ్మా ఇంకా ఏమైనా పని ఉంటే చెప్పు ….. అంటూ వెళ్ళసాగారు అప్పుడు ఆమె నీ పేరైనా చెప్పు బాబు అంది…..
నా పేరు ఏమని చెప్పను దారిపొడవునా ఎవరినైతే తిడుతున్నవో ఆ మొహమ్మద్ (స.అ.వ) నేనే …..
నేను మాయావిని కాను అని చెప్పారు….. ఆ మాటలు వినగానే ఆమె ఇంత మంచి మనిషిని నేను అపార్థం చేసుకున్నది అనుకున్నది ఆమె కళ్ళలోనుంచి నీళ్ళు వచ్చాయి….ద్వేషానికి బదులుగా…….. ప్రేమను పంచండి….. ఇదే ఇస్లాం సందేశం
– SUMAYYA PARVEEN
God is great , he is looking different ways in
different persons .